Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
Chanakya Niti: మనిషి విధికి కట్టుబడి ఉండాలా? అదృష్టం కోసం వేచి చూడాలా? చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా?
చాణక్యుడు తన నీతి గ్రంథంలో విధి గురించి, అదృష్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మనిషి విధికి కట్టుబడి ఉండాలా లేదా.. అదృష్టం కోసం వేచి చూడాలా అనే అంశంపై చాణక్యుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెల
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, వ్యూహకర్త, జ్ఞాని, మేధావి, మార్గదర్శకుడు, రాజనీతిజ్ఞుడు.. ఇలా ఎన్నో రంగాల్లో ఆరితేరిన వ్యక్తి ఆచార్య చాణక్యుడు. ఆయన రాసిన చాణక్య నీతి గ్రంథం ఒక మనిషి ఎలా జీవించాలన్న దాని గురించి చెబుతుంది. జీవితంలో విజయం సాధించాలన్నా, పనులు సక్రమంగా సాగాలన్నా, కుటుంబంలో ఎలాంటి అపార్థాలు లేకుండా ఆనందమయం కావాలన్నా చాణక్యుడు చెప్పిన సూక్తులు పాటించాలి.

చాణక్యుడి బోధనలు నేటికీ ఆచరణీయమే. ఆయన చెప్పిన సూచనలు పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. చాణక్యుడు తన నీతి గ్రంథంలో విధి గురించి, అదృష్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మనిషి విధికి కట్టుబడి ఉండాలా లేదా.. అదృష్టం కోసం వేచి చూడాలా అనే అంశంపై చాణక్యుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితంపై విధి ప్రభావం:
చాణక్యుడి ప్రకారం, విధి అనేది మన గత చర్యల ఫలితం. విధిని ఎప్పటికీ మార్చలేము. ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట విధితో జన్మిస్తాడని చాణక్యుడు చెప్పాడు. అది వారి గత కర్మలు లేదా చర్యల ద్వారా నిర్ణయించుబడుతుంది. అయినప్పటికీ, మన ప్రస్తుత చర్యల ద్వారా మన భవిష్యత్తును మార్చగల శక్తి మనకు ఉందని కూడా చాణక్యుడు నమ్మాడు. మరో మాటలో చెప్పాలంటే మనం మన గతాన్ని మార్చలేకపోయినా, వర్తమానంలో సరైన పనులు చేయడం ద్వారా భవిష్యత్తను కచ్చితంగా ప్రభావం చూపొచ్చని చెప్పాడు చాణక్యుడు.

జీవితంపై అదృష్టం ప్రభావం:
అదృష్టం గురించి చాణక్యుడు పెద్దగా నమ్మలేదు. ఒక వ్యక్తి చర్యలే అతనిపై ప్రభావం చూపిస్తాయని, కానీ ఉందో లేదో తెలియని అదృష్టాన్ని పట్టుకుని వేలాడకూడదని చాణక్యుడు చెప్పాడు. కష్టపడి పని చేసే సరైన ఎంపికలు చేసుకునే వారికంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని చాణక్యుడు చెప్పాడు. అదృష్టానని అవకాశాలతో పోల్చి చెప్పాడు చాణక్యుడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారే నిజమైన అదృష్టవంతులు అని చాణక్యుడు బలంగా నమ్మాడు.

జీవితాలను నియంత్రించడం:
విధి మరియు అదృష్టంపై చాణక్యుడి అభిప్రాయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవి మన భవిష్యత్తును స్వయంగా రూపొందించుకునే శక్తిని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. అదృష్టం కోసం ఎదురుచూడటం లేదా విధి ఇలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అంటూ ఊర్కోవడం రెండూ చేయకూడదని చాణక్యుడు చెప్పాడు.
మన లక్ష్యాలను సాధించడానికి సరైన వాటిని ఎంపిక చేసుకోవడంలో, దాని కోసం కృషి చేయడంలోనే విజయం దాగి ఉందని చాణక్యుడు సూచించాడు. మనం మన గతాన్ని మార్చలేకపోవచ్చు, లేదా భవిష్యత్తును అంచనా వేయలేకపోవచ్చు, కానీ వర్తమానంలో ఏం చేస్తామన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దానిని సరిగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు చేయవచ్చని చాణక్యుడు చెప్పాడు. మన పనుల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చని చెప్పాడు.



Click it and Unblock the Notifications
