Latest Updates
-
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే!
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?
ప్రపంచంలో పవర్ ఫుల్ నిఘా సంస్థ అయిన ఇజ్రాయెల్ దేశపు మొసాద్ చేపట్టిన అనేక సీక్రెట్ ఆపరేషన్స్ గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అయితే మొసాద్ కు ఏ మాత్రం తీసిపోదు మన భారత గూఢచార సంస్థ.. రా(RAW)కూడా. మన రా సంస్థ చేపట్టిన ఎన్నో ఆపరేషన్ల గురించి విన్నాం.
అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చేసిన ఆపరేషన్ ఫైర్ వాల్ అనే ఒక ఆపరేషన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటది. దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఆంధ్రా కౌంటర్ సెల్ చేసిన పని వైరల్ అవుతోంది. ఒకరంగా చెప్పాలంటే ఇండియన్ నేవీని మనోళ్లు కాపాడుకున్నారు.

విశాఖపట్నంలో ఇండియన్ నేవీ నేవల్ బేస్ ఒక్కటి మాత్రమే కాదు ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్(తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం) కూడా వైజాగ్ లోనే ఉంది. బే ఆఫ్ బంగాల్ సముద్రాన్ని వైజాగ్ లో ఉన్న యూనిటే కాపాడుతుంది. ఇక్కడి నుంచి నిఘా వర్గాలు నేవల్ షిప్స్, పాట్రోలింగ్ షిప్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కి చెందిన PNS ఘాజీ సబ్ మెరైన్ ని సముద్రంలో కలిపేసింది కూడా వైజాగ్ నేవల్ యూనిటే.
అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం పాకిస్తాన్ కి చెందిన గూఢచార సంస్థ ISI..బే ఆఫ్ బంగాల్ సముద్రంపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ లో ఉగ్రదాడికి ఐఎస్ఐ ప్లాన్ చేసినా చేయొచ్చు. ఇంతకుముందు ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ..గుజారాత్,ముంబై పోర్టుల మీద దృష్టి పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ల కన్ను వైజాగ్ మీద పడింది. వైజాగ్ హార్బర్ లో, వైజాగ్ హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ నేవీ ఆఫీసర్లు, అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు, డ్రైవర్లు ఇలా దాదాపు 18 మందిపై పాక్ ఐఎస్ఐ హనీ ట్రాప్ చేసినట్లు కనిపెట్టారు. ఇందులో 13 మంది నేవీ సిబ్బందే.
హనీట్రాప్ అంటే..సోషల్ మీడియా యాప్ ద్వారా నేవీ అధికారలు, సంబంధిత వ్యక్తులతో పరిచయం పెంచుకొని తర్వాత తమ అందంచందాలను ఎరవేసి వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడం. ఆ అమ్మాయిల అందాల మోజులో పడి మనోళ్లు కీలక సమాచారాన్ని వాళ్లకి ఇచ్చేశారు.
వైజాగ్ లో హరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ బాలెస్టిక్ మిసైల్ సబ్ మెరైన్స్ ఉంటాయి. INS హరిహంత్, INS హరిహట్ వైజాగ్ లోనే ఉన్నాయి. అయితే ఈ INS హరిహంత్ క్లాస్ సబ్ మెరైన్లు ఎప్పుడు హార్బర్ దాటి వెళ్తున్నాయి, ఎప్పుడు హార్బర్ కి వస్తాయనే కీలమైన డేటాను 18 మందిని హనీ ట్రాప్ చేయడం ద్వారా పాక్ ఐఎస్ఐ సేకరిస్తోంది. ఇంతేకాకుండా మిగిలిన పాట్రోలింగ్ షిప్ లు, కీలకమైన షిప్ ల సమాచరం, పోర్టుల కీలక సమాచారాన్ని 18 మందిని హనీ ట్రాప్ చేయడం ద్వారా ISI సేకరించింది. వైజాగ్ లో పనిచేసే నేవీ ఆఫీసర్ల డ్రైవర్లు కూడా హనీట్రాప్ లో ఉన్నారంట. దీన్ని బట్టి ఏ రేంజ్ లో ఐఎస్ఐ తన నెట్ వర్క్ ను వైజాగ్ లో విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ లోని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అనే ఒక యూనిట్ రంగంలోకి దిగింది. ఈ యూనిట్ యాంటీ టెర్రర్ స్క్వాడ్(ATS)తో కోఆర్టినేట్ చేసి నేవల్ పోలీస్, లోకల్ పోలీసుల సహాయంతో ఆపరేషన్ ఫైర్ వాల్ 2026(Operation Firewall 2026)పేరుతో ఆపరేషన్ చేపట్టి.. 18 మంది అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. ఈ 18 మంది పాక్ ISI అమ్మాయిలతో తరచుగా మాట్లాడుతున్నారు, టెలిగ్రామ్, వాట్సాప్ లో వీడియో కాల్స్ చేసుకుంటున్నట్లు కనిపెట్టారు. ఈ 18 మంది ఫోన్లు ట్యాప్ చేశారు.
ఈ ఆపరేషన్ పాన్ ఇండియా లెవల్ లో జరిగింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, గోవా, ఢిల్లీ, బీహార్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ఏపీ టెర్రర్ సెల్ అధికారులు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన 18 మందిలో వైజాగ్ కు చెందిన అన్నెం సాయి వరప్రసాద్ సివిల్ కాంట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా పాక్ అమ్మాయి వలలో పడి వైజాగ్ పోర్ట్ కు సంబంధించిన కీలక డైటాను ఆ అమ్మాయికి చెప్పేశాడని తెలుస్తోంది.

వెస్ట్ బెంగాల్ కి చెందిన ప్రదీప్ ముఖర్జీ అనే మరో వ్యక్తి.. షిప్ ల స్పేర్ పార్ట్స్, మెయింటెన్స్ ఎక్కడ జరుగుతుంది అనే కీలక సమాచారాన్ని పాక్ అమ్మాయి వలలో పడి ఆమెకు చెప్పేసి జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టేశారు. ఇతడిని కోయంబత్తూరులో అరెస్ట్ చేసి ఏపీకి పట్టుకొస్తున్నారు. ఇతను 2014లో ఇండియన్ నేవీలో చేరి ప్రస్తుతం విశాఖలోని ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్ లో సైలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
విశాఖ నేవల్ బేస్ నుంచి యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ ల రాకపోకలు, అంతర్గత కార్యకలాపాల వివరాలను ప్రదీప్ ఆమెకు చేరవేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని డిజిటల్ కార్యకలాపాలపై అనుమానం వచ్చిన ఏపీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్, నౌకాదళ నిఘా వర్గాలు అతడిపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం, ప్రదీప్ ను ఇటీవల కోయంబత్తూరులో అరెస్టు చేశాయి.
మరో 16 మందిని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ టెర్రర్ సెల్ ను అందరూ అభినందిస్తున్నారు. స్టేట్ వైడ్ గా ఉన్న ఒక సెల్ ఇంత బాగా పనిచేయడం అనేది చాలా మంది విషయం.



Click it and Unblock the Notifications

