Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్!
ఆఫీసులో వరుస మీటింగ్స్, టార్గెట్స్.. పని ఒత్తిడితో తల పగిలిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? కాస్త రిలాక్స్ అవ్వడానికి ఓ ఐదు నిమిషాలు కాఫీ బ్రేక్ తీసుకుంటాం లేదా సహోద్యోగులతో సరదాగా ముచ్చట్లు పెడతాం. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా ఉద్యోగులకు ఉపశమనం కలిగించేది ఈ చిన్న విరామమే. కానీ ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేయడానికి ఏకంగా హస్తప్రయోగానికి బ్రేక్ ఇస్తోంది. వినడానికి షాకింగ్‌గా, వింతగా అనిపించినా ఇది నూటికి నూరు పాళ్లు నిజం.

స్పెయిన్ దేశంలోని బార్సిలోనాకు చెందిన లస్ట్ అనే అడల్ట్ ప్రమోషన్స్ కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పని మధ్యలో కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాకుండా, ఉద్యోగుల మానసిక ఒత్తిడిని పూర్తిగా దూరం చేసి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి రోజూ 30 నిమిషాల పాటు హస్తప్రయోగ విరామాన్ని అధికారికంగా అమలు చేస్తోంది.
అసలు ఈ విచిత్రమైన ఐడియా ఎందుకు వచ్చిందంటే.. 2021లో కరోనా మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్ డౌన్ వల్ల ఉద్యోగుల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన పెరిగిపోవడాన్ని కంపెనీ యాజమాన్యం గమనించింది. వారిలో ఏకాగ్రత దెబ్బతిని, పనితీరు మందగిస్తోందని గ్రహించింది. ఆ సమయంలో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే పరిష్కారాల కోసం అన్వేషించిన కంపెనీ నిర్వాహకులకు ఈ ఆలోచన తట్టింది.
సుదీర్ఘ ఆలోచనల తర్వాత, మెదడుకు ప్రశాంతత చేకూర్చేందుకు స్వయంతృప్తి ఉత్తమ మార్గమని వారు భావించారు. అనుకున్నదే తడువుగా ఆఫీసులో దీనికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. దానికి మాస్టర్బేషన్ స్టేషన్(హస్తప్రయోగ కేంద్రం) అని పేరు పెట్టి, ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ప్రైవసీతో కూడిన వాతావరణాన్ని కల్పించారు.
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం నూటికి నూరు శాతం సత్ఫలితాలను ఇచ్చిందని యాజమాన్యం గర్వంగా చెబుతోంది. ఈ అరగంట బ్రేక్ తర్వాత ఉద్యోగులు మునుపటి కంటే ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా పని చేస్తున్నారని తెలిపింది. వారి ఏకాగ్రత, పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కంపెనీ వివరిస్తోంది.
2005లో అడల్ట్ కంటెంట్ ప్రమోషన్స్ కోసం ప్రారంభమైన ఈ ఏజెన్సీ, కేవలం ఒత్తిడిని తగ్గించడానికే కాకుండా.. సమాజంలో శృంగారం, హస్తప్రయోగం పట్ల ఉన్న మూస పద్ధతులను, అపోహలను తొలగించడానికే ఈ అడుగు వేసినట్లు తెలిపింది. స్వయం తృప్తి అనేది కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, అది మానసిక ఆనందాన్ని, సృజనాత్మకతను అమాంతం పెంచుతుందని కంపెనీ బలంగా విశ్వసిస్తోంది.
వారానికి ఎన్నిసార్లు మంచిది
హస్త ప్రయోగం వల్ల ఎలాంటి నష్టాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి 1 లేదా రెండు సార్లు హస్త ప్రయోగం చేయడం ఆరోగ్యకరమని అంటున్నారు. మన వీర్యం అనేది శరీరం లోపల ఉత్పత్తి అయిపోయిన తర్వాత మీరు అసలు హస్తప్రయోగమే చేయకపోతే మనకు యూరిన్ వచ్చే ఛానల్ స్పెర్మ్ వచ్చే ఛానల్ ఒకటే ఉంటుదని, యూరిన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఒక డ్రాప్ ఏదైనా రీఫ్లెక్స్ అయ్యి వెనక్కి వెళ్లినా ఆ స్పెర్మ్ లో ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంటుందని.. కాబట్టి హస్త ప్రయోగం చేస్తే అది బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు.



Click it and Unblock the Notifications
