Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీ చేతిలో ఈ గుర్తులున్నాయా? అయితే ఏనాటికైనా కోటీశ్వరుడవుతారు
గీతల్లేని చేతులుండవు. ప్రతి మనిషి చేతిలో గీతలు ఉంటాయి. అవి మనిషికీ మనషికీ వేర్వేరుగానే ఉంటాయి. కానీ కొన్ని గీతలు, గీతల మధ్య కనిపించేలా గుర్తులు కొందరిలో ఒకే రకంగా ఉంటాయి. హస్తసాముద్రికం ప్రకారం ఈ గీతలు, గుర్తులు వారి వారి భవిష్యత్తును, జీవితాన్ని, జీవితంలోని సంఘటనల గురించి చెబుతాయి. అర చేతుల్లో ఉండే కొన్ని రకాల గీతలు, గీతల మధ్యన ఉండే గుర్తులు అదృష్టాన్ని తెలియజేస్తాయి. హస్తసాముద్రికం ప్రకారం దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తీసుకువచ్చి ధనలాభం కలిగించే కొన్ని చిహ్నాలు ఉన్నాయి.

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతిలోనైనా ఈ ఐదు గుర్తులు ఉంటే వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా కోటీశ్వరుడవుతాడని శాస్త్రం చెబుతోంది. మరి ఆ గుర్తులేమిటో, ఆయా గుర్తులు మీ అరచేతిలో ఉన్నాయో లేదో తెలుసుకోండి.
చేప చిహ్నం:
చేతిలోని చేప రేఖను సంతోష రేఖ అని కూడా అంటారు. ఇది చాలా అరుదైన వేలిముద్ర చిహ్నం. ఒక వ్యక్తి చేతిలో ఈ చేప చిహ్నం ఉంటే.. వారు జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారని, ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతోంది. చేప చిహ్నం విదేశీ ప్రయాణం, హోదా, అపారమైన సంపదను సూచిస్తుంది. చేప చిహ్నం ఉన్న వ్యక్తులు గొప్ప మనస్సు కలిగి ఉంటారని, వారు దాతృత్వంలోనూ ఉదారంగా వ్యవహరిస్తారని నమ్ముతారు.
జెండా చిహ్నం:
చేతుల్లో ఎగురుతున్న జెండా చిహ్నం అదృష్టాన్ని సూచిస్తుంది. అర చేతిలో జెండా గుర్తు ఉంటే ఆ వ్యక్తి ఎంతో పేరు తెచ్చుకుంటాడని అంటారు. జెండా చిహ్నం ఉన్న వ్యక్తులు కళారంగంలో రాణిస్తారు. లేదా అంతర్జాతీయంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఈ వ్యక్తులు ఏ పని తలపెట్టినా అందులో విజయం అందుకుంటారు. గొప్ప కీర్తిని పొందుతారు.
స్వస్తిక్ చిహ్నం:
అరచేతిలో స్వస్తిక్ చిహ్నం ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు అని చెబుతోంది హస్తసాముద్రిక శాస్త్రం. ఈ వ్యక్తులు తమ కష్టాన్ని నమ్ముకుంటారు. పని పట్ల వీరు చూపే అంకిత భావం వారిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఏ పని చేసినా చాలా ప్రభావవంతంగా చేస్తారు. స్వస్తిక్ చిహ్నం కలిగిన వ్యక్తిలోని ప్రతిభ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
కమలం చిహ్నం:
లక్ష్మీ దేవి కమలం పుష్పంగా కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి సంపదకు, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. కమలం పువ్వు చిహ్నం స్వచ్ఛమైన మనస్సును కూడా సూచిస్తుంది. ఈ చిహ్నం ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. విద్య పరంగా కూడా ఉన్నత స్థానంలో ఉంటారు. ఆధ్యాత్మికంగానూ జ్ఞానాన్ని కలిగి ఉంటారు.
ఆలయ చిహ్నం:
సాధువులు, గురువులు, గొప్ప సంస్కర్తలు, మేధావుల అరచేతుల్లో ఈ ఆలయ గుర్తు కనిపిస్తుంది. ఇది చాలా అరుదైన చిహ్నంగా పరిగణిస్తారు. ఈ గుర్తు ఉన్న వ్యక్తులు లక్షలు, కోట్లు కొందరు సంపాదిస్తే.. మరికొందరు కోట్లాది మంది ఆధరాభిమానాలు సంపాదిస్తారు.
త్రిభుజం:
త్రిభుజం అనేది హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అత్యంత గౌరవనీయమైన చిహ్నం. ఇది సంపద, ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుంది. త్రిభుజం చిహ్నం ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications