Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
మన ఇండియా ప్రపంచానికి పరిచయం చేసిన 20 వస్తువులు..
భారతదేశం పేరు వినగానే సంస్కృతీ, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిన వీరులు, అనుబంధాలు, ఆప్యాయతలు, కుల మతాలకతీతంగా ఒకరంటే ఒకరికి సోదర భావాలు ఒక్క సారిగా కనులముందు ప్రత్యక్షం అవుతాయి.
నేడు ప్రపంచం మనదేశాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటోంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలోఎక్కువగా ఉపయోగిస్తున్న వస్తువులు మన భారతీయులు పరిచయం చేసినవే. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి విశ్వవిద్యాలయం(తక్షశిలా విద్యాలయం)
ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని క్రీ.పూ.700 సంవత్సరంలో తక్షశిలలో నిర్మించారు. ఇక్కడ 300 లెక్చరర్ హాల్స్, ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఉన్నాయి. దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుండి విద్యను అభ్యసించినట్లు, 200 మంది ప్రొఫెసర్లు విద్యను బోధించినట్లు, చైనాకు చెందిన హీన్ సాంగ్ తన డైరీలో రాసుకున్నాడు.
Image Courtesy

న్యూమరల్ నెంబర్స్ లో జీరో :
ప్రపంచానికి సున్న(0)ను పరిచయం చేసిన వ్యక్తి , మనదేశానికి చెందిన ఆర్యభట్ట . నేడు సున్నాలేని కాలుకుల్యేషన్ ను ఊహించగలమా...?ఆర్థమెటిక్ ఆపరేషన్ కు మొదట జీరో నుండే ప్రారంభించారు.
Image Courtesy

చెస్ :
6 వ శతాబ్ధంలో చెస్(చదరంగం) గుప్తుల ప్రపంచానికి పరిచయం చేశారు. దీరి కాలంలో కనుగొన్న ఈ ఆటను అప్పట్లో ‘చతురంగ' అని పిలిచేవారు.

బటన్స్ :
ప్రపంచంలో మొదటిసారిగా అలంకారిక గుండీలను మన దేశీయులే కనుగొన్నారు. సముద్రంలో లభించే షీషెల్స్ ను చొక్కాలకు గుండీలుగా ఉపయోగించారు. ఇవి రేఖాగణితం ఆకారంలో ఉండేవి. వాటికి మధ్యలో రంధ్రాలను వేసి గుండీలుగా ఉపయోగించారు.

షాంపు:
ప్రస్తుతం మన షాంపూగా పిలవబడుతున్న పేరు హిందీ పదం ‘చాంపు' నుండి 1762లో వెలుగులోకి వచ్చింది. తూర్పు భారతదేశానికి చెందిన మొఘల్ సామ్రాజ్యంలో క్షారము,నూనెతో కలగలిపి తలకు మర్ధనా చేసుకునేవారు. బెంగాలీ వ్యాపారవేత్త అయిన సేక్ డీన్ మొహమ్మద్ వలన బ్రిటన్ లో మొదటిసారి ఈ షాంపు ఆవిర్భించబడింది.

లెప్రసి:
కుష్టువ్యాధి నివారణను 6వ శతాబ్దంలో భారతీయ వైద్యులు మందును కనుగొన్నారు దాని గురించిన సమాచారం శుశ్రుత సంహిత మరియు అధర్వణ వేదంలో ఉన్నట్లుగా లిఖింపబడ్డాయి.
Image Courtesy

స్నేక్ లాడర్ :
వైకుంఠపాళిగా పిలవబడుతున్న పాము-నిచ్చెన ఆటను మన భారతీయులే కనుగొన్నారు. దీని అసలు పేరు ‘మోక్షపత్'. భారతదేశాన్ని బ్రిటీషులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్ కు మరియు అమెరికాకు దారిని కనుగొనే విధంగా ఈ ఆటను 1943లో రూపొందించారు.
Image Courtesy

ఆయుర్వేదం:
ఎలాంటి రోగాన్నైనా నయం చేసేలా మూలికలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలతో క్రీ. పూ. ఆయుర్వేదాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎన్ని అదునాతిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపేవారే ఎక్కువ.

బాస్కర:
7వ శతాబ్దంలో బ్రహ్మపుత్రుడు అభివృద్ధి చేసిన ఖగోళశాస్త్ర ప్రకారం భూమికి సూర్యుడికి మధ్య దూరం, సూర్యుడు కక్షలోకి భూమి తీసుకునే సమయాన్ని, నక్షత్ర మండలం పొడవును భాస్కరాచార్యుడు కచ్చితంగా చెప్పాడు.
Image Courtesy

బుద్దిజం:
బౌద్ధమతం, జైనమతం భారదేశంలో ఉద్భవించాయి. ఆసియా ఖండాలవరకూ బౌద్దమతం గొప్పదనం తెలిసినా, జైనమతం మాత్రం ఒక్క భారతదేశంలో మాత్రమే అభివృద్ధిలోకి వచ్చింది. చారిత్రాత్మక కాలంలోనే ఈ రెండు మతాలు ఉద్భవించాయి.

ఫిబోనాసి:
దశాంశపద్ధతిని కనుగొన్నది మన దేశీయులే. ఈ సీక్వెన్స్ ను మొదట క్రీ.శ 700ఏడి విరహాంక, క్రీ. శ 1135లో పోపాలా మరియు హెమచంద్ర కనుగొన్నారు.
Image Courtesy

కళంటి శుక్లాలకు శస్త్రచికిత్స:
కంటిశుక్ల శస్త్రచికిత్సను మన భారతీయులే కనుగొన్నారు. ఈ శస్త్ర చికిత్స ద్వారా కంటిచూపు బాగా కనిపించడం,పొరల సమస్యలు తగ్గేవి. తర్వాతి కాలంలో ప్రపంచమంతా ఈ
శస్త్ర చికిత్స వెలుగులోకి వచ్చింది.

మొక్కల పెరుగుదలను తెలుసుకునే పరికరాన్ని
మొక్కల పెరుగుదలను తెలుసుకునే పరికరాన్ని 20వ శతాబ్దంలో సర్ జగదీశ్ చంద్రబోస్ కనుగొన్నారు. మొక్కలు ఎన్ని ఏళ్ళ నాటివి అని వాటి కాండాన్ని బట్టి లెక్కగట్టే వారు.
Image Courtesy

కాశ్మీర్ ఉలెన్ ను కనిపెట్టింది:
13వ శతాబ్దంలో కాశ్మీర్ ను పరిపాలించిన జాయన్ ఉల్ అబిదీన్ మొదటి కాశ్మీర్ ఉన్నిని ఆవిష్కరించారు. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన నేత కార్మికులు వీటిని
నేసేవారు.

యూఎస్ బి పవర్ చిప్ :
యూఎస్ బి, వేగవంతమైన గ్రాఫిక్ ఫోర్ట్స్, పవర్ మేనేజ్ మెంట్, పిసిఐ ఎక్స్ ప్రెస్, చిప్స్ మెరుగుదల ఎలా పనిచేస్తాయో, వాటి అభివృద్ధిని భారతదేశానికి చెందిన ఇండో-అమెరికన్ఆర్కిటెక్ట్ అజయ్ వి.భట్ అభివృద్ధి చేశాడు.
Image Courtesy

ప్లేయింగ్ కార్డ్స్ :
ప్లేయింగ్ కార్డ్స్ గా ఉపయోగిస్తున్న పేకలను పూర్వం, క్రుదపట్నం అనే పెయింటింగ్ కాగితాలను మన దేశంలో వాడేవారు. వాటి ప్రేరణతోనే ఇప్పటి ప్లేయింగ్ కార్డ్స్ వచ్చాయి.

జనపనార:
జనపనారను ఉపయోగించి తాళ్ళను అల్లడం, మోతాడులా ఉపయోగించుకోవడం ఎలాగో మన పురాతన దేశస్థుల ప్రకారమే ప్రపంచానికి తెలిసింది. ఈ జనపనారను వెస్ట్రెన్ ప్రపంచానాకి కూడా ఎగుమతి చేస్తున్నారు . వీటితో రోబ్స్ మరియు కార్డేజ్ లను తయారు చేసేవారు . ఇండియన్ జూట్ ఇండస్ట్రీ బ్రిటీస్ వారికాలంలో మార్పు చెందినది.

ఖగోళశాస్త్రీనికి సంబంధించిన కొన్ని విషయాలు :
5వ శతాబ్దంలో ఆర్యభట్ట సున్న(0)ను కనుగొనగా, 4 శతాబ్దంలో ఖగోళశాస్త్రానికి సంబధించి మరిన్ని కొత్త సంగతులను పరిచయం చేశారు మన ఖగోళ పండితులు. కాగా 6 శతాబ్దంలో త్రికోణమితికి సంభందించిన కొన్ని నియమాలను మరియు బేసిక్ ఫార్ములాను వరాహమిహిరా అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు.sin^2(x) + cos^2(x) = 1 అందులో ఇది
ఒకటి.
Image Courtesy

పెంటియం చిప్స్ :
ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న పెంటియం చిప్స్ వినోద్ ధామ్ అనే భారతీయుడు కనుగొన్నారు. పెంటియం చిప్స్ గాడ్ ఫాదర్ గా ఈయనను అంటారు,. వీటి అభివృద్ధికి తోడ్పడి, ఇంటెల్ ప్రాససెర్ నుండి తయారవుతున్న ఆ చిప్స్ విజయానికి కారకుడయ్యాడు.
Image Courtesy

క్యాండీ షుగర్
చక్కెర నుండి స్పటిక చక్కర మరియు ఉత్పత్తి ప్రక్రియను గుప్తుల కాలంలో కనిపెట్టారు. ఇది చైనీయుల ద్వారా చైనా దేశానికి పాకింది. ఈ ప్రక్రియను అక్కడ అమలు చేశారు. అలా ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని ఫాలో అయ్యారు.



Click it and Unblock the Notifications