Latest Updates
-
కోల్కతా ఫేమస్ టాంగ్రా' డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!
ఆరోజు ఇండియాకు వచ్చేస్తున్న నా అన్వేషణ.. ఆటగాళ్లు సిద్ధంగా ఉండండి!
ఫేమస్ యూట్యూబర్, వరల్డ్ ట్రావెలర్ నా అన్వేషణ అలియాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాను వదిలేసి ప్రపంచ యాత్ర చేస్తున్న ఇతను యూట్యూబ్‌లో విశేషమైన ప్రేక్షకాదరణ, అద్భుతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచ యాత్ర చేసిన అన్వేష్ అనేక దేశాలను తిరిగారు. అనేక దేశాల విశేషాలను తెలియజేస్తూ.. ప్రపంచం మొత్తాన్ని తెలుగు ప్రజలకు చూపించారు.
అయితే ఇటీవల నా అన్వేషణ పెట్టిన వీడియోలో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని, ఎవరూ ఆ ఊహించని సర్‌ప్రైజ్ అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన అనుకున్న సర్‌ప్రైజ్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాకు వచ్చేస్తున్న నా అన్వేషణ
నా అన్వేషణ ఇటీవల తన ఛానెల్‌లో పెట్టిన వీడియోలో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని తెలిపారు. ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నా అన్వేషణ ఇండియాకు వచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు రాక చాలా సంవత్సరాలు అవడంతో ఇండియాకు రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెళ్లి చేసుకోబోతున్న నా అన్వేషణ?
ఇండియాకు వచ్చి ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని, పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్మాయి ఏ ప్రాంతానికి చెందినది? ఎక్కడ పెళ్లి జరుగుతుందనే వార్తలు రానప్పటికీ, అన్వేష్ తన ఇండియా పర్యటనలో పెళ్లి చేసుకోబుతున్నారని, ఒక ఇంటి వాడు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
గృహ ప్రవేశం కోసమా
అన్వేష్ కొన్ని నెలల క్రితం తన నా అన్వేషణ ఛానెల్‌లో తాము వైజాగ్‌లో కొత్త ఇంటిని కట్టుకుంటున్నామని తెలిపారు. అందుకోసం పనులు కూడా పూర్తయ్యాయని, ఇంటి నిర్మాణం మొదలైపోయింది వెల్లడించారు. ఇంటికోసం తాము ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ ఇంటిని కట్టుకుంటున్నారు అనే వివరాలను కూడా వివరించారు.
అయితే ఆ ఇంటి నిర్మాణం ఇప్పటికి పూర్తయినట్లు ఉందని, అందుకే ఆయన ఇండియాకు వస్తున్నారని కొందరు అంటున్నారు. గృహ ప్రవేశంతో పాటు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, కొత్త ఇంట్లో కొత్త పెళ్లి కొడుకు సిద్ధం కాబోతున్నారని పలు వార్త సంస్థలు నివేదించాయి. దీంతో అన్వేష్ గృహ ప్రవేశం కోసం వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారని తెలుస్తోంది.
ప్రపంచ యాత్ర కొనసాగుతుందా?
అన్వేష్ ఇండియా టూర్ తరువాత కూడా తన ప్రపంచ యాత్రను కొనసాగించనున్నారు. కొత్త పద్ధతులు, కొత్త సంసారం, కొత్త విధానాలతో తన కొత్త ప్రయాణం ఉంటుందని ప్రకటించారు. దీని ప్రకారం ఆయన పెళ్లి చేసుకున్న తరువాత తన భార్యతో కలిసి ప్రపంచ యాత్రను కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాగే దీనిపై మాకు మరింత సమాచారం అందితే మీకు తెలిపేందుకు కృషి చేస్తాము.



Click it and Unblock the Notifications
