ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్‌నెస్‌.. బిజీ షెడ్యూల్‌లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 17న 76వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే ఆయన వయసు మాత్రం అలా కనిపించదు. ఒక ప్రధానిగా ఆయన ఎన్ని బాధ్యతల్లో తలమునకలై ఉంటారో తెలియంది కాదు. కానీ వయసు పైబడుతున్నా ఆ అలసట మోదీలో కనిపించదు. అదే చురుకైన జీవనంతో ఈ కాలం యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి.. హెల్త్‌ కాపాడుకోవడానికి ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి.. ఇంత వయసులోనూ ఎనర్జీగా ఎలా ఉండగలుగుతున్నారు.. బర్త్‌డే సందర్భంగా ఆయన ఆరోగ్య రహస్యం తెలుసుకుందాం..

Pm narendra modi birthday special yoga is the secret of his fitness at 76 age

యోగాతోనే డే మొదలు

ప్రధాని నరేంద్ర మోదీ తన దినచర్యను క్రమం తప్పకుండా యోగాతోనే ప్రారంభిస్తారట. ఇది తన శరీరాన్ని, మనస్సును బలపరుస్తుందట. రెగ్యులర్‌గా యోగా చేయడం ద్వారానే ఆరోగ్యకరంగా, పీస్‌ఫుల్‌గా ఉంటామని చెబుతారు. అందుకే ప్రతి యోటా జూన్‌ 21న యోగా దినోత్సవం సందర్భంగా ఆయన తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరై యువతకి స్ఫూర్తిదాయకమైన విషయాలను అందిస్తుంటారు. ఈ క్రమంలో వయసుకి తగిన యోగాను ఎంచుకోవాలని సూచిస్తారు.

తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!

బ్యాలెన్స్‌డ్‌ ఆహారం

ఫిట్‌గా, ఆరోగ్యకరంగా ఉండాలంటే కేవలం వ్యాయామం చేయడం మాత్రమే సరిపోదని మోదీ అంటారు. హెల్తీ లైఫ్‌స్టైల్‌ మెయింటైన్‌ చేయాలంటే సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలని చెబుతారు. ఆయన వయసుకి తగిన విధంగా ఆహారంలో తగిన ప్రొటీన్‌, ఫైబర్‌, తాజా పండ్లు, కూరగాయులు, సరైన మోతాదులో నీరు ఉండేలా చూసుకుంటారు.

సరైన టైంలో నిద్ర, మెళకువ

హెల్తీ ఫుడ్‌ తీసుకున్నా, యోగా చేసినా దానికి అనుగుణంగా సరైన టైంలో నిద్ర పోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం కూడా చాలా ముఖ్యమని మోదీ సూచిస్తారు. ప్రతిరోజూ స్లీపింగ్‌ సైకిల్ ప్రాముఖ్యతని నొక్కి చెబుతారు. వయసు పెరిగేకొద్దీ.. సరిగా నిద్రపోవడం, యాక్టివ్‌గా మేల్కొనడంపై దృష్టి సారించాలని సూచిస్తారు. ఒకవేళ మీకు నిద్రలేమి సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.

Pm narendra modi birthday special yoga is the secret of his fitness at 76 age

అలసట లేకుండా యాక్టివ్‌గా

వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ సేపు కూర్చోలేరు. ఏకధాటిగా కూర్చుంటే శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే తాను తన డైలీ రొటీన్‌లో శారీరకంగా ఎక్కువ శ్రమను భాగం చేసుకుంటానని మోదీ చెబుతారు. వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉండటం చాలా ముఖ్యమని సూచిస్తారు.

నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్‌ టూత్‌ పేస్ట్‌.!నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్‌ టూత్‌ పేస్ట్‌.!

మెంటల్‌ హెల్త్‌

కేవలం శారీరకంగా ఫిట్‌నెస్‌గా ఉంటే సరిపోదని మోదీ చెబుతారు. యోగా ద్వారా శరీరం, మనస్సు రెండూ ఉల్లాసంగా, సంతోషంగా ఉంటాయని.. దాని ద్వారానే మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం పెరుగుతుందని సూచిస్తారు. మెంటల్‌ హెల్త్‌ కోసం యోగాతో పాటు నచ్చిన పుస్తకాలు చదవడం, కొత్త విషయాలపై దృష్టి సారించడం, సామాజిక కార్యకలాపాల్లో కలిసిపోవడం, ప్రకృతితో కాసేపు సమయం గడపడం, ఒత్తిడి తగ్గించే పనులపై దృష్టి సారించడం వంటి వాటి ద్వారా వయసు పెరుగుతున్నా మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటారని మోదీ సూచిస్తారు.

Story first published: Wednesday, September 16, 2026, 17:39 [IST]
Desktop Bottom Promotion