Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గురించి మనం నమ్మలేని నిజాలు...
వైస్ ప్రెసిడెంట్ గా తొలి నల్లజాతియురాలిగా ఎన్నికైన కమలాహ్యారిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఇప్పుడు కరోనా వేవ్ తగ్గిపోయింది... ఎలక్షన్ వేవ్ ప్రారంభమయింది. ఇటీవలే దుబ్బాక దంగల్ ముగిసింది.. బీహార్ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. వీటన్నింటి ఫలితం ఎలా ఉండబోతుందనే విషయం నవంబర్ 10వ తేదీన తేలబోతోంది. అయితే వీటన్నింటిని మరచిపోయేలా చేసింది అమెరికా ఎలక్షన్.

ఎందుకంటే అక్కడ డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ను మట్టి కరిపించారు. పోటాపోటీగా జరిగిన కౌంటింగ్ లో విజయం బైడెన్ నే వరించింది. ఈయన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

మరోవైపు, ఇదే ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అదే పార్టీ తరపున కొత్త రికార్డు నెలకొల్పారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ అండ్ సౌత్ ఏషియన్ అయిన ఈమె ఉపాధ్యక్ష పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఎవరు? అధ్యక్ష పదవికి అభ్యర్థిగా అనుకున్నప్పటికీ.. ఆమె ఎందుకని, దాన్ని ఉపసంహరించుకున్నారు.. జో బైడెన్ కు ఎందుకని మద్దతు ఇచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కమలా జననం..
కమలా హ్యారిస్ 1964, అక్టోబర్ 20వ తేదీన ఆక్లాండ్ లో జన్మించారు. ఈమె తల్లి తమిళనాడులోని ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన వారు. తండ్రి జమైకా దేశానికి చెందిన వారు. ఈమె తల్లి పేరు శ్యామల గోపాలన్ హారిస్, తండ్రి పేరు డొనాల్డ్ హారిస్. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు. ఆమె తల్లి ఒక క్యాన్సర్ సైంటిస్ట్.

కమలా విద్యాభ్యాసం..
కమలా హ్యారిస్ వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. యూసీ,హోస్టింగ్స్, కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు.అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిదేళ్ల పాటు పని చేశారు. ప్రధానంగా చిన్నపిల్లలపై జరిగే హింసకు సంబంధించిన కేసులను ఎక్కువగా విచారించారు.

ఒబామా హయాంలో..
అదే సమయంలో బరక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన కంట పడ్డారు. అనంతరం ఆమె డెమొక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియా సెనెటర్ గా ఎన్నికయ్యారు.

తమిళనాడులో ప్రత్యేక పూజలు..
కమలా హారిస్ అమెరికాలో విజయం సాధించడం కోసం తమిళనాడులోని తులశాంతిరాపురంలో ప్రత్యేక పూజలు కూడా చేశారట. హారిస్ తాత పివి గోపాలన్ చెన్నై నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో నివసించారు.

దాదాపు 90 నిమిషాల చర్చ..
కమలా హారిస్ ఎన్నికల్లో విజయం సాధించడానికి జరిగిన చర్చలో, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మరియు కమలా హారిస్ మధ్య దాదాపు 90 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో కమలాహారిస్ ప్రధానంగా దేశంలో కరోనా వైరస్ పై పోరాడటంలో ప్రభుత్వ సడలింపుల వైఖరిని లక్ష్యంగా చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం..
కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ వరకు రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగింది. ఆమె మొట్టమొదటిసారిగా 2003లో శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ జిల్లా అటార్నీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా చేశారు. అనంతరం 2017లో కాలిఫోర్నియా నుండి యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా చేసిన రెండో నల్ల జాతి మహిళగా రికార్డు నెలకొల్పారు.

అధ్యక్ష ఎన్నికలకు..
ఆమెకు క్రమంగా ప్రజల్లో ఆదరణ పెరగడంతో హారిస్ 2019 జనవరి 21న అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అయితే అక్కడ జరిగిన అనూహ్య పరిణామాల వల్ల అదే ఏడాది డిసెంబర్ 3న ఎన్నికల రేసు నుండి తన పేరును ఉపసంహరించుకున్నారు. అప్పటినుండి ఆమె జో బైడెన్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు.



Click it and Unblock the Notifications