Latest Updates
-
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా
ప్రపంచంలో మీరు వినదగిన, మీకు ఇష్టం లేని వికృత శబ్దాలు
కొన్ని శబ్దాలను మనమందరం కూడా ఇష్టపడతాం. ఉదయం పక్షుల కిచకిచలు లేదా తేలికపాటి సంగీత ధ్వని లేదా గిటార్ మరియు పియానో వంటి ఇతర సంగీత వాయిద్యాల సౌండ్స్.
కొన్ని శబ్దాలు మీ మనస్సును మరియు గుండెను ప్రశాంతంగా ఉంచుతాయి మరియు మీరు వినే ధ్వనిని బట్టి, మంచి లేదా చెడు గాని మీ ఆరోగ్యంపై అనేక ప్రభావాలు చూపిస్తుందని ఒక క్రొత్తగా చేసిన పరిశోధన మూలంగా తెలుస్తున్నది. కొన్ని తేలికపాటి శ్రావ్యంగా, మృదువుగా ఉండే శబ్దాలు మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ కోసం మంచివి. అవి నిరాశ మరియు అనేక ఇతర వైద్య పరిస్థితుల నుండి బయటపడటానికి సహాయపడతాయి.
అయితే, కొన్ని శబ్దాలు మనస్సు మరియు శరీరం కోసం మంచివి కాదు. ఈ శబ్దాలు వింటున్న కొద్ది ఉద్రేకం తెప్పిస్తుంటాయి మరియు మిమ్మలిని మానసికంగా అనారోగ్యం పాలు చేయవచ్చు. మీ మానసిక శాంతి కోసం ఈ శబ్దాల సైట్ నుండి దూరంగా వెళ్ళటం ఉత్తమం. ఈ శబ్దాల ప్రపంచంలో అతి చెత్త శబ్దాలు వంటివి అని కొన్నిటిని రేట్ చేశారు.
మేము మీకొరకు అత్యంత చిరాకు కలిగించే శబ్దాలను కొన్నిటిని లిస్టు తయారుచేశాము. ఈ ప్రపంచంలో వీటిని అతి చెత్త శబ్దాలుగా పరిశోధనలో చెప్పారు. ఎప్పుడూ అత్యంత చిరాకు తెప్పించే శబ్దాలను కొన్నిటిని చూద్దాము.

వాంతుల సౌండ్
ఈ సౌండ్ విన్న ఇతర వ్యక్తీ కూడా వాంతి చేసుకుంటాడు. ఇది మానసికంగా మరియు వాంతి చేసుకునేప్పుడు వొచ్చే శబ్దం ఈ రెండిటి మూలంగా అవతలి వ్యక్తికీ వాంతి మరియు వికారం అనుభూతి కలుగుతుంది.

మైక్రోఫోన్ సౌండ్
అడ్జస్ట్ చేస్తున్నప్పుడు లేదా అది పనిచేస్తున్నదా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు మైక్రోఫోన్ యొక్క బిగ్గరగా అరిచే కీచు ధ్వని. ఈ ధ్వని రెండువిధాలుగా మానసికంగా మరియు శారీరకంగా బాధాకరం మరియు ఈ శబ్దాన్ని ప్రపంచంలో అత్యంత చిరాకు తెప్పించే శబ్దాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

పాప ఏడుపు
తల్లి శిశువు యొక్క ఏడుపును బాగా పసికడుతుంది. అయినప్పటికీ, తండ్రికి మాత్రం శిశువు ఏడుపు విని చిరాకు పడతాడు మరియు వారు కోపం తెచ్చుకుంటారు. ఈ ధ్వని కూడా ఎప్పుడూ అత్యంత చిరాకు తెప్పించే శబ్దాలలో ఒకటిలాగా జాబితాలో చేరింది.

కీచుమనే రైలుకూత ధ్వని
ఒక మెటల్ ఉపరితలం ఇంకొక మెటల్ ఉపరితలానికి వ్యతిరేకంగా రాసుకున్నప్పుడు వొచ్చే కీచుమనే ధ్వని చాలా చిరాకుకు కారణమవుతోంది. రైల్వే ట్రాక్ల సమీపంలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ ఈ కీచుమనే ధ్వని ద్వారా కలత చెంది చిరాకు పడుతుంటారు.

డెంటల్ డ్రిల్
ఇది కూడా చెవులలో రింగింగ్ సంచలనాన్ని సృష్టించి అత్యంతచికాకు పెట్టే ధ్వనులలో ఒకటి. ఇది ముఖంలో ఒక విధమైన చిరాకైన కదలికలను సృష్టిస్తుంది. అందుకే ప్రజలు సాధారణంగా దంత విధానాలు అంటే భయపడుతుంటారు.

బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ చేసే సౌండ్
ఈ ధ్వని విద్యార్థులలో చాలా కోపం తెప్పించే ఫీఇంగ్ అనుభూతిని సృష్టించి వారి చెవులు మూసుకునేట్లుగా చేస్తుంది. అందుకే చాలావరకు పాఠశాలలలో సంప్రదాయ నల్లబల్లలకు బదులుగా సాఫ్ట్ వైట్ బోర్డ్స్ మరియు మార్కర్స్ ఉపయోగిస్తున్నారు.

వాదించే జనాలు
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వాదిస్తూ ఉన్నప్పుడు, అది మీ ఏకాగ్రతను మరియు ఆలోచించడం మీ ఆలోచనా సామర్థ్యాన్ని భంగపరుస్తుంది. దీనివలన మానసిక శాంతి దెబ్బతింటుంది మరియు ఇది ప్రపంచంలో అత్యంత చిరాకు కలిగించే ధ్వనులలో ఒకటిగా భావిస్తారు మరియు ఈ ధ్వని మనస్సుకి మంచిది కాదు.

అపానవాయువు యొక్క సౌండ్
ఇది చాలా బాధించే ధ్వని మరియు ఫార్టింగ్ చేసే వ్యక్తి ఇబ్బందిపడే క్షణం. ఈ అపానవాయువు యొక్క ధ్వని వలన పురుషుల కంటే మహిళలు ఎక్కువ చిరాకు పడుతుంటారు.

గడియారం అలారం యొక్క సౌండ్
ఈ అలారం ధ్వని వలన ఉదయాన్నే మీ గుండె స్పందన వేగం పెరుగుతుంది మరియు మిమ్మలిని మానసికంగా చిరాకు పెడుతుంది. దీనికి కారణం వారివారి మానసికబలం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఈ ధ్వని కూడా ప్రపంచంలో చిరాకు పుట్టించే ధ్వనులలో ఒకటిగా ఎంపికయింది.

వాహనాల బ్రేక్ ధ్వని
ఈ ధ్వని విన్నప్పుర్డు మీకు పళ్ళు కొరుక్కున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఈ ధ్వని ఏదో ప్రమాదం సంభవించింది అన్న ఒక విధమైన భయం మీలో సృష్టిస్తుంది. కాబట్టి ఈ ధ్వని కూడా చాలా భయపెట్టే, చిరాకు పుట్టించే ధ్వనిగా రేట్ అయ్యింది.

జలుబుతో
జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ముక్కు చీదుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తికి ఆ ధ్వని వలన చిరాకు మరియు ప్రకోపం అనుభూతి కలుగుతుంది.



Click it and Unblock the Notifications
