Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
తొలిసారి శృంగారం..ఈ పచ్చి నిజాలు మీకు తెలుసా..!
జీవితంలో ఏ తొలి అనుభూతైనా ఎప్పటికీ మదిలో నిలిచిపోయే ఓ అందమైన జ్ఞాపకం. తొలిప్రేమ, మొదటి శారీరక కలయిక గురించిన ఊహలు ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో మధురమైన భావాలను రేకెత్తిస్తాయి. భాగస్వామితో ఏకాంతంగా, ఆనందంగా సమయాన్ని గడపాలని కోరుకోవడం సహజం. అయితే పడకగదిలో అడుగుపెట్టే ముందు, ముఖ్యంగా తొలిసారి శృంగారంలో పాల్గొనేటప్పుడు శరీరంలో జరిగే కొన్ని సహజ మార్పుల గురించి ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. తొలి కలయిక గురించి యువతీయువకుల్లో ఎన్నో అపోహలు, భయాలు ఉంటాయి.

అధ్యయనంలో ముఖ్య విషయాలు
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సుమారు 75 శాతం మంది మహిళలు తమ మొదటి శృంగారంలో ఆనందం కంటే నొప్పినే ఎక్కువగా అనుభవిస్తారని తేలింది. దీనికి ప్రధాన కారణం మానసిక ఆందోళన. మన సమాజంలో శృంగారం పట్ల ఇప్పటికీ ఉన్న భయాల వల్ల మహిళల్లో ఏర్పడే కంగారు, జననాంగాలు పొడిబారేలా చేస్తుంది. తగినంత తేమ లేకపోవడం వల్లే ఈ నొప్పి కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఆందోళన విడనాడి, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం.
కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ నివేదిక ప్రకారం, మొదటిసారి సంభోగం తర్వాత కనీసం 0.7 నుంచి 9 శాతం మంది మహిళల్లో తేలికపాటి రక్తస్రావం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం తొలిసారి కలయికతో కన్నెపొర(Hymen) పగలడం లేదా చిరగడమే. ఈ రక్తస్రావం కొద్ది గంటల్లో లేదా మహా అయితే ఒక రోజులో దానంతట అదే ఆగిపోతుంది. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఒకవేళ రక్తస్రావం ఏకధాటిగా కొనసాగితే మాత్రం తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.
అలాగే, తగినంత జారుడు గుణం లేనప్పుడు చేసే నిరంతర ప్రయత్నాల వల్ల నలుగురిలో ముగ్గురు మహిళలు జననాంగాల చికాకును, మంటను ఎదుర్కొంటారు. నడిచేటప్పుడు లేదా మూత్ర విసర్జన సమయంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, అది ఒకట్రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది.

మొదటి కలయిక సమయంలో వక్షోజాల పరిమాణంలో, చనుమొనల్లో తాత్కాలికంగా కొన్ని మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి కాస్త పెద్దవిగా, దృఢంగా మారినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే శరీరం తన మునుపటి యథాస్థితికి చేరుకుంటుంది. ఇక శృంగారం తర్వాత మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు (UTI)లేదా ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కలయికలో తప్పనిసరిగా కండోమ్ వాడాలి. ఇది అవాంఛిత గర్భాన్ని నివారించడమే కాకుండా ఇద్దరి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని సూచిస్తున్నారు.
అవి వాడితే అంతే సంగతులు
కొందరు కండోమ్ లకు ప్రత్యామ్నాయంగా డాక్లర్లు సలహా లేకుండానే గర్భనిరోధక ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీనివల్ల మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, భవిష్యత్తులో ఋతుక్రమ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వారానికి ఒకసారైనా..!
తొలిసారి కన్నెపొర తొలగిపోయిన తర్వాత యోని నిర్మాణంలో వచ్చే సహజ మార్పుల వల్ల తర్వాతి కలయికల్లో నొప్పి భావన గణనీయంగా తగ్గుతుంది. కొందరు ఆ తొలి అనుభూతిని మళ్లీ పొందేందుకు హైమెనోప్లాస్టీ'(కన్నెపొరను మళ్ళీ అతికించే సర్జరీ) కూడా చేయించుకుంటారని నిపుణులు వివరిస్తున్నారు. శృంగారానికి అలవాటు పడిన తర్వాత, వారానికి కనీసం ఒక్కసారైనా కలయికలో పాల్గొనడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ (హ్యాపీ హార్మోన్) ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి, మానసిక ఒత్తిడి మాయమవుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుందని చెబుతారు.



Click it and Unblock the Notifications
