Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
Mary Kom Birthday Special : బాక్సర్ గానే కాదు... ఆమెలో మరో టాలెండ్ కూడా... అదేంటంటే...
బాక్సింగులో తను చూపిన ప్రతిభకు ఎన్నో అత్యున్నత పురస్కారాలు సైతం ఆమెకు దక్కాయి. రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్, అర్జున అవార్డులు సైతం ఆమెను వరించాయి.
మహిళల బాక్సింగ్ లో ఏకంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సాధించింది మేరీ కోమ్. 2012 నుండి ఇప్పటిదాకా బాక్సింగులో తను చూపిన ప్రతిభకు ఎన్నో అత్యున్నత పురస్కారాలు సైతం ఆమెకు దక్కాయి. రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్, అర్జున అవార్డులు సైతం ఆమెను వరించాయి.

మహిళల బాక్సింగ్ లో భారత్ తరపున ఒలింపిక్స్ లో పాల్గొనడమే గొప్ప అనుకునే రోజుల్లో.. మేరీ కోమ్ ఏకంగా పతకాన్ని సాధించి చరిత్ర పుటలకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు మార్చి 1వ తేదీన మేరీ కోమ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెలో బాక్సింగ్ తో పాటు మరో అద్భుతమైన ప్రతిభ కూడా దాగి ఉన్న విషయం అతికొద్ది మందికే తెలుసు. ఆమెలో ఉన్న మరో టాలెంట్ ఏంటో ఇటీవలే ప్రపంచానికి తెలిసింది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

బాక్సింగ్ తో పాటు...
మేరీ కోమ్ బాక్సింగులో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించినప్పటికీ, ఆమెలో మరో కోణం తెలిసి అందరూ షాకయ్యారట. ఇంతకీ బయటి ప్రపంచంలో అతి కొద్ది మందికే తెలిసిన ఆ టాలెంట్ ఏంటంటే.. ఆమె బాక్సింగ్ తో పాటు సింగింగ్ కూడా చేస్తుందట.

గోవాలో సింగర్ గా..
అయితే ఇటీవల గోవాలో జరిగిన ఓ వేడుకలో మేరీ కోమ్ తనలో ఉన్న సింగర్ టాలెంట్ ని బయట పెట్టారు. అది ప్రతి సంవత్సరం జరిగే గోవా ఫెస్ట్ లో ఆమె పాల్గొనడమే కాకుండా.. అద్భుతంగా పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఉత్సవంలో..
గోవాలో జరిగిన ఈ ఉత్సవానికి ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మేరీకోమ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు కల్కి, పంకజ్ త్రిపాఠిలను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మన మహిళా స్టార్ బాక్సర్ తనలో దాగున్న సింగర్ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేశారు.

తొలిసారి కాదు...
స్టార్ బాక్సర్ అలా ఈవెంట్లలో పాడటం తొలిసారేమి కాదండోయ్.. అంతకుముందు కూడా ఓ ఈవెంట్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ఓ క్లాసిక్ పాటని మేరీ కోమ్ పాడి ఆహూతులను అలరించారు. అలా ఆమె బాక్సింగులోనే కాదు... పాటలు పాడటంలో కూడా నెంబర్ 1 అని నిరూపించుకున్నారు.

తన ప్రేరణ...
తాను బాక్సింగ్ ఫీల్డ్ లోకి రావడానికి తనకు లెజెండరీ బాక్సర్ మహమ్మద్ అలీ ప్రేరణ అని మేరీ కోమ్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాగే సినిమా నటులైన జాకీ చాన్, అక్షయ్ కుమార్ చిత్రాల్లో చేసిన యాక్షన్ స్టంట్స్ కూడా తనకు స్ఫూర్తిగా నిలిచాయని మేరీ కోమ్ చెప్పడం విశేషం.

అథ్లెట్ల గురించి...
మేరీ కోమ్ మహిళల కోసం ఓ ఈవెంట్ లో మహిళలను ఉద్దేశించి ఓ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. బాక్సింగులో మహిళలు రాణించాలంటే బాగా కష్టపడాలి అనే విషయాలను వివరంగా తెలిపారు. భవిష్యత్తులో భారత్ నుండి ఛాంపియన్లు రాకపోతే అది ప్రభుత్వం లేదా అసొసియేషన్స్ తప్పు కాదని, కేవలం అథ్లెట్ల తప్పు అని తేల్చి చెప్పారు.

రాజ్యసభ ఎంపీగా..
ఈమె బాక్సింగులో భారతదేశానికి తెచ్చిన పేరును ఎప్పటికీ మరువలేనిది. అందుకే భారత ప్రభుేత్వం ఈమె సేవలను గుర్తించి ఈమెకు రాజ్యసభ ఎంపీగా నేరుగా అవకాశం ఇచ్చింది.
మహిళల బాక్సింగ్ లో ఏకంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సాధించింది మేరీ కోమ్. 2012 నుండి ఇప్పటిదాకా బాక్సింగులో తను చూపిన ప్రతిభకు ఎన్నో అత్యున్నత పురస్కారాలు సైతం ఆమెకు దక్కాయి. రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్, అర్జున అవార్డులు సైతం ఆమెను వరించాయి.



Click it and Unblock the Notifications
