Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
చనిపోయిన వాళ్ల ఎముకలతో సూప్ తాగడం ఎక్కడైనా చూశారా ??
సంస్కృతి, సంప్రదాయాలనేవి.. మనషుల జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. మనం సంస్కృతి, సంప్రదాయాలను మన పూర్వీకుల ద్వారా పొందాం.. వాళ్లను అనుసరిస్తూ.. ఆ సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉన్నాం. వాటి వెనక ఉన్న ప్రాధాన్యత తెలియడం వల్ల.. వాటిని మనం క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నాం..
అయితే కొన్ని సంప్రదాయాలు.. చాలా భయంకరమైన, వింతైనవిగా ఉంటాయి. కొన్ని సంప్రదాయాలకు అర్థం, పరమార్థం ఉంటే.. కొన్ని ఎందుకు ఉపయోగం లేనివిగా ఉంటాం. అలాంటివి కాస్త ఇబ్బందికి కూడా గురిచేస్తాయి. అలాంటి కొన్ని అత్యంత వింతైన, భయంకరమైన సంప్రదాయాలను కొన్నేళ్లు కొన్ని ప్రాంతాల్లో పాటిస్తూ వస్తున్నాయి.
అలాంటి ఆసక్తికర, భయంకరమైన సంప్రదాయాలేంటో ఇప్పుడు చూద్దాం..

గండ్రు చీమ గ్లోవ్స్
అమేజానియన్ ట్రైబ్ కి చెందిన అబ్బాయిలు.. వాళ్ల సత్తా చూపించడానికి చాలా వింతైన, బాధాకరమైన సంప్రదాయం పాటించాలి. వాళ్లు గండ్రుచీమలతో నిండిన టోపీ ధరించి.. కనీసం 10 నిమిషాలు డాన్స్ చేయాల్సి ఉంటుంది. అలా సక్సెస్ అయితేనే.. వాళ్లు సత్తా కలిగిన మగవాళ్లు అని నిర్ధారిస్తారు.

హిందూ థైపుసం ఫెస్టివల్
సాధారణంగా హిందువులు.. మలేషియాలోని బాతు కేవ్స్ కి.. వింతగా వెళ్తారు. అలా వెళ్లేవాళ్లు ఒళ్లంతా.. కుట్లు పెట్టించుకుని వెళ్తారు. ఈ సంప్రదాయం.. సుభ్రమణ్య స్వామికి ప్రత్యేకం.

నైట్ హంటింగ్
హిమాలయాల్లో భయంకరమైన సంప్రదాయం ఉంది. పెళ్లి చేసుకోవాలి, ప్రేమ కావాలి అనుకునే అబ్బాయిలు.. గదులను వెతుక్కుంటూ వెళ్లాలి. ఏ గదిలోకి వెళ్తే.. అక్కడ ఉన్న అమ్మాయితో రాత్రంతా గడపాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే.. వాళ్ల తండ్రి పొలంలో.. పనిచేసే శిక్ష ఉంటుంది.

యనోమమి
అత్యంత చెండాలమైన ట్రెడిషన్ ఇదేనేమో. యనోమమి అనే ప్రాంతంలో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి ఎముకల పొడితో.. సూప్ తయారు చేసుకుని.. ఆ కుటుంబం మొత్తం తాగుతుంది. ఇలా తాగడం వల్ల.. చనిపోయిన వ్యక్తి ఆత్మ వాళ్లదగ్గరే ఉంటుందని వాళ్ల నమ్మకమట.

పెళ్లికి ముందు
బలి అనే ప్రాంతంలో పెళ్లికి ముందు ఈ భయంకరమైన ఆచారం ఉంది. స్మూత్ గా ఉండే పళ్లు.. కోపం, స్వార్థం వంటి ఆలోచనలను అణిచేస్తుంది. అందుకనే.. పెళ్లికి ముందు అమ్మాయిలు.. ఇలా చేయించుకోవడం ఇక్కడ ఆచారమట.

బేబీని కింద పడేయడం
50 అడుగుల ఎత్తు నుంచి.. పిల్లలను కింద పడేస్తారు. వామ్మో వినడానికి ఒళ్లు గగుర్పుడుతోంది. అలా పడేసిన బేబీని క్లాత్ సహాయంతో పట్టుకోవాలి. ఈ సంప్రదాయాన్ని ఎక్కడో కాదు.. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తారు.
Image Courtesy

చేతివేళ్లు కట్ చేసుకోవడం
డాని ట్రైబ్ కి చెందిన వాళ్లు.. చనిపోయిన వాళ్ల పట్ల బాధను తెలియజేస్తూ.. వాళ్ల చేతివేళ్లను కట్ చేసుకుంటారు. అలాగే ముఖంపై చనిపోయిన వాళ్ల బూడిద ముఖానికి రాసుకోవాలి. ఇదో భయంకరమైన ఆచారం కదూ..!
Image Courtesy



Click it and Unblock the Notifications
