Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
వైరల్ వీడియో : కళ్లు లేని బాలుడు సడెన్ గా కలర్ ఫుల్ వరల్డ్ ను చూస్తే ఎంత ఆనందిస్తాడో ఇక్కడ చూడండి...
కొన్నింటిని ప్రత్యక్షంగా చూస్తే.. మరికొన్నింటిని టివిల్లో, స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో చూసి ఆనందిస్తుంటాం. అయితే కళ్లు లేని వారి పరిస్థితి ఏంటి? వారికి లోకమంతా ఎప్పటికీ చీకటిగానే కనిపిస్తుంది.
మనం మన కళ్లతో కలర్ ఫుల్ వరల్డ్ ను ప్రతిరోజూ చూడగలుగుతాం. ప్రతిరోజూ ప్రపంచంలో కనిపించే ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతాం. పచ్చని చెట్లు... అందమైన భవనాలు.. చారిత్రక కట్టడాలు.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలను చూసి పరవశించిపోతుంటాం.కొన్నింటిని ప్రత్యక్షంగా చూస్తే.. మరికొన్నింటిని టివిల్లో, స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో చూసి ఆనందిస్తుంటాం. అయితే కళ్లు లేని వారి పరిస్థితి ఏంటి? వారికి లోకమంతా ఎప్పటికీ చీకటిగానే కనిపిస్తుంది.

తాము ఈ జన్మలో కలర్ ఫుల్ వరల్డ్ ను చూడలేకపోతాం అంటూ బాధపడుతుంటారు.అయితే అలాంటి వారి కోసమే ప్రత్యేకమైన కళ్లజోడును తయారు చేశారు కొందరు. ముందుగా 12 ఏళ్లు ఉన్న అంధుడైన బాలుడికి అకస్మాత్తుగా ప్రత్యేకంగా కళ్లజోడును ఇచ్చారు.

అది పెట్టుకున్న అతనికి ఒక్కసారిగా కలర్స్ కనిపించాయి. అంతే ఆ బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే కళ్ల నిండా ఆనంద భాష్పాలు వచ్చేశాయి. ఈ సంఘటనను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలించింది. ఆ సంఘటనను ఈ కింది వీడియోలో చూడండి...
ఆ బాలుడు మరచిపోలేని రోజు..
ఆ బాలుడి పేరు జోనాథన్. అతను పుట్టినప్పటి నుండి అంధత్వంతో బాధపడుతున్నాడు. అయితే 12 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఓ కళ్ల జోడు ద్వారా కలర్లను చూడటాన్ని గ్రహించాడు. ఆ సంతోషకరమైన క్షణం మరియు అతనికి ఎంతో అనుభూతినిచ్చే వీడియో నెటిజన్ల మనసులను కదిలిస్తోంది.

వారికి రెండే రంగులు..
అంధులకు అందరి మాదిరిగా అన్ని రంగులు కనిపించవు. అయితే కొందరికి మాత్రం నీలం రంగు కనిపిస్తుంది. మిగిలిన వారందరికీ మాత్రం బ్లాక్ అండ్ టివిలో ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది.

ప్రత్యేక కళ్ల జోడు..
ఓ 12 ఏళ్ల బాలుడికి బ్లాక్ అండ్ వైట్ కలర్ల నుండి విముక్తి కలిగించేందుకు ప్రత్యేక కళ్లజోడు ఇచ్చారు. తొలిసారిగా అతనికి కళ్ల మీద ఆ కళ్లజోడు పెట్టినప్పుడు ఆ బాలుడికి వెంటనే అనేక రంగులు కనిపించాయి.

బాలుడి ఎమోషనల్ ..
ఆ క్షణాన ఆ బాలుడు తొలి రంగును చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీలవుతాడు. దీంతో అతని గురువు మరియు క్లాస్ మేట్స్ వచ్చి అతడిని ఓదారుస్తారు. అప్పుడు అతను తన కుర్చీలోంచి లేచి గోడపై వేలాడుతున్న కలర్ ఫుల్ టేబుల్ ను చూస్తాడు. తర్వాత టేబుల్ పై ఉన్న క్యాలెండర్ చేస్తాడు. తొలిసారి అతని ముఖంలో ఫుల్ ఖుషీ అయిపోతుంది.



Click it and Unblock the Notifications
