HYD Best Biryani Spots: అదిరిపోయే హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలా? అయితే ఇక్కడికి వెళ్లాల్సిందే

అసలు సిసలైన సువాసనలు వెదజల్లే, ఘాటైనా మసాలాలతో ఉండే మధురమైన బిర్యానీ మాత్రం కొన్ని చోట్లనే దొరుకుతుంది. మీరు మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలనుకుంటే ఈ ప్లేసెస్ కు వెళ్లండి.

బిర్యానీ అనగానే మొదట గుర్తుకువచ్చేది హైదరాబాద్. ఘుమఘుమలాడే హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే అంత ఫేమస్ మరి. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్తే మొదట మెనూ చూస్తారు చాలా మంది. అదంతా చూసి చివరికి చికెన్ బిర్యానీనే ఆర్డర్ చేస్తారు ఎక్కువ మంది. బిర్యానీ అంటే మంచి మసాలాల ఘాటు సువాసన, బాస్మతీ రైస్ అరోమా, మంచి ఘాటైన రుచి ఉండాలి. అలాంటి ఓ మాంచి బిర్యానీ తింటూ సీసాలో దొరికే థంప్స్‌అప్ తాగితే మామూలుగా ఉండదు.

Top best biryani spots in hyderabad know in Telugu

హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లినా బిర్యానీ దొరుకుతుంది. చిన్న చిన్న హోటళ్ల నుండి టాప్ క్లాస్ రెస్టారెంట్ల వరకు బిర్యానీ ఉంటుంది. అసలు సిసలైన సువాసనలు వెదజల్లే, ఘాటైనా మసాలాలతో ఉండే మధురమైన బిర్యానీ మాత్రం కొన్ని చోట్లనే దొరుకుతుంది. మీరు మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలనుకుంటే ఈ ప్లేసెస్ కు వెళ్లండి.

ప్యారడైజ్, బేగంపేట్

ప్యారడైజ్, బేగంపేట్

(Image: ParadiseFoodCourt)

చాలా సంవత్సరాలుగా బిర్యానీ తినాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అనేంతగా పేరు సంపాదించింది ప్యారడైజ్. బెస్ట్ బిర్యానీ ఎక్కడెక్కడ దొరుకుతుందన్న ప్రశ్నకు జవాబులో ప్యారడైజ్, బేగంపేట్ బ్రాంచ్ గురించి ప్రస్తావించాల్సిందే. హైదరాబాద్ వ్యాప్తంగా ప్యారడైజ్ బ్రాంచీలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ, చాలా మందికి ఫేవరేట్ బేగంపేట్ బ్రాంచే.

బావర్చీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్

బావర్చీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్

హైదరాబాదీ దమ్ బిర్యానీకి బావర్చీ బిర్యానీ అనేది పర్యాయపదంగా మారిపోయింది. ఇక్కడ దొరికే మటన్ బిర్యానీ ది బెస్ట్. చికెన్ బిర్యానీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉంటుంది బావర్చి. అయితే హైదరాబాద్ లో చాలా చోట్ల బావర్చి పేరుతో రెస్టారెంట్లు ఉంటాయి. కానీ అవేవీ నిజమైన బావర్చీ కాదు. అబిడ్స్ లో ఉండేది మాత్రమే నిజమైన బావర్చీ. తమకు ఎక్కడా బ్రాంచీలు లేవని స్పష్టంగా బోర్డు రాసి పెట్టారు.

మెరిడియన్ బిర్యానీ, పంజాగుట్ట

మెరిడియన్ బిర్యానీ, పంజాగుట్ట

మెరిడియన్ అంటే పంజాగుట్ట వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెస్టారెంట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. మంచి బిర్యానీ కావాలంటే మెరిడియన్ వెళ్లాల్సిందే.

గ్రాండ్ హోటల్, అబిడ్స్

గ్రాండ్ హోటల్, అబిడ్స్

(Image:Newsmeter)

బెస్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ దొరికే మరొక చోటు అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్. ఈ హోటల్ అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి వేళ ఔట్ సైడ్ ఫుడ్ కు కూడా ఇక్కడికి వెళ్లొచ్చు.

హోటల్ షాదాబ్, ఘాన్సీ బజార్

హోటల్ షాదాబ్, ఘాన్సీ బజార్

చార్మినార్ వద్ద మదీనాకు సమీపంలో ఘాన్సీ బజార్ లో ఉంటుంది హోటల్ షాదాబ్. ఇక్కడ మటల్ బిర్యానీ చాలా ఫేమస్. ఇక్కడ దొరికే కబాబ్ లు, హలీమ్ లు, లస్సీ ఫలూదా కూడా చాలా మంది ఇష్టపడతారు. చార్మినార్ స్మారక చిహ్నంలా ఎంత ప్రసిద్ధి చెందిందో.. బిర్యానీకి షాదాబ్ హోటల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది.

జ్యువెల్ ఆఫ్ నిజాం, మాసబ్ ట్యాంక్

జ్యువెల్ ఆఫ్ నిజాం, మాసబ్ ట్యాంక్

(Image:neabuy)

మాసబ్ ట్యాంక్ లోని జ్యువెల్ ఆఫ్ నిజాంలో మంచి చికెబ్ దమ్ బిర్యానీ దొరుకుతుంది. కచ్చి దమ్ బిర్యానీని ఇక్కడ ఆస్వాదించొచ్చు.

కేఫ్ బహార్, బషీర్ బాగ్

కేఫ్ బహార్, బషీర్ బాగ్

(Image: HyderbadZone)

కేఫ్ బహార్ హైదరాబాద్ లోని ప్రసిద్ధి బిర్యానీ ప్రదేశాలు కూడా అందించని వెరైటీలను అందిస్తుంది. ఇక్కడ దొరికే బిర్యానీ బడ్జెట్ ఫ్రెండ్లీ. రుచికి ఏమాత్రం తీసిపోదు. ఒక్కసారి తింటే పక్కాగా మళ్లీ రావాలనిపిస్తుంది.

ఫోర్ సీజన్స్, హఫీజ్‌ పేట్

ఫోర్ సీజన్స్, హఫీజ్‌ పేట్

ఫోర్ సీజన్స్ లో కచ్చి బిర్యానీ అనే సిగ్నేచర్ బిర్యానీ దొరుకుతుంది. యాలకులు, మిర్చి, నెయ్యి, కుంకుమపువ్వు సహా ఇతర మసాలాలతో చక్కగా దమ్ అయిన బిర్యానీ ఇక్కడ తినొచ్చు.

నయాబ్ హోటల్, చార్మినార్

నయాబ్ హోటల్, చార్మినార్

అసలైన హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్ ట్రై చేయాలంటే చార్మినార్ సమీపంలోని నయాబ్ హోటల్ టాప్ ప్లేస్. ఇక్కడ బిర్యానీ హండీలలో అందిస్తారు. ఇక్కడ బిర్యానీ మాత్రమే కాకుండా పాయా, మటన్ సూప్, హలీమ్ కూడా చాలా ఫేమస్

దమ్ పుఖ్త్ బేగం, హైటెక్ సిటీ

దమ్ పుఖ్త్ బేగం, హైటెక్ సిటీ

(Image:Zomato)

లాస్ట్ బట్ నాట్ లీస్ట్. మంచి దమ్ బిర్యానీ తినాలనుందా, మీరు హైటెక్ సిటీకి దగ్గర్లో ఉన్నారా.. అయితే వేరే ఆలోచన లేకుండా ఐటీసీ కోహినూర్ లోని దమ్ పుఖ్త్ బేగంకు వెళ్లండి. విలాసవంతమైన రెస్టారెంట్ లో ఘుమఘుమలాడే బిర్యానీ చాలా బాగుంటుంది.

FAQs
ఏ హైదరాబాదీ బిర్యానీ బెస్ట్?

ప్యారడైజ్, బావర్చీ, షాదాబ్, షాగౌజ్, దమ్ పుఖ్త్, ఫోర్ సీజన్స్, మెఫిల్ ఇంకా చాలా ఉన్నాయి.

ప్రపంచంలోనే నంబర్ 1 బిర్యానీ ఏది?

హైదరాబాదీ దమ్ బిర్యానీ.

హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ పేరు ఏంటి?

బావర్చీ బిర్యానీ.

BoldSky Lifestyle

Story first published: Thursday, February 16, 2023, 15:40 [IST]
Desktop Bottom Promotion