Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
శృంగారం అంటే ఒక మగ,ఆడ వ్యక్తి మధ్య శారీరక కలయిక మాత్రమే కాదండోయ్.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమను, భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక అద్భుతమైన అనుభూతి. ఇద్దరు పెద్దల పూర్తి అంగీకారంతో జరిగే ఈ చర్య.. శారీరక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.
అయితే చాలామంది దంపతులు శృంగారం తర్వాత తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఇవి వారి వ్యక్తిగత ఆరోగ్యంపై, ముఖ్యంగా లైంగిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మీకు తెలుసా?

వెంటనే మూత్రవిసర్జన
శృంగారం తర్వాత భాగస్వాములిద్దరూ ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా మూత్రవిసర్జన చేయాలి. ఇలా చేయడం వల్ల మూత్రనాళాల్లోకి చేరిన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వంటి బాధాకరమైన సమస్యలు రాకుండా ఉంటాయి.
వెంటనే నిద్ర
శృంగారం తర్వాత శరీరం అలసిపోయి వెంటనే నిద్రముంచుకురావడం సహజమే. కానీ కలయిక తర్వాత వెంటనే అటు తిరిగి పడుకోవడం వల్ల భాగస్వామికి భావోద్వేగపరంగా దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిసేపు ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకోండి. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

శుభ్రతను నిర్లక్ష్యం
శృంగారం తర్వాత జననాంగాలను శుభ్రం చేసుకోవడం అత్యంత ముఖ్యం. చెమట, శరీర స్రావాల వల్ల బ్యాక్టీరియా త్వరగా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రసాయనాలు లేని సబ్బుతో లేదా గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి.
ఆఫ్టర్ కేర్
కలయిక తర్వాత ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అలసట తీర్చుకోవడానికి మంచి నీళ్లు తాగడం, పండ్లు లేదా స్నాక్స్ తినడం చేయాలి. అలాగే కలయిక సమయంలో ఏవైనా నొప్పులు లేదా అసౌకర్యం కలిగిందా అని మీ భాగస్వామిని ప్రేమగా అడిగి తెలుసుకోవాలి. ఇది వారికి మీపై నమ్మకాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications
