Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.!
రక్త సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేదానికి ఈ కసాయి తల్లిదండ్రుల కథే అతి పెద్ద ఉదాహరణ. ఎన్ని కష్టాలొచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలను కన్నా.. పేగు బంధాన్ని కన్న తల్లి ఎన్నటికీ వదులుకోదు. కానీ విలాసవంతమైన కోరికల కోసం ఈ జంట తమ నెలరోజుల పసికందును రూ. 1.20 లక్షలకు విక్రయించారు. కానీ ఈ దారుణం అక్కడితో ఆగిపోలేదు. ఆ బిడ్డ ఏకంగా నలుగురి చేతులు మారడం కలవరపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక జంట సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే లగ్జరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిన ఆ జంట బంగారం, ఫోన్ కొనుగోలు చేయాలనే ఆశతో తమ నెల రోజుల మగబిడ్డను రూ. 1.20 లక్షలకు విక్రయించారు. ఆ డబ్బుతో వారు రూ. 25,000 విలువైన స్మార్ట్‌ఫోన్, రూ. 62,000 విలువైన బంగారు గొలుసు కొనుగోలు చేశారు.

అయితే ఈ దారుణ ఘటన అక్కడితో ఆగిపోలేదు. ఆ జంట నుంచి పసికందు అమ్ముడైన 48 గంటల్లోనే నాలుగుసార్లు చేతులు మారింది. ఈ వ్యవహారంలో ముగ్గురు మధ్యవర్తులు కీలకంగా ఉన్నారు. మొదటగా శంభాజీ నగర్ జంట సీమా రేష్వాల్ అనే మహిళకు పసికందును విక్రయించారు. తర్వాత సీమా నుంచి సంగీత అహ్వద్ అనే మహిళకు రూ. 2.7 లక్షలకు పసికందును అమ్మేశారు. అక్కడి నుంచి నకిలీ డాక్టర్‌కు రూ. 3.5 లక్షలకు విక్రయానికి పాల్పడ్డారు. చివరికి జగిత్యాలకు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లోని మహిళకు రూ. 3.50 లక్షలకు అమ్మేశారు.

ఇలా నెల రోజుల పసికందు చివరికి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కి ప్రయాణం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కాగా, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో దర్యాప్తు చేపట్టారు. శిశువును హైదరాబాద్‌లో గుర్తించి రక్షించారు. మహారాష్ట్ర జంట కొనుగోలు చేసిన ఫోన్, బంగారాన్ని సీజ్ చేశారు. సహజీవనం చేస్తున్న జంటతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పసికందును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు రక్షణకు చర్యలు చేపట్టారు.



Click it and Unblock the Notifications
