గుండె పోటు, కార్డియాక్‌ అరెస్ట్‌, ఫెయిల్యూర్‌ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.!

గుండెకి సంబంధించిన వ్యాధులు అనగానే చాలా మంది గుండె పోటు అనే అనుకుంటారు. ఎందుకంటే గుండె ఆరోగ్యంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా చాలా మందికి గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌, వైఫల్యం.. ఈ మూడు ఒకటే అని పొరబడుతుంటారు. కాదు.. ఈ మూడింటి మధ్య తేడాలు, కారణాలు తెలుసుకోవడం చాలా అవసరమని కార్డియాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

difference between heart attack cardiac arrest and heart failures know the reasons

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా ఈ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు గుండెకి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి. హార్ట్‌ అటాక్‌, కార్డియాక్‌ అరెస్ట్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌ ఈ మూడింటి మధ్య తేడాలు ఏంటి.. ఇవి ఎందుకు వస్తాయి.. నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

గుండె పోటు, కార్డియాక్‌ అరెస్ట్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌ అనేవి వేర్వేరు పరిస్థితులు, కారణాల వల్ల వస్తాయి. వయసు పైబడిన వారు, పలురకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం అవసరం.

గుండెపోటుకి కారణాలు

గుండెకి రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో అడ్డంకి ఏర్పడితే గుండెపోటు సంభవిస్తుంది. ఇలా జరిగినప్పుడు హృదయ కండరంలోని ఒక భాగానికి తగినంత ఆక్సిజన్‌ అందకపోతే.. ఛాతీ నొప్పి, ఒత్తిడి, చెమట పట్టడం, ఆయాసం, వికారం, చేయి, వీపు, మెడ, దవడ భాగాల్లో నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. సిరల్లో అడ్డంకిని తక్షణ చికిత్స ద్వారా తొలగించవచ్చు.

difference between heart attack cardiac arrest and heart failures know the reasons

కార్డియాక్‌ అరెస్ట్‌

కార్డియాక్‌ అరెస్ట్‌లో గుండె సడెన్‌గా రక్తాన్ని పంప్‌ చేయడం ఆగిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో సడెన్‌గా వ్యక్తి స్పృహ కోల్పోతాడు. స్పందన ఉండదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. కార్డియాక్‌ అరెస్ట్‌ తలెత్తినప్పుడు వెంటనే అత్యవసర వైద్యం అవసరం. సీపీఆర్‌తో సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఒకవేళ అందుబాటులో ఉంటే AEDని ఉపయోగించడం ఉత్తమం.

హార్ట్‌ ఫెయిల్యూర్‌

హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే గుండె పూర్తిగా ఆగిపోవడం అని అర్థం కాదు. గుండె బలహీనపడటం, బిగుసుకుపోవడం, శరీర అవసరాలకు సరిపడా రక్తాన్ని పంపింగ్‌ చేయలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆయాసం, అలసట, కాళ్ల వాపు లక్షణాలు కనిపిస్తాయి.

ఈ క్రమంలో మీకు సడెన్‌గా తీవ్రమైన ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం, తీవ్రంగా శ్వాస సమస్యలు తలెత్తితే ఆలస్యం చేయకూడదు. వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. ఈ పరిస్థితిలో మీరు ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 30, 2026, 14:24 [IST]
Desktop Bottom Promotion