Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
హైదరాబాద్ లో స్ట్రాబెర్రీ ఈవెంట్..మీ చేతులతోనే కోసుకుని తినొచ్చు.. పూర్తి వివరాలు మీకోసం!
చలికాలంలో మార్కెట్లలో ఎర్రటి స్ట్రాబెర్రీలు కనబడుతుంటే మన మనసు వాటి వైపె లాగేస్తుంటది. ఒక స్ట్రాబెర్రీని తీసుకొని నోట్లో పెట్టుకొని ఆస్వాదించాలని మనసు తహతహలాడుతుంటది. చెట్టు నుండి అప్పుడే కోసిన తాజా పండును తినడం ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక స్ట్రాబెర్రీల పండుగలో పాల్గొనడం అంటే ఉరకలేసే ఉత్సాహం వస్తుంది. అదే స్ట్రాబెర్రీ తోటల్లో నడుస్తూ పండ్లను మన చేతులతో తుంపుకొని వాటిని తింటుంటే ఆ కిక్కే వేరబ్బా.
చలికాలపు పొగమంచులో ఉదయాన్నే స్ట్రాబెర్రీ తోటలను సందర్శించడం చాలా బాగుంటుంది. ఆకులపై పడ్డ మంచు బిందువులు, ఎర్రటి పండ్లు, చల్లని గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇది ఫోటోగ్రఫీకి అత్యద్భుతమైన సమయం.

హైదరాబాద్ వాసులకు ఈ చలికాలంలో స్ట్రాబెర్రీ పండుగలో పాల్గొనే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. నగర శివార్లలో, ప్రకృతి ఒడిలో స్ట్రాబెర్రీల తీపిని ఆస్వాదిస్తూ, ఒక రోజంతా సరదాగా గడపడానికి ఎవ్రీథింగ్ స్ట్రాబెర్రీ (Everything Strawberry) పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం సిద్ధమైంది.
ఏరియా77..సరస్సు ఒడ్డున ప్రకృతి సంబరం
జనవరి 11, 2026న సికింద్రాబాద్, చెర్లపల్లిలోని అందమైన సరస్సు ఒడ్డున ఉన్న ఏరియా77(Area77) ఈ వేడుకకు వేదిక కానుంది. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ఒక రోజంతా ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు.
ఈ ఈవెంట్, పచ్చని ప్రకృతి దృశ్యాలు, నీటి అలల సవ్వడి మధ్య సందర్శకులకు ఒక లీనమయ్యే అనుభూతిని అందిస్తుంది. నగర కాలుష్యానికి, ట్రాఫిక్ రొదకు దూరంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ, స్ట్రాబెర్రీల లోకంలో విహరించడానికి ఇది సరైన ప్రదేశం.
పొలం నుండి ప్లేట్ వరకు..అద్భుతమైన అనుభవాలు
ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ స్ట్రాబెర్రీ పికింగ్. అంటే మీరు స్వయంగా పొలాల్లో నడుస్తూ, మొక్కల నుండి తాజా స్ట్రాబెర్రీలను మీ చేతులతో కోసుకునే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. కేవలం కోయడమే కాదు ఫార్మ్ టు ప్లేట్ కాన్సెప్ట్ తో ఆ తాజా పండ్లను ఉపయోగించి తయారు చేసే నోరూరించే వంటకాలు, డెజర్ట్ లను అక్కడికక్కడే రుచి చూడవచ్చు.
వినోదం, విశ్రాంతి
కేవలం ఆహార ప్రియులకే కాదు, ఇక్కడ అందరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
మిక్సాలజీ వర్క్‌షాప్
స్ట్రాబెర్రీలతో రుచికరమైన మాక్ టెయిల్స్, కొత్తరకం డ్రింక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకునే ఇంటరాక్టివ్ సెషన్.
మినీ గోల్ఫ్
రుచికరమైన విందు మధ్యలో కాస్త ఆటవిడుపు కోసం మినీ గోల్ఫ్ ఆడే సౌకర్యం.
లైవ్ మ్యూజిక్
సాయంత్రం వేళ ఓపెన్ ఎయిర్ సీటింగ్ లో కూర్చుని, లైవ్ మ్యూజిక్ వింటూ, స్ట్రాబెర్రీ రుచులను ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఈవెంట్ వివరాలు
కార్యక్రమం: ఎవ్రీథింగ్ స్ట్రాబెర్రీ (Everything Strawberry)
తేదీ: జనవరి 11, 2026
వేదిక: ఏరియా77 (Area77), చెర్లపల్లి, సికింద్రాబాద్
ధర: రూ. 4999 నుండి ప్రారంభం.
నగర కాలుష్యానికి దూరంగా, ప్రకృతి ఒడిలో తీపి జ్ఞాపకాలను మిగుల్చుకోవడానికి ఈ చలికాలంలో స్ట్రాబెర్రీ తోటల సందర్శన అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications