Latest Updates
-
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.?
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఈ ప్రపంచంలో అధికారికంగా ఐక్యరాజ్య సమితి(UN) గుర్తించిన దేశాలు 193. యూఎన్ గుర్తించని మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఏ దేశం పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ దేశ రాజధానే. భారత్ అనగానే ఢిల్లీ, ఇంగ్లాండ్ అనగానే లండన్, ఫ్యాన్స్ అనగానే ప్యారిస్, నేపాల్ అనగానే కాఠ్మాండు, బంగ్లాదేశ్ అనగానే ఢాకా ఇలా దేశం పేరు వినగానే ఫస్ట మనకు రాజధాని నగరమే గుర్తుకొస్తుంది.
రాజధాని అంటే..ఆ దేశానికి రాజకీయ, పరిపాలనా కేంద్రం. అయితే ఇన్ని దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క దేశానికి మాత్రం అసలు రాజధానే లేదు. రాజధాని లేదంటే అదేదో గుర్తింపు లేని దేశం అనుకుంటే పొరబడినట్లే. ఐక్యరాజ్య సమతి గుర్తింపు పొందిన దేశానికే రాజధాని లేదండోయ్. రాజధాని లేని ఆ దేశమే పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ముత్యంలా మెరిసిపోయే నౌరు.

నౌరు.. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక అతిచిన్న ద్వీప దేశం. ఇది 1968లో స్వాతంత్ర్యం పొందింది. భౌగోళిక విస్తీర్ణం, జనాభా పరంగా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాల జాబితాలో నౌరు అగ్రస్థానంలో ఉంటుంది. విస్తీర్ణంలో ఎంత చిన్నదైనా, దీనికున్న ప్రత్యేకత మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తుంది.

రాజధాని లేనప్పుడు ఆ దేశపు ప్రభుత్వ పాలన ఎలా సాగుతుంది? పాలనా కార్యకలాపాలు ఎక్కడినుండి జరుగుతాయి? అనే సందేహం రావడం సహజం. ఈ ప్రశ్నలకు సమాధానమే యారెన్ (Yaren) జిల్లా. నౌరు ద్వీపపు దక్షిణ భాగంలో ఉన్న ఈ జిల్లాలోనే దేశ పార్లమెంటుతో పాటు విమానాశ్రయం, ఇతర కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై ఉన్నాయి. చట్టబద్ధంగా దీనికి రాజధాని హోదా లేకపోయినా, ప్రభుత్వ పనులన్నీ ఇక్కడినుండే సాగుతుండటంతో యారెన్ జిల్లాను అనధికారికంగా నౌరు రాజధానిగా పరిగణిస్తుంటారు.
మహా నగరాలు, భారీ పట్టణాలు, ఆకాశహర్మ్యాలు నౌరులో అస్సలు కనిపించవు. ఈ దేశం మొత్తం ఒక చిన్న ద్వీపం మాత్రమే. ఇక్కడ నగరాలకు బదులుగా చిన్న చిన్న జిల్లాలు ఉంటాయి. దేశ జనాభా, నివాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఈ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటాయి. యారెన్ జిల్లా కేవలం ప్రధాన పరిపాలనా కేంద్రంగా మాత్రమే సేవలందిస్తుంది తప్ప దానిని జాతీయ రాజధానిగా అక్కడి ప్రభుత్వం ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదు.
ఇక, ఇటీవల నౌరు దేశం తన దేశం పేరుని కూడా మార్చింది. తమ దేశం పేరుని రిపబ్లిక్ ఆఫ్ నావోరో(republic of naoero)గా అధికారికంగా మార్చింది.



Click it and Unblock the Notifications
