Latest Updates
-
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
బిర్యానీ తిని చనిపోయిన కేరళ యువతి, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే!
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెస్టారెంట్లు, హోటళ్ల నుండి ఫుట్ ఆర్డర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలో 20 ఏళ్ల యువతి ఫుడ్ పాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. కేరళ కాసరగోడ్ సమీపంలోని పెరుంబళకు చెందిన అంజుశ్రీ పార్వతి డిసెంబర్ 31న కాసరగోడ్‌లోని రొమేనియా అనే రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్‌లో కుజిమంతిని ఆర్డర్ చేసింది. కుజిమంతి అంటే బిర్యానీ తరహా వంటకం. దానిని తిన్న తర్వాత అంజుశ్రీ పార్వతి అస్వస్థతకు గురి కావడంతో ఆమెను తల్లిదండ్రులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కర్ణాటక మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయింది అంజుశ్రీ పార్వతి.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెస్టారెంట్లు, హోటళ్ల నుండి ఫుట్ ఆర్డర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
(image: Smarther)
ఆన్‌లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా నాణ్యత ముఖ్యం. నాణ్యత మెయింటైన్ చేసే హోటళ్లు, రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లాలి. అలాంటి రెస్టారెంట్ల నుండి మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటితో వీటిని పరిశీలించాలి.
లేబులింగ్:
మీరు ఏ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారో ఆ రెస్టారెంట్, హోటల్ యొక్క లేబులింగ్ తనిఖీ చేయాలి. పోషక సమాచారం, పదార్థాల జాబితా సహా మొత్తం లేబుల్‌ని చూడాలి. లేబుల్‌ను సరిగ్గా చూడటం వల్ల ఆ ఫుడ్‌కు సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
లేబుల్‌పై ఇతర ఆధారాల కోసం చూడవచ్చు. పదార్థాల గురించి తప్పుగా పేర్కొంటే దాని వల్ల సమస్య రావొచ్చని గుర్తించొచ్చు. ప్రాసెసింగ్ అనేది క్యాన్డ్స్, బాటిల్ ఫుడ్‌లను షెల్ఫ్ స్టేబుల్‌గా మార్చే ముఖ్యమైన దశ. తెరిచిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచొచ్చో లేదో లేబుల్ చూసి తెలుసుకోవచ్చు. అలాగే ప్యాకేజీపై ఎక్స్‌పైరీ తేదీ ఉందో లేదో తెలుసుకోవాలి.

వెబ్‌సైట్, విశ్వసనీయత:
(image: Enuke Software)
కొత్త తరహా ఆహార పదార్థాలను, సోషల్ మీడియాలో కనిపించిన పదార్థాన్ని తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆర్డర్ చేసే ముందు వెబ్‌సైట్ లేదా రెస్టారెంట్ క్రెడిబిలిటీ తనిఖీ చేసుకోవాలి.

రెస్టారెంట్, హోటల్ హిస్టరీ:
(image: RestroApp)
మీరు ఆర్డర్ చేయాలనుకుంటున్న రెస్టారెంట్ ఎంతకాలం నుండి ఉంది, వారు ఏ ఇతర ఉత్పత్తులను విక్రయిస్తారో తెలుసుకోవాలి. వాటి ద్వారా నమ్మకం కుదిరితేనే ఆర్డర్ చేయాలి.

ఆన్‌లైన్ రివ్యూలు చదవాలి:
(image: Dreamstime.com)
ఆహార పదార్థమైనా, వస్తువైనా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అయినా కొనేముందు ఆన్‌లైన్ రివ్యూలు చదవడం అలవాటు చేసుకోవాలి. దాని గురించి నిజానిజాలు ఆ రివ్యూల్లో కనిపిస్తాయి. వాటి ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.

ప్యాకేజింగ్ నాణ్యత:
ప్యాకేజీ నాణ్యంగా ఉంటేనే అందులోని ఆహార పదార్థాలు చెడిపోకుండా, కలుషితం కాకుండా, లీకేజీ లేకుండా ఉంటాయి. మంచి ప్యాకేజింగ్ లేని రెస్టారెంట్లు, హోటళ్ల నుండి ఫుడ్ ఆర్డర్ చేయకపోవడమే ఉత్తమం.
ఆన్‌లైన్‌తో పాటు బయట ఆహారాలు తినే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శుచీ శుభ్రత ఉన్న బండ్ల వద్ద మాత్రమే స్ట్రీట్ ఫుడ్స్ తినాలని సూచిస్తున్నారు. వాడిన నూనెను పదే పదే వాడే వారి దగ్గరికి వెళ్లకపోవడం మంచిది. ఆహారం, నీరు కలుషితం కాలేవని తినే ముందు నిర్ధారించుకోవాలి. చేతులకు గ్లౌజులు, వెంట్రుకలు పడకుండా బూఫంట్ క్యాపులు, మూతికి మాస్కులు ధరించారని నిర్ధారించుకోవాలి.



Click it and Unblock the Notifications