Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు వెళ్తే తిరిగి రావాలనిపించదు, అద్భుతమైన ఆ ప్రాంతాలు ఏంటంటే..
చిరు చినుకులు పడుతూ ఉంటే.. చల్లని వాతావరణంలో వేడి వేడి మొక్కజొన్న కంకి తింటూ ప్రకృతిని ఆస్వాదించడం ఎంతో మధురమైన అనుభూతి. అప్పుడప్పుడు ముఖానికి చిరు జల్లులు తగులుతూ శరీరాన్ని గిలిగింతలు పెడుతుంటే, పచ్చని ప్రకృతిలో అలా అలా విహరించడం అద్భుతంగా ఉంటుంది.
స్నేహితులు, ప్రియమైన వారితో దూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ లు చాలా బాగుంటుంది. మధ్యమధ్యలో ఆగుతూ మసాలా చాయ్, వాన చినుకులు పడుతూ ఉంటే వేడి వేడి పకోడి తింటూ వానాకాలాన్ని ఆస్వాదించడం కన్నా మధురమైనది మరొకటి ఉండదూ అనిపించకమానదు. అలాంటి ఈ రొమాంటిక్ వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో విహరించడం అత్యద్భుతంగా ఉంటుంది. అలాంటి తప్పకుండా సందర్శించాల్సిన కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకుందామా..

హోప్ ఐలాండ్:
కాకినాడ తీరంలో ఉన్న ఒక చిన్న టాడ్‌పోల్ ఆకారపు ద్వీపం ఇది. 18వ శతాబ్దంలో ఏర్పడిన ద్వీపం ఇది. సుందరమైన ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది. ఇసుక తిన్నెలు మంత్రముగ్ధులను చేస్తాయి. చిరుచినుకులు పడుతున్నప్పుడు ఈ ప్రాంతంలో విహరించడం చాలా అద్భుతంగా ఉంటుంది. క్యాంపింగ్ గుడారాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఎత్తిపోతల జలపాతం:
గుంటూరు జిల్లాలోని కృష్ణా నదికి ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంటుంది ఈ ఎత్తిపోతల జలపాతం. చుట్టుపక్కల పచ్చని అడవులతో, వర్షాకాలంలో మరింత అందంగా ఉంటుంది. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలు మైమరిపిస్తాయి. గుంటూరు నుంచి 130 కిలోమీటర్లకుపైగా ఉంటుంది. నల్గొండ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం:
కాకినాడకు సమీపంలో ఉంటుంది కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం. ప్రకృతి ప్రేమికులకు వీనుల విందుగా ఉంటుంది. దేశంలోని అతిపెద్ద మడ అడవుల్లో ఇదీ ఒకటి. పచ్చదనం, తాజాదనం, ప్రశాంతత, పక్షుల కిలకిలరావాల ప్రతిధ్వని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హార్సిలీ హిల్స్:
చిత్తూరు జిల్లాలలోని ఆ హార్సిలీ హిల్స్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అద్భుతమైన సీనరీ ఆకట్టుకుంటుంది. ఈ హిల్ స్టేషన్ కు సమీపంలోనే కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం ఉంటుంది.

గండికోట:
ఇండియన్ గ్రాండ్ కాన్యన్ గా అని కూడా పిలుస్తారు. కడప జిల్లాలోని పెన్నార్ నదికి కుడి ఒడ్డున ఉంటుంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చదనం, సహజ వనరులు, లోయలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. గండికోట, మాధవరాయ స్వామి ఆలయం, రఘునాథ స్వామి ఆలయం ఇక్కడ చూడగద్ద ప్రదేశాలు. అలాగే సమీపంలోనే బెలూమ్ గుహలకు వెళ్లి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

అరకు లోయ:
వైజాగ్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో ఉంటుంది అరకు లోయ. గుహలు, జలపాతాలు, రోడ్ల పకక్న ప్రవహించే ప్రవాహాలు, బొర్రా గుహలు, కాఫీ తోటలు, టైడా, అనంతగిరి, ట్రైబల్ మ్యూజియం వంటివి చూసి మైమరిచిపోవచ్చు. అరకు లోయలో సందర్శించడం అద్భుతంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణం బాగుంటుంది. వైజాగ్ నుంచి అరకుకు రైలు ప్రయాణం మాటలకు అందనంతా బాగుంటుంది. సొరంగాలు, కొండలు, నీటి ప్రవాహాల గుండా రైలు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

మారేడుమిల్లి:
రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజిన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఉంటాయి.



Click it and Unblock the Notifications