Latest Updates
-
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి
Khushbu Sundar: కన్నతండ్రే లైంగికంగా వేధించాడు, ఎనిమిదేళ్ల వయస్సు నుండి నరకం చూశా: ఖుష్బూ సుందర్
కన్నతండ్రే తనకు 8 ఏళ్ల వయస్సు నుండి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్భూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు, తమిళం సహా ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ సుందర్. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న ఈ సీనియర్ నటి.. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు. అయితే తాజాగా తన కన్నతండ్రిపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ.. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయనని, సొంత తండ్రే తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు వచ్చినప్పటి నుండి తన కన్న తండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఖుష్బూ పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

8 ఏళ్ల వయస్సు నుండే వేధింపులు
వి ద విమెన్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ఖుష్బూ ఈ ఆరోపణలు చేశారు. తన తండ్రి తనకు 8 ఏళ్ల వయస్సు నుండి లైంగికంగా వేధించేవాడని చెప్పారు. తనకు 15 ఏళ్లు వచ్చిన తర్వాత తండ్రిపై తిరగబడటం మొదలు పెట్టానని ఖుష్బూ చెప్పారు. తనకు 16 ఏళ్ల వయస్సులో తన తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని తెలిపారు.
చిన్న పిల్లలపై లైంగిక దాడి జరిగితే ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతుందని ఈ సందర్భంగా ఖుష్బూ అన్నారు. అది వారి జీవితంలో ఓ మచ్చగా ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పారు. తన తండ్రి తల్లిని కూడా విపరీతంగా కొడుతుండే వాడని, పిల్లలను తీవ్రంగా కొట్టేవాడని ఖుష్బూ తెలిపారు.
తాను తండ్రి నుండి లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఇప్పటి వరకు తన తల్లితో కూడా చెప్పలేదని, ఇప్పుడు చెప్పినా తను నమ్మదని ఖుష్బూ వ్యాఖ్యానించారు.

ఖుష్బూ సినీ కెరీర్:
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ముంబయిలోని ఓ ముస్లిం కుటుంబంలో ఖుష్బూ జన్మించారు. 34 ఏళ్లుగా చెన్నైలో నివసిస్తున్నారు. రాజా నాన్న రాజాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ది బర్నింగ్ ట్రైన్ అనే సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. తెలుగులో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు ఖుష్బూ తొలి సినిమా. ఆ తర్వాత తెలుగు, తమిళ సహా వివిధ భాషల్లో 200 లకు పైగా సినిమాలు చేశారు. అప్పట్లో ఖుష్బూ అగ్ర నటిగా కొనసాగారు. జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. ఆతర్వాత పెళ్లి, రాజకీయాల కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ప్రస్తుతం ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు.

ఖుష్బూ రాజకీయ ప్రయాణం:
2014 జూన్ 16న ఖుష్బూ డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించింది. ఈ పదవిలో ఖుష్బూ మూడేళ్ల పాటు ఉంటారు.



Click it and Unblock the Notifications