వాషింగ్‌ మెషీన్‌లో షర్ట్‌ కాలర్‌ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్‌ చిట్కాలను ట్రై చేయండి.!

వాషింగ్‌ మెషీన్లు అందుబాటులోకి వచ్చాక చాలా వరకు చేతితో ఉతికే శ్రమ తగ్గిపోయింది. తెల్లని బట్టలు, సున్నితమైన దుస్తులు, రంగు వెలిసిపోయేవి మినహా మిగతావాటిని వాషింగ్‌ మెషీన్‌లోనే వేస్తుంటాం. అయితే కొన్ని బట్టలు ముఖ్యంగా, షర్టుల విషయానికొస్తే వాటి కాలర్‌ మురికి మెషీన్‌లో వేసినా పోదు. దీంతో వాటిని మళ్లీ ఉతకాల్సి వస్తుంది. అయితే ఈసారి అలా జరగకుండా మీరు మెషీన్‌లో వేసే ముందు ఈ చిట్కాలను పాటించండి. కాలర్‌, ఇంకా మొండి మరకలు సులభంగా తొలగిపోతాయి.

shirt collar doesn t get cleaned in the washing machine try this tip

షర్ట్‌ కాలర్‌ వద్ద ఎక్కువగా శరీరంలోని చెమటతో పాటు బయటి దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దీంతో మురికి, జిడ్డు, చెమట మరకలు బాగా పేరుకుపోతాయి. దీంతో వాషింగ్‌ మెషీన్‌లో ఉతికినా కూడా పూర్తిగా శుభ్రం కాదు. దీంతో తప్పనిసరిగా మళ్లీ ఉతకాల్సి వస్తుంది. ఫలితంగా పని రెట్టింపవుతుంది. సమయం వృథా అవుతుంది. అయితే మీరు ఇంట్లోనే లభించే ఈ వస్తువులతో ఇలా ట్రై చేశారంటే మురికి సులభంగా వదిలిపోతుంది.

కాలర్‌పై లిక్విడ్‌ డిటర్జెంట్‌

ముందుగా షర్టును వాషింగ్‌ మెషీన్‌లో వేసే ముందు కాలర్‌ భాగాన్ని పరచాలి. మురికి ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేసి కాలర్‌కి రెండు వైపులా సున్నితంగా అప్లై చేయండి. అనంతరం 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు సాఫ్ట్‌ టూత్‌బ్రష్‌ లేదా బ్రష్‌తో కాలర్‌పైన రుద్దాలి. గట్టిగా రుద్దకూడదు. లేదంటే దారాలు దెబ్బతింటాయి. కాలర్‌పై చెమట, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటితో బ్రష్‌ చేయండి. అయితే ఇలా చేసేముందు షర్టు కేర్‌ లేబుల్‌ ఉన్న సూచనలను పాటించడం ఉత్తమం. తర్వాత వాషింగ్‌ మెషీన్‌లో వేసుకోవచ్చు.

బేకింగ్‌ సోడా

shirt collar doesn t get cleaned in the washing machine try this tip

కాలర్‌పై మొండి మరకలకు బేకింగ్‌ సోడా ఉత్తమంగా పనిచేస్తుంది. బేకింగ్‌ సోడా, కొద్దిగా నీటిని తీసుకుని పలుచగా పేస్ట్‌లా చేసుకుని కాలర్‌పై మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి పావుగంట పాటు వదిలేయండి. తర్వాత సున్నితమైన బ్రష్‌తో రుద్ది అనంతరం మెషీన్‌లో వేసుకోవచ్చు. అయితే కలర్‌ దుస్తులపై వేసేటప్పుడు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే రంగు వెలిసిపోతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి..

చొక్కా కాలర్‌ ఎక్కువ కాలం శుభ్రంగా, క్వాలిటీగా ఉండాలంటే.. బాగా మురికి అయ్యేవరకు ధరించకండి. ఎక్కువగా చెమట పట్టినట్లయితే త్వరగా వాష్‌ చేసుకోవడం మంచిది. తెల్లటి షర్టుల విషయంలో కఠినమైన కెమికల్స్‌, బ్లీచ్‌ వాడకండి. షర్టు క్లాత్‌ బట్టి డిటర్జెంట్‌, వాషింగ్‌ మోడ్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.

Story first published: Wednesday, September 30, 2026, 18:41 [IST]
Desktop Bottom Promotion