Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
February 2022 : ఈ నెలలో పుట్టిన వారు ఆ విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారట...!
అస్సలు మోహమాటం పడరు. అలాగే వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు.
ఈ లోకంలో ప్రతి నెల.. ప్రతి వారం.. ప్రతిరోజూ ఎంతో మంది పుడుతుంటారు.. ఇంకా ఎంతో మంచి చనిపోతూ ఉంటారు. అయితే చావు, పుట్టుక మధ్య జరిగే సావాసంలో మనం ఏమి సాధించామనేది చాలా ముఖ్యం. బతికి ఉన్నన్నీ రోజులు సంతోషంగా గడిపామా? లేదా అన్నదే పాయింట్.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు ఏయే రంగాల్లో విజయవంతమవుతారు? ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఆసక్తికరంగా ఏమైనా ఉంటారా? వీరికి ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉంటాయా? వీరి పుట్టుకలోనే హీరో, నాయకుల వంటి లక్షణాలు వస్తాయా? వంటి వివరాలతో పాటు ఈ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వ లక్షణాల జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం ఆ లక్షణాలేంటో చూసేయండి...

చాలా వినూత్నంగా ఉంటారు..
ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు చాలా వినూత్నంగా ఉంటారు. వీరి ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారు. వీరు ఎల్లప్పుడూ కొత్తగా.. వినూత్నంగా పని చేస్తారు. వీరిని టార్చ్ బేరర్ అని కూడా అంటారు.

ముక్కుసూటిగా మాట్లాడతారు..
ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి ముక్కుసూటితనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అస్సలు మోహమాటం పడరు. అలాగే వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. నిజాయితీగా ఉండటం అసత్యాలు చెప్పడం కంటే వందరెట్లు మంచిదని వీరు భావిస్తారు. ఇలాంటి విషయాలతోనే ఇతరులను ఈజీగా ఆకర్షిస్తారు.

నమ్మకంగా ఉంటారు..
ఫిబ్రవరిలో జన్మించిన వారు మీకు తెలిసినా.. అతను లేదా ఆమె చాలా నమ్మకంగా ఉంటారు. వీరు చాలా నమ్మదగిన అని వ్యక్తి కూడా ఇతరులు చాలా ఈజీగా అంగీకరిస్తారు. ఎందుకుంటే వీరు రిలేషన్ షిప్ కు ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు అంకిత భావంతో మరియు శ్రద్ధగా పని చేస్తారు.

కాపీ కొట్టరు..
వీరు ఏ విషయాన్ని కాపీ కొట్టరు. అంతే కాదు ఒకరి ఆలోచనలను దొంగిలించడం అనేది నేరంగా భావిస్తారు. వీరంతా ఎల్లప్పుడూ వీరి నిజమైన స్వభావానికి కట్టుబడి ఉంటారు. కాపీ కొట్టడాన్ని వీరు ద్వేషిస్తారు. అంతేకాదు ఈ నెలలో జన్మించిన వారు చాలా కష్టపడి పని చేస్తారు. అంతేకాదు ప్రతి పనిని ప్రత్యేకంగా చేసేందుకు ప్రయత్నిస్తారు.

సలహాలను పాటిస్తారు..
వీరు ప్రజలు నుండి సలహాలను స్వీకరించేందుకు ఇష్టపడతారు. ఎవ్వరి వద్ద నుండి అయినా.. వారి అనుభవాలను ఎంతో కొంత నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. వీరు ఎవరినైనా ఆరాధిస్తే వారి అడుగుజాడల్లో నడుస్తారు.

జీవితాన్ని పూర్తిగా..
వీరు తమ జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. వీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. జీవిత సారాన్ని అర్థం చేసుకునే వ్యక్తితో సన్నిహితంగా ఉండాలనుకుంటారు. అందుకే చాలా మంది ఫిబ్రవరిలో జన్మించిన వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వీరికి ప్రతి ఒక్ష క్షణం ఎలా ఆనందించాలో బాగా తెలుసు.

తొందరపడరు..
వీరు ఏ పని అయినా ఆచితూచి చేస్తారు. వేగంగా చేయడానికి ఇష్టపడరు. అంతేకాదు ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చిన్న చిన్న వాటిలోనే ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు వారి చుట్టూ ఉన్న వారిని ఆనందపరిచేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల వీరు చాలా విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఎప్పటికీ వెనుకడుగు వేయరు..
వీరు ఏదైనా లక్ష్యం నిర్దేశించుకుంటే చాలా బలంగా ఉంటారు. వీరి లక్ష్యాల నుండి ఎప్పటికీ తప్పుకోలేరు. వీరు ఎల్లప్పుడూ వారి లక్ష్యాలపై శ్రద్ధ వహిస్తారు. అంతేకాదు వీరు సవాళ్లను బాగా ఇష్టపడతారు. ఇదే వీరి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి చాలా ముఖ్యమని భావిస్తారు.

మహిళలు ఉంగరాన్ని..
ఫిబ్రవరి నెలలో పుట్టిన మహిళలు తమ ఉంగరాన్ని ఎక్కువగా ఎడమ చేతికి పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. తమ వివాహ ఉంగరం అయినా కూడా అక్కడే ఉంచుకోవాలనుకుంటారు.

దయగలవారు..
వీరు చాలా దయగలవారు. ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు అహం మరియు స్వార్థానికి చాలా దూరంగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిపైనా నిస్వార్థ ప్రేమను కలిగి ఉంటారు. అంతేకాదు అవసరమైన వారికి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

తమ సంస్థను..
వీరు పని చేసే సంస్థను సొంతంగా భావిస్తారు. చాలా సైలెంటుగా తమ పనేంటో తాము చూసుకుంటారు. అంతే కాదు వీరు తమ సంస్థను బాగా ప్రేమిస్తారు. అందుకే కొంచెం ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

సోమరితనం తక్కువగా..
వీరి పనులు వీరు చేసుకోవడానికి ఇష్టం చూపుతారు. అయితే కొన్ని సమయాల్లో సోమరితనంగా ఉంటారు. పని విషయంలోనూ చాలా నెమ్మదిగా ఉంటారు. అయితే పని పట్ల ఆసక్తిగానే ఉంటారు.

కుటుంబానికి విలువ..
వీరు కుటుంబానికి చాలా ఎక్కువగా విలువ ఇస్తారు. వీరి వ్యక్తిగత జీవితం పట్ల అంకితభావంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు బదులు, తమ ప్రియమైన వారితో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే కుటుంబ బంధానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.

మానసికంగా బలంగా..
ఈ నెలలో జన్మించిన వారు మానసికంగా బలంగా ఉంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. వీరి చుట్టూ జరిగే ప్రతికూల విషయాల పట్ల వీరు ప్రభావం కారు. భావోద్వేగ స్థిరత్వాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు.



Click it and Unblock the Notifications