Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించి అత్యధికంగా వేధిస్తున్న సమస్య పీసీఓడీ.. అదే పీసీఓఎస్‌గా మారింది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఇది సాధారణ సమస్యగా మారింది. అయితే పీసీఓఎస్ సమస్య అనేది కేవలం సంతాన సాఫల్యతపైనే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా ప్రభావం చూపిస్తూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు ఏం తినాలో ఏం తినకూడదో గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్).. ప్రధానంగా అండాశయంలో సమస్యతో మొదలై అండాలు సరిగా విడుదల కాకపోవడం, రుతుస్రావంలో మార్పులు, రుతుచక్రం ఆలస్యం కావడం ఫలితంగా మున్ముందు దీర్ఘకాలిక వ్యాధులకి దారితీస్తుంది. అయితే ఈ సమస్యని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడి కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో పీసీఓఎస్ ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని.. కొన్నిటిని ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని ఆహార అలవాట్లకి దూరంగా ఉండాలి. లేదంటే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. దీనికి చికిత్స తీసుకుంటూనే లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు ఈ 8 అలవాట్లకి దూరంగా ఉండాలని గైనకాలజిస్టులు సలహా ఇస్తున్నారు.
ఏం చేయకూడదు..
నేటి ఆధునిక కాలంలో ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడకపోతే రోజు మొదలు కాదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే పీసీఓఎస్ బాధితులు ఉదయం స్మార్ట్‌ఫోన్‌ను స్క్రోలింగ్‌కి దూరంగా ఉండాలి. దీని ద్వారా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ద్వారా మీ శరీరంలో పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడకుండా ఉంటుంది. సమస్య అదుపులో ఉంటుంది.
ముఖ్యంగా రోజువారీ పనులు మొదలుపెట్టేముందు టీ లేదా కాఫీ తాగకుండా ఉండలేరు. పరగడుపున తాగడం ద్వారా గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. పీసీఓస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీ వంటివి తాగకూడదని సూచిస్తున్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో సరైన మోతాదులో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. బిస్కెట్లు, రస్క్‌లు వంటి మైదాతో చేసిన తినుబండారాలకి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా ప్రొటీన్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేయాలి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారం చేయకుండా ఉండకూడదు. దీనివల్ల పీసీఓఎస్ సమస్యను అదుపులో ఉంచలేరు.

పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు పండ్ల రసాలు ప్రతి రోజూ తాగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కాసేపయినా ఎండలో కూర్చోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత జటిలమవుతుంది.
ఎలా ఉండాలి
పీసీఓస్ బాధిత మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల మంచి నీరు తాగాలి. దీని ద్వారా పేగు ఆరోగ్యం బాగుపడి జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. తర్వాత శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు ఉదయాన్నే పది లేదా పదిహేను నిమిషాల పాటు బయట వాతావరణంలో చేయడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. మెదడు రిలాక్స్ అయి రోజంతా ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది.
ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం కాసేపైనా ఎండలో నిలబడాలి. దీని ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అయి పీసీఓఎస్ సమస్యను నివారించేందుకు దోహదపడుతుంది. అదేవిధంగా రోజూ రెండు పండ్లను మీ డైట్‌లో చేర్చుకోవాలి. రిఫైన్‌డ్ ఆయిల్, చక్కెర, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ చికిత్సను సమయానుసారంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
