Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
తాజ్‌మహాల్‌ను అమ్మేసిన నట్వర్ లాల్.. ఎంత ధరకు అమ్మాడో తెలుసా?
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్.. ప్రపంచంలోని ప్రేమికులకు చిహ్నంగా చెప్పుకుంటారు. ఈ కట్టడం యొక్క నిర్మాణం అనేది అద్భుతం. దీని వైభవం, చరిత్ర చాలా గొప్పనైనది. ఈ తెల్లని పాలరాతి కట్టడం భారత దేశానికి ఒక గొప్ప సంపద. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ తాజ్ మహల్‌ను చూడటానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి వస్తుంటారు.
అయితే భారత దేశ సంపదగా వెలుగొందుతున్న ఈ కట్టడాన్ని అమ్మడం అనేది చాలా కష్టతరమైన పని అని చెప్పుకోవచ్చు. కానీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తి ఒకరు తాజ్ మహల్‌ను మూడుసార్లు విక్రయించడానికి ప్రయత్నించారు. తాజ్‌మహల్‌నే కాకుండా ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్‌లను కూడా అమ్మేశాడు. అతను మరెవరో కాదు భారతదేశ స్కామ్ కింగ్ నట్వర్‌లాల్.

నట్వర్‌లాల్ తన జీవితకాలంలో చేసిన అసాధారణ కార్యకలాపాలు అతనికి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోసగాళ్ళలో ఒకరిగా పేరు తెచ్చిపెట్టాయి. అలాగే, అతని దోపిడీలు చాలా అపఖ్యాతి పాలయ్యాయి. అతడిని ఈఫిల్ టవర్‌ను రెండుసార్లు విక్రయించిన ఆస్ట్రో-హంగేరియన్ కాన్ ఆర్టిస్ట్ విక్టర్ లుస్టిక్‌తో పోలుస్తుంటారు.
ఎవరు ఈ నట్వర్‌లాల్?
మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ అని కూడా పిలువబడే నట్వర్‌లాల్ 1912లో జన్మించారు. అలాగే జూలై 25, 2009న మరణించారు. భారతదేశానికి చెందిన అతిపెద్ద మోసగాళ్ళలో ఒకరిగా పేరుగాంచిన నట్వర్‌లాల్‌కు దొంగతనాలు చేయడం, కట్టడాలను అమ్మేయడమే లక్ష్యాలుగా ఉండేవి. అతడి ఘరానా మోసగాడైనా నట్వర్‌లాల్ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
న్యాయవాది
నట్వర్‌లాల్ వృత్తిరీత్యా న్యాయవాది. ఫోర్జరీ చెక్కులు, డబ్బుల తయారీలో అతనో నిష్ణాతుడు. ఇతను ఎంత కష్టతరమైన సంతకాలనైనా ఫోర్జరీ చేయగలడు. ఇది అతడిని అతి గొప్ప దొంగగా మార్చేసింది.
ధీరూభాయ్ అంబానీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తోపాటు పలువురు ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేశాడు. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు సంతకాలను ఫోర్జరీ చేసి మరీ పంపేవాడు. ఇది గమనించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పుడే ఆయన కోల్‌కతాకు పారిపోయాడు.
తాజ్ మహల్ అమ్మకం
నట్వర్‌లాల్ తాజ్‌మహల్‌ను మూడుసార్లు విక్రయించినట్లు చెబుతారు. తాను ప్రభుత్వ అధికారిగా నటించి విదేశీ పర్యాటకులను మోసం చేసి చారిత్రక కట్టడాలను అమ్మేవాడు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్‌లను కూడా చాలాసార్లు విక్రయించాడు. ఇప్పటికీ ఈ రికార్డులన్నీ ఉంటాయని చెబుతుంటారు.
జైలు శిక్ష
ఇంత పెద్ద ఘరానా మోసగాడైనా నట్వర్‌లాల్ కేవలం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. కానీ అతను జైలు నుండి తప్పించుకోవడంలో మాస్టర్. అందుకే అతనికి 113 సంవత్సరాల శిక్ష విధించబడింది. అతను జైలు నుండి తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు ఉపయోగించాడు. చాలాసార్లు అతను చాలా విజయవంతమయ్యాడు.
మరణం
1996లో నట్వర్‌లాల్‌ను ఖననం చేసినట్లు అతని సోదరుడు పేర్కొన్నప్పటికీ.. అతను 2009 వరకు జీవించి ఉన్నాడని అతని న్యాయవాది చెప్పారు. తన చావులోనూ అందరినీ మోసం చేశాడు.



Click it and Unblock the Notifications