Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?
పొద్దున్నే లేవగానే మనం చేసే పనే మన రోజంతా ఏ విధంగా ఉండాలనేది నిర్ణయిస్తుందని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుండటం మనం చూస్తుంటాం. ఉదయాన్నే అది తినండి, ఇది తాగండి అని వైద్య నిపుణులు అనేక సూచనలు చేస్తుంటారు.
ఉదయాన్నే పరగడుపున ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని తాగమని ఆయుర్వేదం సూచిస్తోంది. ఈ చిన్న అలవాటు మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వాత, పిత్త దోషాల నివారణ
ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త దోషాలు అసమతుల్యంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఈ దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. వాత దోషం తగ్గడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. పిత్త దోషం తగ్గడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట దరిచేరవు. ముఖ్యంగా ప్రతిరోజూ ఈ నీటిని తాగితే మలవిసర్జన సాఫీగా జరిగి, దీర్ఘకాలిక మలబద్ధకం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.
విటమిన్ల శోషణకు సహాయకారి
నెయ్యి అనగానే కొవ్వు అని భయపడాల్సిన పనిలేదు. పరిమితంగా నెయ్యి తీసుకుంటే శరీరానికి రోజంతా అవసరమైన శక్తి అందుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లు అయిన ఏ, డి, ఇ, కె (A, D, E, K) లను మన శరీరం సులభంగా గ్రహించడానికి నెయ్యి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
నెయ్యిలో సహజంగానే మృదుత్వం ఉంటుంది. ప్రతి ఉదయం నెయ్యి కలిపిన నీటిని తాగడం వల్ల కీళ్ల మధ్య ద్రవాలు ఉత్పత్తి అయి, ఎముకలు అరగకుండా కందెనలా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
నిగనిగలాడే చర్మ సౌందర్యం కూడా
ఈ అలవాటు కేవలం జీర్ణక్రియకే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలోని తేమను కోల్పోకుండా నెయ్యి కాపాడుతుంది. లోపలి నుంచి చర్మానికి పోషణ అందించి, కాంతివంతంగా, యవ్వనంగా మెరిసేలా చేస్తుంది.ః
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వృద్ధి
పరగడుపున నెయ్యి నీళ్లు తాగడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఎవరు తాగకూడదు?
ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సరిపడదు. ఆయుర్వేదం ప్రకారం.. కఫ దోషం (జలుబు, దగ్గు తరచుగా వచ్చేవారు) ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, ఆకలి తక్కువగా ఉండి జీర్ణశక్తి మందకొడిగా ఉన్నవారు ఈ నీటిని తాగకూడదు. అలాగే ఫ్యాటీ లివర్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్ల సలహా లేకుండా నెయ్యి నీటిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
