Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మీ కళ్లముందే పేలుడు జరిగితే? ఈ 5 నియమాలు మర్చిపోవద్దు!
సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర సిగ్నల్ దగ్గర ఆపి ఉంచిన ఓ కారులో సంభవించిన శక్తివంతమైన విస్ఫోటనం ఆ ప్రాంతంలో భయానక దృశ్యాలను ఆవిష్కరించింది. పేలుడు తీవ్రతకు ఆకాశంలోకి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
సమీపంలోని వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు, మూడు వాహనాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఎందరో తీవ్ర గాయాలపాలయ్యారని సమాచారం. ఆ ప్రాంతమంతా భయంతో వణికిపోయింది. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

ఇలాంటి ఊహించని విపత్తు మన కళ్లముందు జరిగితే? ఆ భయానక క్షణాల్లో మనం ఎలా స్పందించాలి? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి?
నిశ్శబ్దమే మీ మొదటి ఆయుధం
పేలుడు శబ్దం వినగానే గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఆ క్షణంలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. భయాందోళనలతో పరుగులు తీస్తే, మరింత ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. కొన్ని క్షణాలు ఆగి, లోతైన శ్వాస తీసుకోండి. ఇది మీ మెదడుకు ఆక్సిజన్ అందించి, స్పష్టంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. ప్రశాంతమైన మనసు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలదు.
ప్రమాదానికి దూరం
పేలుడు జరిగిన ప్రదేశంలో మరో పేలుడు సంభవించే ప్రమాదం ఉంది లేదా మంటలు వ్యాపించవచ్చు. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలం నుండి దూరంగా, బహిరంగ ప్రదేశానికి వెళ్ళిపోండి.
పొగ, మంటలు వస్తున్న దిశకు వ్యతిరేక దిశలో పరుగెత్తండి. మీరు వాహనంలో ఉంటే, వెంటనే దాన్ని వదిలి రోడ్డు పక్కకు లేదా మైదానంలోకి వెళ్లండి. మూసి ఉన్న భవనాల్లో కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే చోటుకు చేరుకోవడం ముఖ్యం.
చురుకైన ఆలోచనే రక్షణ
భావోద్వేగాలకు లోనుకాకుండా, మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. ప్రమాదం ఎటువైపు నుండి వస్తోంది? సురక్షితమైన మార్గం ఎక్కడ ఉంది? మిగతా వారు ఎలా స్పందిస్తున్నారు? అనే విషయాలను వేగంగా అంచనా వేయాలి. మీ చురుకైన ఆలోచనే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. గుంపుతో పాటు గుడ్డిగా పరిగెత్తకుండా మీ సొంత విచక్షణతో సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోండి.
మానవత్వంతో స్పందించండి
మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత మీ చుట్టూ ఎవరైనా గాయపడి ఉంటే వారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి. వెంటనే పోలీసు (100), అంబులెన్స్ (108) లేదా అగ్నిమాపక దళానికి (101) కాల్ చేయండి. మీకు ఫస్ట్ ఎయిడ్ పై అవగాహన ఉంటే చిన్న గాయాలకు ట్రీట్మెంట్ అందించండి.
వదంతులను నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దు
ఇలాంటి సంఘటనల తర్వాత సోషల్ మీడియాలో పుకార్లు వేగంగా వ్యాపిస్తాయి. తప్పుడు సమాచారం మరింత భయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, కేవలం అధికారిక వార్తా సంస్థలు లేదా ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే నమ్మండి. నిర్ధారణ లేని వార్తలను, ఫోటోలను ఇతరులకు పంపవద్దు.



Click it and Unblock the Notifications
