Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
National Best Friends Day 2021: బెస్ట్ ఫ్రెండ్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
జాతీయ స్నేహితుల దినోత్సవం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో అన్ని బంధాల కన్నా మిన్న స్నేహ బంధం. అన్నింటికంటే బలమైన బంధం కూడా స్నేహమే. అందుకే మనలో ఎవరికైనా కష్టం వస్తే.. బంధువుల దగ్గరకు వెళ్లడం కన్నా.. స్నేహితుని దగ్గరకు వెళితే.. అదీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికెళితే కచ్చితంగా సాయం లభిస్తుందని చెబుతుంటారు.

అందుకే స్నేహం కంటే లోకాన ఏదీ గొప్పది కాదన్నాడో సినీ కవి. కష్టమైనా.. నష్టమైనా.. బాధలో అయినా.. సంతోషంలో అయినా ఎప్పుడూ మన వెంటే నీడలా ఉండే వాడే నిజమైన బెస్ట్ ఫ్రెండ్.

అలాంటి అపురూపమైన ఆత్మీయ బంధాన్ని జరుపుకోవడానికి ఓరోజు ఉందని తెలుసా... అది ఎప్పుడు? దాని చరిత్ర మరియు ప్రాముఖ్యత ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బెస్ట్ ఫ్రెండ్స్ డే..
ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదో తేదీన యునైటెడ్ స్టేట్స్ అమెరికా(USA)లో నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే జరుపుకుంటారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అలాంటి స్నేహితులను గౌరవించడానికి ఈరోజు జరుపుకుంటారు. మీరు ప్రతిరోజూ వారిని కలవలేకపోయినప్పటికీ, మీ సన్నిహితులు మీకు అవసరమైనప్పుడు వెన్నెముకగా నిలవడమే కాదు.. మీకు చాలా సందర్భాల్లో భరోసా ఇస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా బెస్ట్ ఫ్రెండ్స్ ను చాలా మంది కలవలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ వేదికగా.. సోషల్ మీడియా ద్వారా మీ బెస్ట్ ఫ్రెండ్స్ కు విషెస్ మరియు ఫొటోలను పంపొచ్చు.

బెస్ట్ ఫ్రెండ్స్ డే చరిత్ర..
నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అమెరికాలో జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవంగా 1935వ సంవత్సరం నుండే ప్రారంభమైంది. యుఎస్ఎలో 1935లో కాంగ్రెస్ జూన్ 8వ తేదీన నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయించింది. కాలక్రమేణా జాతీయ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాస్త ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. ఈ వేడుకలు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీని ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటారు.

బెస్ట్ ఫ్రెండ్స్ డే ప్రాముఖ్యత..
తమ స్నేహితుల పట్ల గౌరవం, అభిమానం చూపడానికి ఈ జాతీయ బెస్ట్ ఫ్రెండ్స్ డే జరుపుకుంటారు. సాధారణంగా స్నేహితులు మనకు చాలా సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. అయితే ఆపదలో ఉన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ వస్తుంటారు. భరోసా ఇస్తుంటారు. ఈ రోజున వారి బెస్ట్ ఫ్రెండ్స్ తో కేక్ కట్ చేయించడం లేదా ఏదైనా వెరైటీ గిఫ్ట్ ఇవ్వడం వంటివి చేస్తుంటారు.

బెస్ట్ ఫ్రెండ్స్ కోట్స్..
* మన బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఎలా ఉన్నా పట్టించుకోరు.. మన దగ్గర అది ఉందా(వైన్ బాటిల్) లేదా అనేదే చూస్తారు.
* బెస్ట్ ఫ్రెండ్స్ మన లైఫ్ లోకి వచ్చాకే మనం అల్లరి పనులు చేయడం మొదలుపెడతాం.
* స్నేహితుల కోసం వెతకడం మొదలు పెడితే ఎవ్వరూ మనకు కనిపించరు. మనమే స్నేహితుడిగా మారితే అందరూ మనతో స్నేహం చేస్తారు.
*స్నేహాన్ని నిర్వచించడం మరియు వివరించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఇది స్కూల్ లో నేర్చుకునే విషయం కాదు. మీరు స్నేహం యొక్క అర్థాన్ని నేర్చుకోలేకపోతే, మీరు ఏమీ నేర్చుకోలేరు.
* స్నేహం ప్రేమ కన్నా గొప్పది. స్నేహంలో ఎప్పుడూ షేర్ చేసుకోవడం తప్ప ఇంకొకటి తెలియదు.
* మీ స్నేహితులు మీ కష్టాలను దూరం చేయకపోవచ్చు కానీ.. కష్ట కాలంలో మాత్రం మేమున్నామని భరోసానిస్తారు.



Click it and Unblock the Notifications