Latest Updates
-
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.!
Money Quotes : డబ్బు జబ్బు అంటారు కానీ జబ్బు నయం కావాలంటే డబ్బు కావాలి..!
ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే అన్నింటికీ ధనమే మూలం, ధనమే కారణం అని అర్థం. మన జీవితంలో డబ్బు చాలా ప్రముఖ పాత్రను పోశిస్తుంది. డబ్బు లేకుంటే కష్టాలు ఉంటాయ్. డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషం కూడా అలాగే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉద్యోగం, వ్యాపారం లాంటివి చేసేవన్నీ డబ్బు కోసమే. మరి డబ్బు ప్రాముఖ్యాన్ని తెలిపే మనీ కోట్స్, డబ్బు కొటేషన్స్‌ను మీకోసం అందిస్తున్నాం.
మనీ కొటేషన్స్
మాటలు రానివాడే కాదు మనీలేని వాడు కూడా జీవితంలో మౌనంగా ఉండాల్సి వస్తుంది.
డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటే సమయం తెలియదు. సమయాన్ని డబ్బుతో కొనేయచ్చు అనిపిస్తుంది.
డబ్బు మిగిల్చాలంటే నడవాలి. డబ్బు నడిపిస్తుంది.

డబ్బుకు కొత్త రుచిని ఆపాదిస్తూ అతడు తన అభిరుచిని కనుగొన్నాడు.
డబ్బు కొన్ని కొత్త అలవాట్లను, మరికొన్ని చెత్త అలవాట్లను నేర్పిస్తుంది.
లోకం డబ్బు చుట్టూ తిరుగుతోంది బాగానే ఉంది కానీ అది ఏ లోకం
డబ్బు జబ్బు అన్నారు, జబ్బు నయం కావాలంటే కూడా డబ్బే కావాలి
డబ్బు ప్రశ్నించే అధికారం ఇచ్చింది కానీ సరైన ప్రశ్నను ఇవ్వలేదు
ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు
నువ్వు పోగొట్టుకొనే ్రతి రూపాయి వంద రూపాయలు సంపాదించుకొని అనుభవ పాఠంగా ఉపయోగపడాలి తప్ప వెయ్యి రూపయలు పోగొట్టుకొనే వ్యసనంగా మారకూడదు.
జీవితంలోని సుఖ దు:ఖాలు నాణానికి ఉన్న బొమ్మా బొరుసు లాంటివి ప్రతీసారి ఒక దానినే చూడగలం, రెండో వైపు చూడాలంటే దానిని త్రిప్పడమే మార్గం.. అందుకే మీరు కష్టాలలో ఉన్నప్పుడు, దానిని త్రిప్పి చూసేది మరచి పోకండి.
డబ్బు కంటే ప్రేమ గొప్పది అంటారు, నేను మా ఇంటి ఓనరుకి అద్దె బదులు ప్రేమ ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు. ఆశ్చర్యంగా ఉంది.
డబ్బు మనిషిని మార్చరు, డబ్బు మనిషి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది.
ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు.
జీవితంలో డబ్బు వుంటేనే బంధువులు ప్రేమ, నమ్మకం, వస్తాయ్. డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు. డబ్బులు వుంటే పరాయి వాడు కూడా మన వాడు అవుతాడు ఇది నిజం.
బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు, ఒప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు..దీనికే విలువ.
ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూలం ధనం.. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించు.
జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి..
నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు.. ఎందుకంటే.. డబ్బు లేని రోజున మండే ఎండలో ఉండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది.



Click it and Unblock the Notifications
