Latest Updates
-
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.! -
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.!
దానం మంచిదే.. కానీ వీటిని దానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే కష్టాలు తప్పవు
దానం చేయడం మంచిది కదా అని ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తే కష్టాలు తప్పవని చెబుతున్నాయి పురాణాలు. కొన్నింటిని దానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. కొన్ని వస్తువుల
దానం చేస్తే ఎంతో పుణ్యం. హిందూ పురాణాల ప్రకారం దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానం కోసం చేయి చాచే వారికి స్తోమత మేర ఏదో ఒకటి దానం చేయాలని చెబుతున్నాయి శాస్త్రాలు. నిరుపేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. అన్నదానం, విద్యాదానం, అవయవదానం, రక్తదానం ఇలా ఎన్నో దానాలు ఉంటాయి. పేదలకు దానధర్మాలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని, పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దానం చేయడం మంచిది కదా అని ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తే కష్టాలు తప్పవని చెబుతున్నాయి పురాణాలు. కొన్నింటిని దానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల సంపద తొలగిపోయి, నిరుపేదలు అవుతారు.

దానం ఎలా చేయాలి:
దానం అంటే మన వద్ద ఉన్నదానిని లేని వారికి అందివ్వడం. అయితే దానం ఎప్పుడూ నిస్వార్థంగా ఉండాలి. ఆనందమైన స్థితిలో దానం చేయాలి. నవ్వుతూ దానం చేయాలి. స్వార్థంతో, వేరే లక్ష్యంతో, ఉద్దేశంతో దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల పుణ్యం మాత్రమే కాదు, ఆశీస్సులూ వస్తాయి.
వస్తువులైన, ఆహారపదార్థాలైనా, డబ్బు అయినా చేతితో విరాళంగా అందించాలి. అంతే కానీ విసిరివేయడం, పడేయడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల దానం చేస్తే రావాల్సిన పుణ్యం రాదు. అలాగే దానం నుండి పొందాల్సిన ప్రయోజనాలు అందవు.

ఎలాంటి వస్తువులను దానం చేయకూడదు:
చీపురు:
హిందూ విశ్వాసాల ప్రకారం చీపురు అంటే లక్ష్మీ దేవి. చీపురును లక్ష్మీ దేవితో పోలుస్తారు. అలాంటి చీపురుని ఎట్టిపరిస్థితుల్లో దానం చేయకూడదు. చీపురును దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో కలహాలూ మొదలవుతాయి. అలాగే చీపురు కొనేందుకు అప్పు కూడా ఇవ్వకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

వంటింటి పాత్రలు:
వంటింటి పాత్రలు దానం చేయకూడదు. స్టీల్, గాజు, అల్యూమినియం, సెరామిక్ పాత్రలు దానం చేయవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. వంటింటి పాత్రలు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యాపారం సరిగ్గా సాగదు. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
అలాగే ఇత్తడి, వెండి, రాగి పాత్రలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పాడైన ఆహార పదార్థాలు:
దానం చేయడం మంచిదే. కానీ పాడైన వస్తువులు, చెడిపోయిన ఆహారపదార్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయవద్దు. పాడైపోయిన ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల కుటుంబసభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

నూనె:
నువ్వులు, ఆవాల నూనె దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. నువ్వుల నూనె దానం చేస్తే శని దేవుడు సంతోషిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే నూనె దానం చేసేటప్పుడు అది వాడకూడనిది అయి ఉండాలి. వాడిన నూనెను ఎట్టిపరిస్థితుల్లో దానం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications