పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?

హైదరాబాద్ లో ఓ బ్యాంక్ ఉద్యోగిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. సాప్ట్ వేర్ భర్తే ఆమె మరణానికి కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. హాలిడే రోజున ఇంట్లో ఫ్యాన్ కి వేలాడుతూ ఆమెను చూసి కుటంబసభ్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషిని అనే 28 ఏళ్ల అమ్మాయి యాక్సిక్ బ్యాంకులో ఉద్యోగం చేసేది. మౌనికకు పెళ్లి కూడా అయ్యింది. విశాఖపట్నంకి చెందిన రమాకాంత్ తో మౌనికకు ప్రేమ వివాహం జరిగింది. పెద్దలను ఎదిరించి మరీ 8 ఏళ్ల క్రితం వీళ్లు కులాంతర వివాహం చేసుకున్నారు.

Love Marriage Ends in Tragedy Axis Bank Employee Mounika Santhoshi Hanging Sparks Harassment Claims

ప్రస్తుతం రమాకాంత్..ఐటీ సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మౌనిక-రమాకాంత్ దంపతులకు రెండున్నర ఏళ్ల వయస్సున్న కవల పిల్లలు కూడా ఉన్నారు. వీరి కుటుంబం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ లోని గెలాక్సీ టవర్స్ లోని అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు..ఆదివారం ఉదయం తన గదిలో మౌనిక ఫ్యాన్ కి వేసి ఉన్న చున్నీకి వేలాడుతున్నట్లు పనిమనిషి గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రాధమిక సమాచారం సేకరించారు.ఆ తర్వాత మౌనిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రమాకాంతే..మౌనికను వేధించేవాడని, భర్త వేధింపులు భరించలేక మౌనిక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మౌనిక మృతిని..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మౌనిక మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పిల్లల విషయంలో మౌనిక-రమాకాంత్ జంటకు తరచూ గొడవలు జరిగేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయి వివరాలు పోలీసుల విచారణ తర్వాత బయటకు రానున్నాయి.

Story first published: Monday, September 21, 2026, 12:20 [IST]
Desktop Bottom Promotion