Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Tulsidas Jayanti 2021:తులసీదాస్ తల్లిదండ్రులను ఎందుకు వదిలిపెట్టారంటే...
తులసి దాస్ జయంతి 2021 తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రామయాణాన్ని రచించింది ఎవరంటే మనమంతా టక్కున చెప్పే పేరు వాల్మీకి. అయితే తులసీదాస్ తన రామచరిత్రమానంలో శ్రీరాముని కథను మరోసారి పునరావ్రుతం చేశాడు. గోస్వామి తులసీదాసుగా ప్రసిద్ధి చెందిన ఈయన గొప్ప సాధువు, కవి మరియు రచయిత. తులసీదాస్ శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఏడో రోజున జన్మించారు. ఈ ఏడాది 2021 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన తులసీదాస్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. హిందీ మరియు సంస్క్రుత సాహిత్యానికి తులసీదాస్ తన వంతు సహకారం అందించారు. భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తులసీ దాస్ ముఖ్య రచనలు..
రామచరిత్రమానాలతో పాటు తులసీదాస్ జీ పవిత్రమైన హనుమాన్ చాలీసాను కూడా రచించారు. హనుమాన్ చాలీసా హనుమంతునికి అంకితం చేయబడింది. ప్రసిద్ధ సంకట్ మోచన్ ఆలయాన్ని తులసీదాస్ జీనే స్థాపించారు. ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలోనే భజరంగ్ బలి స్వయంగా తులసీదాస్ కు దర్శనం ఇచ్చారని చెబుతుంటారు. దీంతో పాటు ఈయన రాంలీలా కూడా ప్రారంభించారు.
తులసీదాస్ పుట్టుక రహస్యాలు..
తులసీదాస్ జీ తన జీవితంలో ఎక్కువ భాగం బనారస్ లోని గంగా తీరంలో గడిపారు. నేడు ఆ ప్రదేశాన్ని తులసీ ఘాట్ అని పిలుస్తారు. తులసీదాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలోని సుకర్ క్షేత్ర గ్రామంలో జన్మించారు. తులసీదాస్ జీ తన తల్లి గర్భంలో పన్నెండు నెలలు గడిపిన తర్వాత జన్మించాడని చెబుతారు. సాధారణంగా ఎవరైన పుట్టిన తర్వాత ఏడుస్తారు. కానీ తులసీ దాస్ మాత్రం పుట్టినప్పుడు అస్సలు ఏడవలేదట. అంతేకాదు తను పుట్టిన వెంటనే ఐదు నెలల బాలుడిలా కనిపించాడట. బయటకు వచ్చినప్పుడే పూర్తి 30 దంతాలతో జన్మించాడని పండితులు చెబుతారు.

జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసీదాస్ జీ అభూక్త మూల నక్షత్రంలో జన్మించాడు. అంటే అది తన తండ్రి అశుభ సంకేతం. దీని కారణంగా తులసీదాస్ పుట్టిన నాలుగు రోజులకే తన తల్లి మరియు తండ్రి తనను చునియా అనే మహిళకు అప్పగించారు. చునియా తులసీదాస్ ని ఐదేళ్ల పాటు పెంచిన తర్వాత మరణించింది. దీని తర్వాత తులసీదాస్ జీ యాచించే స్థితికి వచ్చారు. చునియా మరణం తర్వాత తల్లి పార్వతీ స్వయంగా తులసీదాస్ జీకి ఆహారం ఇచ్చేందుకు ప్రతిరోజూ సాయంత్రం వచ్చేదని చెబుతుంటారు.
నరహరిదాస్ రామాయణ కథ..
తొలిరోజుల్లో తులసీదాస్ జీ పేరు రాంబోలా. ఎందుకంటే తను పుట్టినప్పుడు రామ్ పేరు తీసుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వినయ్ అనే పత్రికలో చెప్పారు. తన గురువు నరహరిదాస్ నాలుగో శిష్యుడు. చునియా మరణించిన కొద్దికాలానికి ఈయన తులసీదాస్ ను దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిని తనతో పాటు అయోధ్యకు తీసుకెళ్లి అక్కడ రామాయణ కథను తులసీదాసుకి చెప్పాడు. తులసీదాస్ తన ఉల్లేఖానాలలో, తన గురువు తనకు రామాయణాన్ని చెప్పినప్పుడు, తనకు అర్థం కాలేదు. కానీ పెరిగి పెద్దయ్యేలోపు ఆ పవిత్ర గ్రంథం పాఠాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు.
తులసీదాస్ వివాహ జీవితం..
తులసీదాస్ జీ వివాహం కథ చాలా ప్రసిద్ధి గాంచింది. ఆ కథనం ప్రకారం తులసీదాస్ జీ బ్రాహ్మణ కుమార్తె రత్నావళిని వివాహం చేసుకున్నారు. ఓసారి హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు రత్నావళి తన సోదరునితో తన తల్లి ఇంటికి వెళ్లారు. అదే రాత్రి తులసీదాస్ తనను కలవడానికి అక్కడి చేరుకున్నాడు. అక్కడ తులసీదాస్ ని చూసి రత్నావళి చాలా ఆశ్చర్యపోయింది. ఆయన తన శరీరం పట్ల కలిగి ఉన్న ప్రేమలో సగం కూడా దేవుడిని ప్రేమిస్తే వారు దేవుని దీవెనలు పొందుతారని వారికి చెప్పాడు. దీంతో తన భార్య తులసీదాస్ ను తిట్టింది. దీంతో తను వివాహ జీవితానికి వీడ్కోలు పలికాడు. తర్వాత ప్రయాగ్ రాజ్ నగరానికి వెళ్లారు.
తులసీదాస్ గురించి కొన్ని కథలు అందుబాటులో ఉన్నాయి. మరో కథనం ప్రకారం.. తను బాల్యం నుండి ఒక సాధువు అని జీవితాంతం తను బ్రహ్మాచారిగా ఉండిపోయాడు. తను శ్రీరాముడిని మరియు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకుంటాడని చెబుతారు.



Click it and Unblock the Notifications
