Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలకు సర్వం సిద్ధం, పోటీ పడుతున్న కర్ణాటకకు చెందిన దివితా రాయ్
మిస్ యూనివర్స్ పోటీలకు సర్వం సిద్ధం, పోటీ పడుతున్న కర్ణాటకకు చెందిన దివితా రాయ్
ప్రపంచ సుందరి పోటీలంటే చాలా మందికి ఆసక్తి. మిస్ యూనివర్స్ పోటీలు ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కోరుకుంటారు. ఫ్యాషన్ ప్రియులు, మోడల్స్, మేకప్ ఆర్టిస్ట్స్, అందాల పోటీల కోసం సన్నద్ధం అయ్యేవారు ఇలా ఎంతో మంది ఈ పోటీలపై ఆసక్తి చూపిస్తుంటారు.

71వ వార్షిక మిస్ యూనివర్స్ పోటీ జనవరి 14, 2023 శనివారం రోజున జరగనుంది. విశ్వ సుందరి కిరీటం కోసం 86 మంది పోటీ పడుతున్నారు. ఈ విశ్వ సుందరి పోటీలను లూసియా న్యూ ఓర్లీన్స్‌లోని ఎర్నెస్ట్ ఎన్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. కొత్త విశ్వ సుందరికి ప్రస్తుత మిస్ యూనివర్స్ భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు కిరీటాన్ని అందజేస్తారు. హర్నాజ్ సంధు 2021 డిసెంబర్ 13వ తేదీన జరిగిన విశ్వసుందరి పోటీల్లో గెలుపొందారు.
మిస్ యూనివర్స్ పోటీల్లో ఎప్పుడు జరగనున్నాయి:
71వ వార్షిక మిస్ యూనివర్స్ పోటీ జనవరి 14, 2023 శనివారం రోజున జరగనుంది. ఈ విశ్వ సుందరి అందాల పోటీల్లో వివిధ దేశాల నుండి మొత్తం 86 మంది పోటీ పడుతున్నారు.
భారత ప్రామాణిక కాలమానం ప్రకారం మిస్ యూనివర్స్ 2023 పోటీలు జనవరి 15వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు జరుగుతుంది.
మహిళా నాయకత్వం:
71వ మిస్ యూనివర్స్ పోటీలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ మిస్ యూనివర్స్ పోటీలకు మొత్తం మహిళలే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆర్గనైజేషన్ కు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు.

2023 మిస్ యూనివర్స్ హోస్టు ఎవరంటే..:
2012 మిస్ యూనివర్స్ విన్నర్ ఒలివియా కల్పో మరియు 'ది రియల్' స్టార్ జెన్నీన్ మై జెంకిన్స్ 2023 విశ్వ సుందరి పోటీలకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మిస్ యూనివర్స్ 2018 కాట్రియోనా గ్రే మరియు 'యాక్సెస్ హాలీవుడ్' కరస్పాండెంట్ జూరీ హాల్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించనున్నారు.

మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుండి ఎవరంటే:
71వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుండి కర్ణాటకకు చెందిన దివితా రాయ్ పాల్గొంటున్నారు. విశ్వ సుందరి కిరీటం కోసం మిస్ యూనివర్స్ ఇండియాగా ఉన్న దివితా రాయ్ మిగతా 85 మందితో పోటీ పడనున్నారు.
దివితా రాయ్ మంగళూరులో జన్మించారు. ముంబైలో పెరిగారు. ముంబయిలోని సర్ జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చదివారు. తర్వాత మోడలింగ్ వృత్తిని ఎంచుకున్నారు. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, పెయింటింగ్ వంటి క్రీడలు ఆడతారు దివితా రాయ్.
2022వ సంవత్సర ఆగస్టు 22న మిస్ దివా ఆర్గనైజేషన్ యొక్క 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో మిస్ దివా యూనివర్స్ 2022 హర్నాజ్ సంధు చేతుల మీదుగా కిరీటాన్ని గెలుచుకుంది. హర్నాజ్ సంధు 2021 మిస్ యూనివర్స్ టైటిల్ విన్నర్ కావడం విశేషం. అంతకుముందు ఏడాది మిస్ దివా యూనివర్స్ పోటీల్లో కూడా దివితా రాయ్ పాల్గొంది. ఆ ఏడాది హర్నాజ్ సంధు పోటీల్లో గెలవగా, దివితా రాయ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
భారత ప్రామాణిక కాలమానం ప్రకారం మిస్ యూనివర్స్ 2023 పోటీలు జనవరి 15వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు జరుగుతుంది. ఈ పోటీలను ఫేస్‌బుక్, యూట్యూబ్ లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అలాగే వూట్ ఓటీటీలోనూ వీక్షించవచ్చు.



Click it and Unblock the Notifications