Latest Updates
-
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.?
Gobbemma : సంక్రాంతి రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను ఎందుకు ఉంచుతారో తెలుసా?
సంక్రాంతి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడుతుంటారు. అసలు రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు, పిండి వంటలతో సంక్రాంతి అట్టహాసంగా జరుగుతుంది. సంక్రాంతి అనగానే మొదట గుర్తుకువచ్చేవి రంగురంగుల ముగ్గులు. ఈ రంగవల్లుల కోసం చాలా మంది కొన్ని రోజుల ముందు నుండే ప్లాన్ వేసుకుంటాైరు. ఎలాంటి ముగ్గులు వేయాలి. ఎలాంటి రంగులు వేయాలని ఆలోచిస్తుంటారు.

సంక్రాంతి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడుతుంటారు. అసలు రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

గొబ్బెమ్మల సాంప్రదాయం:
ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించడం హిందూ సాంప్రదాయం. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు, కుంకుమ పెట్టి, పూలతో అలంకరిస్తారు. నవ ధాన్యాలు పోస్తారు. ముగ్గులపై గడ్డి పెడతారు. ఆ తర్వాత అమ్మాయిలంతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడతారు. సంక్రాంతి వేళ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు.

ఆవు పేడతోనే..:
ఆవుల పేడతోనే గొబ్బెమ్మలు తయారు చేస్తారు. ఆవును గౌరీమాతాగా కొలుస్తారు హిందువులు. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవు పేడలో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు.

గోదాదేవి:
గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు, కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లి కాని అమ్మాయిలు తయారు చేసి అలంకరిస్తారు. అలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. అలాగే మంచి భర్త వస్తాడని విశ్వసిస్తారు.

గొబ్బెమ్మలను పొయ్యిలో వేసి..:
నెలరోజులూ రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి తర్వాత వాటిని ఎండబెడతారు. చివరి రోజైన కనుమ రోజు గొబ్బెమ్మలను పొయ్యిలో వేసి.. ఆ మంటపై ప్రసాదం తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.



Click it and Unblock the Notifications
