Latest Updates
-
కాసింత ఘాటుగా, కొంచెం వేడిగా.. ఈ సూప్‌ను రోజుకోసారి తాగారంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.! -
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.! -
మీ బాత్రూమ్లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.! -
రొటీన్ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.! -
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.! -
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ! -
మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా! -
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.! -
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి! -
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్‌లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇక ఆ సమస్యే ఉండదు.!
కాంతారా వెనుక ఎవ్వరూ చెప్పని రహస్యం ఇదే..పంజుర్లీ, భూతకోలా, గోళీగ ఎవరో తెలుసా
కాంతార అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా. 2022 సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన కాంతారా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా ఛాప్టర్ 1 పేరుతో మరో సినిమా తీశారు. ఈ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా మంచి టాక్ తో దూసుకెళ్తొంది. అయితే కాంతారా అంటే కేవలం సినిమా కాదు..అంతకు మంచి. కోట్లాది భారతీయుల నిద్రాణంగా ఉన్న విశ్వాసమనే నిప్పును రాజేసిన ఒక అనుభూతి.
ఆ అడవి, ఆ గర్జన, ఆ ఆచారాల వెనుక మనల్ని మన మూలాలతో కలిపే ఒక అద్భుతమైన పురాణం ఉంది. అది ఇద్దరు సంరక్షక దైవాల కథ..ఒకరు పంజుర్లి, మరొకరు గుళీగ. సుదూర స్వర్గంలో ఉండే దేవతలు కాదు, మన మధ్యే ఉంటూ ఉగ్రరూపంతో మనల్ని కాపాడే క్షేత్రపాలకుల గాథ ఇది. కాంతారా వెనుక ఎవ్వరూ చెప్పని రహస్యం ఏంటో ఇక్కడ చూడండి.

పంజుర్లి..కరుణ నుండి పుట్టిన రక్షకుడు
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు మిగిలిపోయిన ఒక చిన్న వరాహాన్ని పార్వతీదేవి మాతృప్రేమతో పెంచుకుంది. కానీ యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆ వరాహం అదుపులేని ఆవేశంతో, వినాశకర శక్తిగా మారింది. శివుడు దానిని అంతం చేయాలనుకున్నా పార్వతి దేవి వేడుకోలుకు కరిగిపోయాడు. విధ్వంసానికి బదులుగా ఆ శక్తికి ఒక కర్తవ్యాన్ని నిర్దేశించాడు. భూమిని, అడవులను, అక్కడి ప్రజలను కాపాడే సంరక్షకుడిగా ఆ వరాహాన్ని భూమికి పంపాడు. అలా దైవిక అంశతో మానవ రక్షణ బాధ్యతతో పంజుర్లి అనే ఆత్మ జన్మించింది.

గుళీగ..ఆగ్రహం నుండి ఉద్భవించిన యోధుడు
పంజుర్లి కథకు భిన్నమైనది గుళీగ ఆవిర్భావం. పార్వతీదేవి ప్రచండమైన కోపం ఒక రాయిగా రూపాంతరం చెంద, అది నీటిని తాకినప్పుడు అగ్నిగోళంలా ఉద్భవించాడు గుళీగ. అతని నరనరాల్లోనూ ఆవేశం, ఉగ్రత నిండి ఉన్నాయి. పంజుర్లి శాంతమూర్తి అయితే..గుళీగ ప్రళయానికి ప్రతీక. అతని అనియంత్రిత శక్తిని ఒక దారిలో పెట్టడానికి, పంజుర్లి కాపాడుతున్న అదే నేలపై సంతులనం తీసుకురావడానికి అతడినీ భూమికి పంపారు. ఒకరు సృష్టి అయితే మరొకరు లయ. ఇద్దరూ కలిసి భూమికి సంరక్షకులుగా మారారు.
సంఘర్షణ నుండి సంరక్షణ వరకు
ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నా వారి అహాలు వారిని శత్రువులుగా మార్చాయి. వారి భీకర పోరుతో భూమి కంపించింది. అప్పుడు ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి వారి మధ్యకు వచ్చి మీరు శత్రువులు కాదు, ఒకే నాణేనికి రెండు వైపులాంటి వారు. ఒకరు రక్షణ అయితే మరొకరు శిక్షణ అని వారికి గుర్తుచేసింది. ఆమె మార్గదర్శకత్వంతో వారిద్దరూ తమ వైరాన్ని వీడి, పవిత్ర భూమికి జంట సంరక్షకులుగా మారారు.

భూతకోల..మానవుడు దైవమయ్యే క్షణం
ఈ దైవాలను ఆరాధించే జీవమైన సంప్రదాయమే భూతకోల. ఏటా తుళునాడు(కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాంతం) ప్రజలు నిర్వహించే ఈ ఆచారంలో కళాకారుడు పంజుర్లిగానో, గుళీగగానో మారి దైవావేశంతో నర్తిస్తాడు. డప్పుల మోత, అగ్ని కాంతుల మధ్య ఆ కళాకారుడిలో దైవాన్ని చూస్తూ గ్రామస్థులు తమ కష్టాలను చెప్పుకుంటారు. అది కేవలం నృత్యం కాదు భగవంతుడికి, భక్తుడికి మధ్య జరిగే ఒక సంభాషణ.




Click it and Unblock the Notifications