Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్
ఆఫీసులో సిక్ లీవ్ అడగాలంటేనే చాలామంది ఉద్యోగులకు ముందుగా భయం వేస్తుంది. అయితే ఏదైనా నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పే ప్రస్తుత జెన్ జీ(Gen Z) తరం యువత మాత్రం కార్పొరేట్ పద్ధతులను మార్చేస్తోంది. తాజాగా ఒక సిక్ లీవ్ కోసం జెన్ జీ ఉద్యోగికి, అతని మేనేజర్ కు మధ్య వాట్సాప్ లో జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

@WhateverVishal అనే ఎక్స్ యూజర్ ఈ చాట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. భారతీయ మేనేజర్లు తమ కింద పనిచేసేవారిని ఉద్యోగులుగా కాకుండా బానిసలుగా భావిస్తారు. దానికి ఈ జెన్ జెడ్ ఉద్యోగి ఇచ్చిన రిప్లై అదుర్స్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..
ఒక ఉద్యోగి తనకు జ్వరం పెరిగిపోయిందని, ఆఫీసుకు రాలేనని తన మేనేజర్‌కు మెసేజ్ చేశాడు. దానికి మేనేజర్ స్పందిస్తూ.. సరే, నేను వచ్చి నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నాడు. అందుకు ఆ ఉద్యోగి సున్నితంగా తిరస్కరిస్తూ.. అవసరమైతే నేనే వెళ్తాను, ప్రస్తుతానికి పారాసెటమాల్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాను అని రిప్లై ఇచ్చాడు.
అక్కడితో ఊరుకోని మేనేజర్.. ఎవరు సిక్ లీవ్ పెట్టినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ లేదా లీవ్ అప్లికేషన్ మీద తల్లిదండ్రుల సంతకం కానీ తప్పనిసరిగా ఉండాలని డైరెక్టర్ చెప్పారు అని బాంబు పేల్చాడు. దీనికి ఆ జెన్ జెడ్ ఉద్యోగి ఏమాత్రం తడుముకోకుండా..నా దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, పేరెంట్స్ సంతకం పెట్టించుకోవడానికి నేను స్కూల్ పిల్లాడిని కాదు. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. దయచేసి నాకు కాల్స్ కానీ, మెసేజ్ లు కానీ చేయకండి, నేను రిప్లై ఇవ్వను అని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాడు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మేనేజర్ కు మద్దతు పలుకుతుంటే, మెజారిటీ నెటిజన్లు ఉద్యోగికి అండగా నిలుస్తున్నారు. ఉద్యోగి తీరును తప్పుబట్టిన ఒక నెటిజన్..అతను నా కంపెనీలో ఉంటే వెంటనే ఉద్యోగంలోంచి పీకేసి, అతనికి వేరే ఇంటర్వ్యూ అవకాశం కూడా రాకుండా చేసేవాడిని. భవిష్యత్తులో వాడు ఏ వ్యాపారం పెట్టినా నాశనం చేసేవాడిని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
మరికొందరు..విదేశాల్లో సిక్ లీవ్ కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ అడగడం సర్వసాధారణం. మన దగ్గరే కొందరు శుక్రవారం, సోమవారాల్లో కావాలని అబద్ధాలు చెప్పి సిక్ లీవ్స్ తీసుకుని లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే కంపెనీలు ఇలా కఠినంగా ఉంటున్నాయి అని కామెంట్ చేశారు.
అయితే చాలా మంది ఉద్యోగి పక్షాన నిలబడ్డారు. సంవత్సరానికి 24 నుంచి 30 పెయిడ్ లీవ్స్ ఇచ్చి, వాటిని వాడుకోవడానికి అనుమతించకపోతే ఇక ఆ సెలవులు ఎందుకు?"అని ఒకరు ప్రశ్నించారు. మేనేజర్ పరిధి దాటి ప్రవర్తించాడు..నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా అనడం, స్కూల్ పిల్లాడిలా పేరెంట్స్ సంతకం తీసుకురా అనడం హాస్యాస్పదం. ఆ ఉద్యోగి చెప్పిన సమాధానంలో తప్పులేదు అని మరొకరు విమర్శించారు. ఏది ఏమైనా.. పాత తరం బాస్ ల పెత్తనానికి, నేటి జెన్ జెడ్ ఉద్యోగుల తెగింపునకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ సంఘటన స్పష్టంగా కళ్లకు కడుతోంది.



Click it and Unblock the Notifications
