Latest Updates
-
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు
ప్రపంచంలోనే ఖరీదైన, విసుగు కలిగించే విషయాలు
ప్రపంచంలో క్రేజీ వ్యక్తులు పెరిగిపోయారు. అందుకే వరల్డ్ క్రేజీగా మారిపోయింది. ఈ క్రేజీ ప్రపంచంలో మనం అనేక అవివేకమైన, అజ్ఞానమైన విషయాలను చూడాల్సివస్తోంది. కొన్ని సార్లు ఆ విషయాలు ఖర్చుతో కూడినవిగా ఉన్నా ఆశ్చర్యం లేదు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన, విరక్తి కలిగించే కొన్ని విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాం. అవి ఆశ్చర్యాన్ని కలిగించినా.. చాలా విసుగు పుట్టిస్తాయి. మరి ఆ విషయాలేంటో మీరే చూడండి..

స్కార్లెట్ జాన్సన్ వాడిన టిష్యూ
అవును, మీరు చదవింది నిజమే!. ఆమె ఉపయోగించిన టిష్యూ ను అధిక మొత్తంలో అమ్మబడింది. ఆ టిష్యూ 5300 డాలర్లకు అమ్ముడుపోయింది. ఒక వెర్రి అభిమాని ఆమె ఉపయోగించిన టిష్యూ ని ఇంత ఖర్చు చేసి మరీ కొన్నాడు. ఆ డబ్బు ను దాతృత్వం కోసం ఉపయోగించినా అది ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

పక్షి గూడు సూప్
మీరు గూడు అనగానే ఒక పక్షి యొక్క నివాసమని అనుకోకండి. ఈ సూప్ ఒక పక్షి యొక్క గట్టిపడిన లాలాజలంతో తయారవుతుంది. ఈ సూప్ ఒక్కొక్క కప్పు 40-60 డాలర్లకు దొరుకుతుంది. ఇది చైనా లో చాలా ప్రసిద్ది చెందిన వంటకం. అలాగే ఈ సూప్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

తిమింగలం వాంతి
ఇంతకు ముందు చదివినది ఏవగించుకుంటే మాత్రం ఇది మీకు నచ్చుతుంది. తిమింగలం వాంతిని అమ్బెర్గ్రిస్ అని కూడా పిలుస్తారు. దీనిని ఒక జంట 70,000 డాలర్లకు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విసుగు చెందే విషయాలలో ఇది ఒకటి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే దీనిని సెంట్ ల తయారీలో ఉపయోగిస్తారు.

మానవ మలం
ఇది నిజంగా చాలా క్రేజీ విషయం. కానీ ఇది చాలా సీరియస్ వ్యాపారం. కొన్ని వ్యాధులను నయం చేయటానికి ఉపయోగిస్తారు. నిజంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి మలం ఆస్పత్రులకు అమ్మబడుతుంది. దీని ద్వారా సంవత్సరానికి 13,000 డాలర్లు వరకు పొందవచ్చు.

పిశాచాల ఫేస్ లిఫ్ట్
ప్రముఖ సెలబ్రేటి కిమ్ కర్దాశియన్ ఈ ప్రక్రియను చేయించుకొని ఫోటో పోస్ట్ చేయటంతో ఈ క్రేజీ ఫేస్లిఫ్ట్ కి ప్రజాదరణ వచ్చింది. దీని కోసం 950 డాలర్ల నుంచి 1,400 డాలర్ల వరకు ఎంతైనా ఖర్చు చేయవచ్చు. ఈ ఫేస్లిఫ్ట్ ప్రక్రియలో ఒక వ్యక్తి యొక్క చేతి నుంచి రక్తంను తీసి ఉపయోగించటం జరుగుతుంది. అంతేకాక ప్లేట్లెట్లను సెంట్రిఫ్యూజ్ చేసి వేరు చేస్తారు. ఇది దీర్ఘ కాలంగా జరిగే ప్రక్రియ.

ఏనుగు పేడ బీర్
ఏనుగు పేడ నుంచి బీర్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తికీ హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ఈ క్రేజీ ఆలోచన చాలా మందికి నచ్చింది. అందుకే ఒక సీసా విలువ 100 డాలర్ల వరకు ఉంటుంది.

పక్షి రెట్ట ఫేషియల్
ఇది బ్యూటీ ఇండస్ట్రీలో చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే ఒక సెషన్ కి దాదాపుగా 180 డాలర్లు ఖర్చు అవుతుంది. ఈ క్రేజీ ఆవిష్కరణ చేసిన వారికి సరైన మోతాదులో పక్షి రెట్ట పడి ఉండవచ్చు.

కోపి లువాక్ కాఫీ
ఇండోనేషియన్ పునుగు పిల్లుల నుంచి తీసిన రెట్టను ఒక కప్పు చొప్పున 90డాలర్లకు విక్రయిస్తుంటారు! పిల్లులు కాఫీ బీన్స్ తింటే అది జీర్ణం అయ్యి, అది వేసే రెట్ట కాఫీ వాసన వస్తుందని నమ్మకం.

గొర్రెల ప్లాసెంట ఫేషియల్
ఎవరైనా ఈ ఉత్పత్తిని ఫేషియల్ కోసం ఉపయోగిస్తారా? ఇది చాలా విసుగు కలిగిస్తుంది. ఈ ఫేషియల్ మాస్క్ కోసం 500డాలర్లు ఖర్చవుతుందట. ఈ ఫేషియల్ వల్ల ఇన్ల్ఫమేషన్ తగ్గి.. స్కిన్ ఇమ్యునిటీ పెరుగుతుందట.



Click it and Unblock the Notifications