Latest Updates
-
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..
ఆరోగ్యంగా పదికాలాల పాటు చల్లగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు ఆహారం కూడా చాలా చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఖర్జూరం, నువ్వులది ఎప్పుడూ టాప్ ప్లేసే. ఈ రెండింటి కలయికతో చేసే లడ్డు వారానికి ఒకటి తిన్నా..సహజమైన ఎనర్జీ, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఈ ఖర్జూరం నువ్వుల లడ్డు మీ శరీరానికి కావాల్సిన శక్తిని, ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి, స్కిన్ గ్లో అవ్వడానికి సహాయపడుతుంది. ఈ లడ్డు తయారీకి ఎక్కువ పదార్ధాలు అవసరం లేదు..కేవలం 3 పదార్థాలతోనే తయారుచేసుకోవచ్చు.
మరో ముఖ్య విషయం ఏంటంటే..ఈ ఖర్జూరం నువ్వుల లడ్డు తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే దీన్ని తయారుచేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే స్నాక్ గా ఇవ్వడానికి కూడా ఇది బెస్ట్ గా ఉంటుంది. ఖర్జూరం నువ్వుల లడ్డు మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఖర్జూరం నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-నువ్వులు
-ఖర్జూరం
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
ఖర్జూరం నువ్వుల లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. అందులో 1 కప్పు తెల్ల నువ్వులు వేయండి,అందులోనే 1 స్పూన్ నీళ్లు వేసి నువ్వులను వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కగానే అందులో 20 గింజ తీసేసిన ఖర్జూరాలు వేసుకోండి. వాటిని గరిటతో అదుముతున్నట్లు చేయండి. చింతపండు మాదిరి పేస్ట్ లా అయ్యేలా గరిటతో అదుముతూ వేయించాక అందులోనే వేయించిన నువ్వులు వేసి మొత్తం బాగా కలపాలి.
-ఖర్జూరం పేస్ట్ కి నువ్వులు అన్నీ బాగా పట్టేలా కలుపుకోండి. ఈ సమయంలో మంటను తక్కువలో ఉంచుకోవాలి.
-నువ్వులన్నీ ఖర్జూరం పేస్ట్ లో బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి.
-మిశ్రమం లైట్ గా గోరువెచ్చగా ఉన్న టైంలో...దాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని లడ్డుల్లా మీకు నచ్చిన సైజులో చేసుకోండి.
-అంతే హెల్తీ ఖర్జూరం నువ్వుల లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
