Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
నీ వలె నీ పొరుగువానిని ప్రేమించు..క్రిస్మస్ శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి!
డిసెంబర్ నెలలో చలిగాలుల మధ్య వెచ్చని ఆనందాన్ని, ప్రపంచవ్యాప్తంగా వెలుగులు నింపే పండుగే క్రిస్మస్. శాంతి, ప్రేమ, కరుణ అనే మూడు గొప్ప సూత్రాల పునాదిపై జరుపుకునే ఈ వేడుక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం, బెత్లెహేములోని ఒక చిన్న పశువుల పాకలో ఏసుక్రీస్తు జన్మించారు.
లోకంలోని చీకటిని పారద్రోలి, మానవాళికి వెలుగును పంచడమే ఆ జననం వెనుక ఉన్న పరమార్థం. అందుకే క్రిస్మస్ రోజున ప్రతి ఇంటిపై మెరిసే నక్షత్రం ఆ వెలుగుకు, దైవానికి ప్రతీకగా నిలుస్తుంది. నీ వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న ఏసుక్రీస్తు సందేశాన్ని ఆచరించడమే నిజమైన పండుగ. క్రిస్మస్ సందర్భంగా మీ బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలను ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.

క్రిస్మస్ విషెస్ ఇలా చెప్పుకోండి
-కరుణామయుడైన ఏసుక్రీస్తు దీవెనలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. క్రిస్మస్ 2025 శుభాకాంక్షలు.
-శాంతి, ప్రేమ, కరుణ..ఇవే ఏసు ప్రభువు మనకిచ్చిన కానుకలు. ఈ క్రిస్మస్ మీ ఇంట ఆనందాలను నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-లోక రక్షకుడు పుట్టిన ఈ పవిత్ర దినాన మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాలి. మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ 2025 శుభాకాంక్షలు.
-దేవుని ప్రేమ మీ హృదయాన్ని, మీ ఇంటిని సంతోషంతో నింపేయాలి. హ్యాపీ క్రిస్మస్ 2025.
-ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో నడుస్తూ.. ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-ఈ పవిత్రమైన రోజున మీ ప్రార్థనలన్నీ ఫలించాలని, దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ..మెర్రీ క్రిస్మస్.
-బెత్లహేము తార మీ జీవితంలో విజయానికి మార్గం చూపాలి. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
-దైవ కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవాలి. క్రిస్మస్ 2025 శుభాకాంక్షలు.
-ప్రేమ అనే దీపాన్ని వెలిగిద్దాం.. శాంతి అనే మార్గంలో నడుద్దాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-కల్మషం లేని ప్రేమకు, అంతులేని కరుణకు ప్రతిరూపం ఏసుక్రీస్తు. ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. మెర్రీ క్రిస్మస్.

-ఈ పండుగ వేళ మీ ఇల్లు నవ్వులతో, మీ మనసు సంతోషంతో నిండిపోవాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు.
-దూరంగా ఉన్నా మనసులన్నీ దగ్గర చేసే పండుగ ఇది. నా ప్రియమైన వారికి క్రిస్మస్ 2025 శుభాకాంక్షలు.
-కేక్ తీపి, స్టార్ మెరుపులు, శాంటా బహుమతులు..అన్నీ మీ సొంతం కావాలి. హ్యాపీ క్రిస్మస్.
-క్రిస్మస్ తాత తెచ్చే బహుమతులతో పాటు, నా ప్రేమను కూడా స్వీకరించండి. క్రిస్మస్ శుభాకాంక్షలు.
-మన బంధం ఈ క్రిస్మస్ ట్రీలా ఎప్పుడూ పచ్చగా, కళకళలాడుతూ ఉండాలి. మెర్రీ క్రిస్మస్ మై డియర్.
-ఆకాశంలో మెరిసే తార.. మీ జీవితంలో తెవాలి ఆనందాల ధార. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-జింగిల్ బెల్స్ మోగాలి.. మీ ఇంట సిరిసంపదలు కురవాలి. హ్యాపీ క్రిస్మస్.
-వెలుగుల పండుగ క్రిస్మస్.. పంచాలి అందరికీ హ్యాపీనెస్. మెర్రీ క్రిస్మస్ 2025.

-క్రిస్మస్ ట్రీ వెలుగులు.. మీ కళ్ళలో మెరుపులు.. ఎప్పటికీ వాడిపోని ఆనందపు గుర్తులు. హ్యాపీ క్రిస్మస్.
-నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ క్రిస్మస్ విషెస్. ఈ 2025 క్రిస్మస్ నీకు అదిరిపోవాలి.
-క్రిస్మస్ రోజున తినే కేక్ ఎంత తీపిగా ఉంటుందో, మన స్నేహం కూడా అంతే తీపిగా ఉండాలి. మెర్రీ క్రిస్మస్.
-కొత్త సంవత్సరానికి ముందు వచ్చే ఈ పండుగ నీకు గుడ్ లక్ తీసుకురావాలి. హ్యాపీ క్రిస్మస్ డార్లింగ్.
-క్రిస్మస్ అనేది ఇవ్వడం,పంచుకోవడంలోని ఆనందాన్ని మనకు గుర్తు చేస్తుంది.



Click it and Unblock the Notifications
