Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుందా? బయట చిరుజల్లులు పడుతున్నా, చల్లని గాలి వీస్తున్నా.. ఒక కప్పు వేడి వేడి ఫిల్టర్ కాఫీ లేదా మసాలా టీతో పాటు కమ్మని స్నాక్స్ ఉంటే ఆ మజాయే వేరు. అలాంటప్పుడు ఇన్ స్టంట్ మినీ రైస్ బోండా బెస్ట్ ఆప్షన్. దీని తయారీకి ముందుగా పప్పులు నానబెట్టి, పిండి రుబ్బుకునే అవసరం లేదు. చూడటానికి అచ్చం పునుగులు లాగానే ఉండే ఈ బోండాలు, రుచిలో మాత్రం అమృతంలా ఉంటాయి.

మినీ రైస్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు - 2 (మధ్యస్థ పరిమాణంలో ఉన్నవి)
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 1 (లేదా మీ కారానికి తగినట్లుగా)
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా (సుమారు 1 టీస్పూన్)
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
మినీ రైస్ బోండా తయారీ విధానం
-ముందుగా రెండు బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకుని, వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో ఒక కప్పు బియ్యం పిండి, ఉడికించిన బంగాళదుంపలు, పొట్టు తీసిన అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి, మరీ పలచగా కాకుండా, కొంచెం గట్టిగా, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. ఇక్కడే వంటకానికి సంబంధించిన అసలు కిటుకు దాగి ఉంది. ఈ పిండిని గరిటెతో కాకుండా, మీ చేతులతో బాగా కలపాలి. పిండిలోకి గాలి చేరి, అది ప్లఫీగా అంటే తేలికగా, గాలి బుడగల్లా మారేంతవరకు బాగా బీట్ చేస్తూ కలపాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి సోడా వేయకపోయినా బోండాలు లోపల సాఫ్ట్ గా, బయట కరకరలాడుతూ అద్భుతంగా వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
-నూనె బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, కలుపుకున్న పిండిని చేతితో తీసుకుని చిన్న చిన్న పునుగుల్లా లేదా మినీ బోండాల్లా నూనెలో నెమ్మదిగా వదలండి. ఇవి మంచి బంగారు రంగు వచ్చే వరకు గరిటెతో రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. కరకరలాడుతూ వేగిన తర్వాత వాటిని తీసి, నూనె పీల్చుకోవడానికి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి మార్చుకోండి.
-పొగలు కక్కుతున్న ఈ మినీ రైస్ బోండాలను ఘాటైన కారం చట్నీ (ఎర్ర చట్నీ) లేదా కమ్మని పల్లీల చట్నీ (వేరుశెనగ పచ్చడి)తో నంజుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. వీటికి తోడుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ప్లేట్లో ఉంటే, ఆ కాంబినేషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications