Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఈ న్యూ ఇయర్ రిజల్యూజన్స్ ఎదుగుదలకు, కెరీర్‌లో దూసుకుపోయేందుకు సాయం చేస్తాయి
కొత్త సంవత్సరం మంచి ఎదుగుదల కనబరచడానికి, నిన్నటి కంటే రేపు మెరుగ్గా ఉండటానికి సహాయపడే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎంచుకోవాలి. ఎలాంటి రిజల్యూషన్స్ మనిషి ఎదుగుదలకు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Life
oi-Pavan Ch
By Pavan Ch
కొన్ని అలవాట్లు మనిషి ఎదిగేందుకు దోహదపడతాయి. వ్యక్తిగత అభివృద్ధికి సాయపడతాయి. కొన్ని పనులు మనలోని జ్ఞానాన్ని పెంచుతాయి. ప్రవర్తన మెరుగుపడేలా చేస్తాయి. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి. పనిలో ఒత్తిడి, వ్యాపారంలో ఆందోళనలు కూడా మనిషి అభివృద్ధికి దోహదం చేసేవే. శారీరక శ్రమ రాటుదేలేలా చేస్తే, మానసిక ఒత్తిడి మానసికంగా దృఢంగా ఉండేలా తయారు చేస్తుంది.

ప్రతి మనిషికి ఎదుగుదల ఎంతో ముఖ్యం. వయస్సు పెరగడం వేరు ఎదగడం వేరు. 26 ఏళ్ల నుండి 27 సంవత్సరాలు రావడం వయస్సు పెరగడం. నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండటం ఎదగడం.
కొత్త సంవత్సరం మంచి ఎదుగుదల కనబరచడానికి, నిన్నటి కంటే రేపు మెరుగ్గా ఉండటానికి సహాయపడే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎంచుకోవాలి. ఎలాంటి రిజల్యూషన్స్ మనిషి ఎదుగుదలకు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శారీరక ఆరోగ్యం:
- యోగా, వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. వారానికి 4-5 రోజులు వర్కవుట్స్ చేసేలా రిజల్యూషన్ తీసుకోండి.
- కంటి నిండా నిద్రపోవడం
- ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.

మానసిక ఆరోగ్యం:
- మంచి మంచి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవండి.
- వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పనులు చేయండి.
- మానసిక ఉల్లాసం కలిగించే పనులు చేయండి.
- మెదడుకు ఎక్సర్‌సైజ్‌గా పని చేసే సుడోకు, క్రాస్‌వర్డ్స్ పజిల్స్ లాంటివి ప్రయత్నించండి.

సామాజికంగా ఏం చేయాలంటే..
- కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త భాషలు వచ్చే వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
- పబ్లిక్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడే నైపుణ్యాన్ని నేర్చుకోండి.
- తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, కుటుంబసభ్యులు, స్నేహితులతో నాణ్యమైన సమయం గడపండి.
- శ్రద్ధగా వినడం నేర్చుకోండి.
- మీరు ఇంట్రావర్ట్ అయితే వేరే వ్యక్తులతో కలవడం నేర్చుకోండి.

ఆధ్యాత్మిక వికాసం కోసం:
- రోజూ ప్రార్థనలు చేయండి.
- రోజూ ధ్యానం సాధన చేయండి.
- గొప్ప జ్ఞానుల గ్రంథాలు, పుస్తకాలు చదవండి.
- కుటుంబ పెద్దలు, మత పెద్దల వద్ద నుండి వివిధ అంశాలపై సమాధానాలు సేకరించండి.
- ధర్మ సంబంధిత కార్యక్రమాల్లో పాలుపంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగమవ్వండి.
Comments
English summary
New Year's resolutions for personal growth and career development in telugu
Story first published: Friday, December 30, 2022, 18:20 [IST]
Other articles published on Dec 30, 2022



Click it and Unblock the Notifications