10 ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలు

By Super

ప్రపంచానికి సున్నా('0') ను ఇవ్వడం నుండి, మన భారతీయులలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు గణిత శాస్త్రజ్ఞులు మరియు జీవశాస్త్రజ్ఞులు, సైన్స్ మరియు టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందటానికి ఎంతో దోహదం చేసారు. మన భారతీయ శాస్త్రజ్ఞులు ప్రాచీన కాలం నుండి కూడా ప్రపంచానికి ఎంతో తోడ్పటును అందించారు.

సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నుండి మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది వివిధ రంగాల్లో వారి నైపుణ్యంతో రాణించారు. ఎందుకంటే వారు కనిపెట్టిన అంశాలు మరియు ఆవిష్కరణల విషయాలను గ్రహించటం మరియు అర్థం చేసుకోవటంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

వైజ్ఞానిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు భారతీయులు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. భారతదేశంలో ఎప్పటికి అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలుగా ఉన్న కొంతమంది గురించి తెలుసుకుందాం.

శ్రీనివాస రామానుజన్

శ్రీనివాస రామానుజన్

20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు.

20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు.

ప్రఫుల్ల చంద్ర రాయ్

ప్రఫుల్ల చంద్ర రాయ్

ప్రసిద్ధ విద్యావేత్త,రసాయన శాస్త్రవేత్త,ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ,బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా అయన చాలా ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది.

C. V. రామన్

C. V. రామన్

భారతదేశంలో చంద్రశేఖర వెంకట రామన్ అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు. భౌతిక శాస్త్రంలో అయన ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అని పిలిచే కాంతి పరిక్షేప ప్రభావంను కనుగొన్నారు. ఒక పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రసరించినప్పుడు కాంతి తరంగదైర్ఘ్యం లో మార్పులు ఉంటాయని అయన నిరూపించారు. కాంతి పరిక్షేప ప్రభావంను కనుకొన్న రామన్ కు 1930 వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది.

హోమీ జహంగీర్ భాభా

హోమీ జహంగీర్ భాభా

హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ మరియు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. అయన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు.

జగదీష్ చంద్ర బోస్

జగదీష్ చంద్ర బోస్

బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.

సలీం ఆలీ

సలీం ఆలీ

సలీం ఆలీ పక్షుల అధ్యయనం మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్తగా చెప్పవచ్చు. అయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. అలాగే అయన అన్ని సమయాల్లోనూ విస్తృతంగా గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు. అంతేకాక సలీం ఆలీని "భారతదేశం యొక్క బర్డ్ మెన్ " గా పిలిచేవారు.

రాజ్ రెడ్డి

రాజ్ రెడ్డి

రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ కనుకోనుట వలన,1994 వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన అలన్ ట్యూరింగ్ అవార్డు ను గెలుచుకున్నారు.

A.P.J. అబ్దుల్ కలాం

A.P.J. అబ్దుల్ కలాం

APJ అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ అని అంటారు. అయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు యుద్ధ క్షిపణి కార్యక్రమం అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. అలాగే అయన భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒకరిగా ఉన్నారు.

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశలను కనుగొనుట వలన 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం 'చంద్రశేఖర లిమిట్' గా పేరు పొందింది.

Desktop Bottom Promotion