Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
మన భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు,అదొక ఎమోషన్. భారతదేశంలో బంగారు గనుల అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF).ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో కూడా బంగారు గనులు బయటపడ్డాయి. కానీ కేవలం భూగర్భంలోని గనుల్లోనే కాదు.. మన దేశంలోని కొన్ని నదుల్లో నీటితో పాటుగా బంగారం కూడా పారుతుందని మీకు తెలుసా?
నదుల్లోకి బంగారం ఎలా వస్తుంది?
ఈ నదులు ప్రవహించే మార్గంలో ఉండే ఎత్తైన కొండలు, ఖనిజాలతో నిండిన పర్వతాల గుండా నీరు ప్రవహిస్తున్నప్పుడు, అక్కడి శిలలు సహజంగానే క్రమక్షయానికి గురవుతాయి. ఆ శిలల్లో దాగి ఉన్న సూక్ష్మమైన బంగారు కణాలు నీటి ప్రవాహంలో కలిసిపోయి, నదీగర్భంలోని ఇసుకలో నిక్షిప్తమవుతాయి.

పురాతన కాలం నుండి నదీ తీర ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, స్థానికులు సాంప్రదాయ పద్ధతుల్లో ఆ ఇసుకను జల్లించి చిన్న చిన్న బంగారు రేణువులను సేకరిస్తూ తమ జీవనోపాధిని పొందుతున్నారు. అలా తమ గర్భంలో బంగారాన్ని దాచుకున్న ఆ నదులు ఏవో,ఎక్కడున్నాయో ఇక్కడ చూడండి.
సువర్ణరేఖ నది
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా సువర్ణరేఖ నది ప్రవహిస్తుంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పర్వత ప్రాంతాల గుండా ప్రవహించడం వల్ల ఈ నదిలోని ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు నదిలో ఇసుకను జల్లించి పసిడి కణాలను ఏరుకుంటారు. నేటికీ ఈ నదిలో బంగారం లభించడం ప్రకృతి వింతల్లో ఒకటి.

సోన్ నది
సోన్ నది.. మధ్యప్రదేశ్‌లో పుట్టి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. ఇది రాతిమయమైన, ఖనిజాలు అధికంగా ఉండే భూభాగాల గుండా ప్రయాణిస్తుంది. అందుకే ఈ నదీగర్భంలో చిన్నచిన్న బంగారు కణాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ భారీ స్థాయిలో మైనింగ్ జరగనప్పటికీ, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో బంగారం ఆనవాళ్లు ఉన్నాయని భౌగోళిక పరిశోధనల్లో సైతం తేలింది.
కెన్ నది
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే ఈ నదిలో కూడా బంగారు రేణువులు ఉన్నాయని చెబుతారు. అత్యంత పురాతనమైన, ఖనిజాలు నిండిన రాళ్ల మధ్య గుండా కెన్ నది ప్రవహిస్తుంది. కాలక్రమంలో వాతావరణ మార్పుల వల్ల ఆ రాళ్లు విడిపోయి, అందులోని పసిడి అణువులు నదీ ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చి ఇసుకలో కలుస్తాయి. ఈ నది కేవలం బంగారానికే కాదు, ఆ ప్రాంత వ్యవసాయానికి, వన్యప్రాణుల మనుగడకు కూడా ఎంతో కీలకం.



Click it and Unblock the Notifications
