Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Gold Dosa: 24 క్యారట్ గోల్డ్‌తో చేసిన బంగారు దోశ, తినాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందే
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో హౌజ్ ఆఫ్ దోశాస్ లో అత్యంత ఖరీదైన దోశ లభిస్తుంది. ఈ దోశను బంగారు పూతతో అందిస్తారు. వెన్న, నెయ్యితో పాటు ఈ దోశను సర్వ్ చేస్తారు. దోశతో పాటు మూడు రకాల పొడిలు అందిస్తారు.
మటన్ పాయా, ఖిచ్డీ ఖట్టా, దోశ, ఇడ్లీ ఈ అల్పాహారాలను హైదరాబాదీలు వారంలో ఎప్పుడో ఒకప్పుడు తింటూనే ఉంటారు. ఇందులో మిగతా వాటితో పోలిస్తే మటన్ పాయా రేటు కాస్తంత ఎక్కువే. ఇంత ధర పెట్టి రోజూ తినలేం. మటన్ పాయా కంటే ఖరీదైన దోశ ఒకటి ఉంది. దాని రేటు వింటే గుండె జారి గల్లంతు కావాల్సిందే.

మామూలుగా ఒక దోశకు, రూ. 30 నుండి రూ.80 వరకు ఉంటుంది. ఈ ప్రసిద్ధ దక్షిణ భారత వంటకాన్ని రూ.1000కి అమ్మే రెస్టారెంట్ కూడా ఒకటుంది. హైదరాబాద్ లోని హౌజ్ ఆఫ్ దోశాస్ లో ఒక దోశ ధర అక్షరాల వెయ్యి రూపాయలు. అంత ధర ఉండటం వెనక ఓ బంగారంలాంటి కారణం ఉంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో హౌజ్ ఆఫ్ దోశాస్ లో అత్యంత ఖరీదైన దోశ లభిస్తుంది. ఈ దోశను బంగారు పూతతో అందిస్తారు. వెన్న, నెయ్యితో పాటు ఈ దోశను సర్వ్ చేస్తారు. దోశతో పాటు మూడు రకాల పొడిలు అందిస్తారు.
ఈ బంగారు దోశను తయారు చేయడానికి 24 క్యారెట్ గోల్డ్ ఉపయోగిస్తారు. వేయించిన జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తారు. పూర్తిగా తినదగిన విధంగా తయారు చేస్తారు. బంగారు రేకులతో అద్దిన బంగారు దోశను ఎలాంటి సంశయనం అవసరం లేకుండా తినొచ్చు.
ఈ బంగారు దోశను తినాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. వారి గోల్డెన్ దోశకు ఫ్యాన్స్ పెరిగిపోయారని వెల్లడించారు.
ఈ గోల్డెన్ దోశను ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే తయారు చేసి సర్వ్ చేస్తారు. హౌజ్ ఆఫ్ దోశాస్ లో లభిస్తున్న ఈ దోశ అత్యంత ఖరీదైనది. అందుకే ఈ దోశను తినేవారి సంఖ్య కూడా చాలా తక్కువ. కేవలం రోజుకు 10 దోశల వరకు మాత్రమే అమ్ముడవుతున్నట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
హౌజ్ ఆఫ్ దోశాస్ లో బంగారు దోశతో పాటు విభిన్న దోశలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ డ్రైఫ్రూట్ దోశ, నుటెల్లా చాక్లెట్ దోశ, పిజ్జా దోశ సహా ఇతర భిన్న రుచులతో కూడిన దోశలు లభిస్తాయి.



Click it and Unblock the Notifications
