Latest Updates
-
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక
National Farmers Day 2022: జాతీయ రైతు దినోత్సవం, చరిత్ర, ప్రాముఖ్యత ఏంటంటే..
భారతదేశ ఐదో ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన కిసాన్ దివస్‌గా జరుపుకుంటాం.
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక. వ్యవసాయం అనే జీవన విధానంతో అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికి అన్నం పెడతాడు రైతన్న. ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టాలకు ఓర్చి పంట పండిస్తాడు. దేశాన్ని రక్షించే సైనికులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతే ఉంది. రైతులు దేశానికి చేస్తున్న సేవలను గుర్తుంచుకునేలా ఏటా డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం.

భారతదేశ ఐదో ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన కిసాన్ దివస్‌గా జరుపుకుంటాం.

జాతీయ రైతుల దినోత్సవం:
జాతీయ రైతుల దినోత్సవాన్ని రాష్ట్రీయ కిసాన్ దివస్ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌తో సహా భారతదేశంలోని వ్యవసాయ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది డిసెంబర్ మొదటి శుక్రవారం నాడు ఘనా, USAలో జరుపుకుంటారు. జాంబియాలో ఆగస్టు మొదటి సోమవారం నాడు జరుపుకుంటారు. పాకిస్తాన్ 2019 నుండి డిసెంబర్ 18న రైతు దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.

జాతీయ రైతు దినోత్సవం చరిత్ర:
భారతదేశం గ్రామాలు, వ్యవసాయ మిగులు దేశంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, దాదాపు 50% మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. దేశంలో గ్రామీణ జనాభానే అత్యధికంగా ఉంటుంది.
భారతదేశ ఐదో ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా రైతులకు చాలా మంచి జరిగింది. ఆయన ఉద్యమాల ఫలితంగా జమీందారి చట్టం రద్దయింది. దాని తర్వాత కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం మొదలైంది. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు. ఇలాంటి చర్యల వల్ల చౌదరీ చరణ్ సింగ్ రైతు బంధుగా గుర్తింపు సంపాదించారు.
రైతు కుంటుంబంలో పుట్టి వారి సాధకబాధకాలను సరిగ్గా తెలుసుకుని వారి కోసం ఎంతో సేవ చేశారు చరణ్ సింగ్. 1987 మే 29న ఆయన కన్నుమూసిన తర్వాత.. ఆయన రైతులకు చేసిన సేవలను గుర్తుంచుకునేలా ఆయన జన్మదినం డిసెంబర్ 23న కిసాన్ దివస్‌గా జరుపుకోవాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.
రైతుల పాత్ర మరియు ఆర్థిక వ్యవస్థకు వారి సహకారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

జాతీయ రైతు దినోత్సవం యొక్క ప్రాముఖ్యత
* రైతుల త్యాగాన్ని గుర్తించడానికి రాష్ట్రీయ కిసాన్ దివస్ పాటిస్తారు. రైతుల సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సును నిర్ధారించడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
* రైతులకు అత్యాధునిక వ్యవసాయ పరిజ్ఞానం అందించడం, వారి దిగుబడిని పెంచడంపై దృష్టి సారించడానికి రైతుల్లో అవగాహన కల్పిస్తారు.

చౌదరి చరణ్ సింగ్ గురించి:
* చౌదరి చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని నూర్‌పూర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు.
* ఆయన 28 జూలై 1979 నుండి 14 జనవరి 1980 వరకు భారతదేశ ఐదవ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
* వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన చరణ్ సింగ్ గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
* భారతదేశానికి ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని కేంద్రంగా ఉంచేందుకు ఆయన నిరంతర కృషి చేశారు.
* రుణ విముక్తి బిల్లు 1939 యొక్క సూత్రీకరణ మరియు ముగింపు ఆయన నాయకత్వంలోనే జరిగింది. వడ్డీ వ్యాపారుల నుంచి రైతాంగానికి ఉపశమనం కలిగించడమే ఈ బిల్లు లక్ష్యం.
* 1952లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తున్నప్పుడు, జమీందారీ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నాలకు ఆయన నాయకత్వం వహించారు.
* ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్, 1960 రాష్ట్రమంతటా ఏకరీతిగా ఉండేలా భూ హోల్డింగ్‌లపై సీలింగ్‌ను తగ్గించాలనే లక్ష్యంతో ఆయన తీసుకొచ్చారు.
* ఆయన 23 డిసెంబర్ 1978న రాజకీయేతర, లాభాపేక్ష లేని సంస్థ అయిన కిసాన్ ట్రస్ట్‌ని స్థాపించారు. ట్రస్ట్ యొక్క లక్ష్యం అన్యాయానికి వ్యతిరేకంగా భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం మరియు వారిలో సంఘీభావాన్ని పెంపొందించడం.
* ఆయన సాదాసీదా జీవనాన్ని గడిపేవారు. ఆయన తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా చదవడానికి మరియు రాయడానికి గడిపేవారు. సింగ్ తన జీవితకాలంలో అనేక పుస్తకాలు మరియు బుక్‌లెట్లను ప్రచురించారు. ఆయన ప్రసిద్ధ రచనలు కో-ఆపరేటివ్ ఫార్మింగ్ ఎక్స్-రేడ్, ఇండియాస్ పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ.



Click it and Unblock the Notifications
