Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
ఒంటిరిగా ఉన్నప్పుడు ఈద్ సెలబ్రెషన్ సంతోషంగా జరుపుకోవడం ఎలా
ఈద్ ఫెస్టివల్ సంతోషాలకు మరియు ఆంనందాలకు నిలయం. ముఖ్యంగా ముస్లీంలు జరుపుకొనే ఈ పండుగకు బందువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో మరియు స్నేహితులతో కలిపి జరుపుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. అంతే కాదు వారికి నచ్చిన వ్యక్తులను కలవడం వారితో కొంత సమయం గడపడం కూడా ఈ పండుగ యొక్క ప్రత్యేకతే.
ఈద్ స్పెషల్ గా ముస్లీములు వేకువజామునే దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ఈ పండుగ పర్వదినంన అమ్మాయిలు మరింత గ్లామరస్ గా అందంగా మిరిమిట్లుగొలుపుతుంటారు . ముఖ్యంగా వారికి నచ్చే మెచ్చే దుస్తులును ఎంపిక చేసుకోవడం, మెహందీ పెట్టుకోవడం, ఆభరణాలు మరియు అలంకరణ ఈ పండుగ యొక్క ప్రాధాన్యత, అలాగే ఈద్ ప్రార్ధనలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈద్ రోజున ప్రార్ధనలు ముగిసిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం ఈ పండుగ యొక్క ప్రాధాన్యత. READ MORE: బాసుంది-స్పెషల్ స్వీట్ : ఈద్ స్పెషల్
అలాగే కుంటుంబంలోని పెద్దవారు వారికంటే చిన్న వారికి మరియు మహిళలకు మరియు పిల్లలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బుకు ఒక ప్రాధాన్యత ఉంది ఇలా ఇచ్చే డబ్బునే ఈడి అనిపిలుస్తారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, బయటకు వ్యక్తులకు భోజనాలు పెట్టడం, డబ్బు, దుస్తులు పంచడం వల్ల వారికి మంచి జరుగుతుందనే నమ్మకం వీరిలో ఎక్కువ. ఆ సంతోషం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొన్నప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇక మహిళలదైతే పైచేయే అని చెప్పాలి. ఈ రోజును కుటుంబ సభ్యులకోసం, స్నేహితులు, బందువుల కోసం, ఇరుగుపొరుగు వారికోసం ప్రత్యేకంగా వంటలు వండటం వారి ప్రత్యేకత. ఈద్ పండుగలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, సేవియా, క్యారెట్ హల్వా మిరయు మరిన్ని తీపి వంటలు నోరూరిస్తూ ఘుమఘుమలాడిస్తుంటాయి. ఇవే స్నేహితుల్లో బందువుల్లో మరింత ప్రేరణ కలిగిస్తాయి.
READ MORE: కేరళ స్టైల్ బీఫ్ బిర్యానీ : ఈద్ స్పెషల్
ఇదంగా బాగానే ఉంది కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ లేకుండా పండుగను జరుపుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

ఒంటరిగా ఉండకండి:
ఈద్ రోజున మీరు కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు దూరంగా ఉన్నట్లైతే ఇంట్లో మీరు ఒక్కరే ఒంటిరిగా ఉండకండి . బయటకు వచ్చి తిరగడం, పిల్లలతో గడపడం చేయాలి. పిల్లలకోసం మరియు మీ ఆత్మీయులకోసం కొన్ని బహుమతులు మరియు స్వీట్స్ ను కొని వారికి పంచి పెట్టండి.

వంటలు వండటంలో బిజీ అవ్వండి:
మీరు మీ భర్తతో ఉన్నట్లైతే మీ ఇద్దరు మాత్రే ఈద్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్నట్లైతే మీ భర్తకు మరింత ఇష్టమైన వంటలను వండి వారిని సంతోషపరచడంలో నిమగ్నులు కావచ్చు. తర్వాత మీ స్నేహితులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

షాపింగ్:
షాపింగ్ ఒక బెస్ట్ మూడ్ ఎలివేటర్. మీరు ఈ ఈద్ రోజున మీ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నట్లైతే వారికోసం మరియు మీకోసం షాషింగ్ చేయడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ తో పాటు కొంత సంతోషం కలుగుతుంది

సినిమాకు వెళ్ళడం తప్పేమి కాదు:
మీరు ఒంటరిగా ఉన్నట్లైతే ఈద్ ప్రార్దనలు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి సినిమాకు ప్లాన్ చేసి, వెళ్ళడంలో తప్పేమీ లేదు. మీరు మీ కుటుంబం సభ్యులను కలవకుండా, బాధలో ఉన్నప్పుడు, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళడం ఒక మంచి ఉపాయమే.

బహుమతులు కొనడం మరియు పిల్లలకు డబ్బులు ఇవ్వడం:
ఈద్ రోజున మీరు ఒంటరిగా ఉన్నట్లైతే పిల్లలున్న ప్రదేశాలకు వెళ్లడం, లేదా స్నేహితుల పిల్లలకోసం ఏదైనా బహుమతులను కొనడంచేయవచ్చు.

తర్వాత రాబోయే ఈద్ కు మీ కుటుంబం సభ్యలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి:
తర్వాత రాబోయే ఈద్ కు మీ కుటుంబం సభ్యలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి: మరింత సంతోషకరమైన వాతావరణం కోసం తర్వాత రాబోయే ఈద్ కు మీ కుటుంబం సభ్యలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోండి.



Click it and Unblock the Notifications