మీ రాశిని బట్టి మీ భాగస్వామితో రిలేషన్ ఎలా ఉంటుంది ?

By Swathi

సాధారణంగా పెళ్లైన జంట..ఒకరిపై ఒకరు చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. సినిమా, షికార్లు, రెస్టారెంట్స్, షాపింగ్.. వంటి సరదాలే కాకుండా.. ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవాలని, ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలని భావిస్తారు. కానీ.. కొంతమంది.. ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతారు.

ఒకరిని ఒకరు అర్థం చేసుకునే దాన్ని బట్టి వాళ్ల రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే.. పెళ్లైన తర్వాతే.. ఒకరితో ఒకరు మరింత క్లోజ్ గా ఉంటారు. అయితే.. మీ భాగస్వామి రాశిని బట్టి.. వాళ్లతో రిలేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మరి మీ భాగస్వామి రాశి ప్రకారం వాళ్లతో రిలేషన్ ఎలా ఉంటుంది ? ఎలాంటి సమస్యలు, సంతోషాలు ఉంటాయో తెలుసుకోండి..

మేషరాశి

మేషరాశి

మేషరాశి వాళ్లు.. రొమాన్స్, లవ్ ప్రపోజల్స్, రిలేషన్స్ లో చాలా నిర్ణయాత్మకంగా ఉంటారు. వాళ్లే బాస్ గా ఉంటారు. ప్రేమ విషయంలో.. నిజాయితీగానూ, స్వార్థంగానూ ఉంటారు. వీళ్లు ముక్కుసూటిగా ఉండటాన్ని, గేమ్స్ ని ఇష్టపడరు.

ఎక్స్ పెక్ట్ చేయకూడనివి

ఎక్స్ పెక్ట్ చేయకూడనివి

మేషరాశి వాళ్లకు ఫ్లవర్స్ కొనే అలవాటే ఉండదు. ఇప్పటికీ, ఎప్పటికీ కొనరు. కొన్నిసార్లు మీ బర్త్ డే కూడా మరచిపోయే అవకాశాలుంటాయి.

ఎక్స్ పెక్ట్ చేయాల్సినవి

ఎక్స్ పెక్ట్ చేయాల్సినవి

కానీ మీ మీద ప్రేమ, డబ్బు, సమయం, గౌరవం అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకాశం ఎత్తుకి తీసుకెళ్తాయి.

వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వాళ్లు.. చాలా మృదువైన, ఉదారమైన స్వభావం కలిగి ఉంటారు. వీళ్లు సంబంధం విషయంలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. వీళ్లు లగ్జరీని ఇస్టపడతారు. చాలా అందమైన రెస్టారెంట్స్ లో తరచుగా భోజనం, ఫ్లవర్స్, గిఫ్ట్స్ వంటివి ఇచ్చి సంతోషపెడతారు. అలాగే మీ కోసం పాటలు కూడా రాస్తారు.

రిలేషన్

రిలేషన్

కానీ చాలా గట్టిగా అరవడం, కష్టపడటం, పబ్లిక్ లో మీ గురించి చెప్పడం వంటివి మీకు కాస్త ఇబ్బందిపెడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిధునం

మిధునం

మిధున రాశివాళ్లు.. మానసిక అన్వేషకులు. చాలా తెలివిగా తమ భాగస్వాములకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు మరీ క్లోజ్ అవ్వాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే.. వాళ్లకు ప్రశాంతంగా ఉండటం, చాలా పాసినేట్ ఉండటం, రిలేషన్ లో డ్రమాటిక్ గా ఉండటం ఇష్టం ఉండదు. కానీ.. మీకు మాత్రం ప్రేమను పంచుతారు.

రిలేషన్

రిలేషన్

మిధున రాశి వాళ్లు కొన్ని సార్లు ఫ్లవర్స్, పర్ఫ్యూమ్స్, బుక్స్ ఇస్తారు. కానీ కొన్ని సార్లు మాత్రం చాలా చిరాగ్గా, చాలా మూడీగా ఉంటారు. కానీ ఎమోషనల్ గా, ఫిజికల్ గా మీకు చాలా నిజాయితీగా ఉంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వాళ్లు చాలా గౌరవప్రదంగా ఉంటారు. వాళ్ల భాగస్వాములకు డెడికేటెడ్ గా ఉంటారు. చాలా అద్భుతమైన ప్రేమ, అఫెక్షన్ చూపిస్తారు. వీలైనప్పుడు గిఫ్ట్స్ తో.. అభినందిస్తారు. ఎంత వీలైతే అంత.. గొడవలకు దూరంగా ఉండాలని భావిస్తారు. తాము ప్రేమించేవాళ్లకు అన్నీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు.

రిలేషన్

రిలేషన్

కర్కాటక రాశివాళ్లు వాళ్ల ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని దాచుకుంటారు. కొన్నిసార్లు.. సీక్రెట్ గా రివెంజ్ తీర్చుకునే తత్వం కూడా ఉంటుంది. చాలా రఫ్ టోన్, వాయిస్ ఉంటుంది.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వాళ్లు.. చాలా ధైర్యవంతులు. చాలా అందంగా ఉంటారు. సంబంధాల్లో చాలా ప్రొటెక్టివ్ గా, సెంటిమెంటల్ గా అఫెక్షన్ కలిగి ఉంటారు. వీళ్లు మిమ్మల్ని మంచి రెస్టారెంట్స్, చాలా ఖరీదైన పర్ఫ్యూమ్స్, ఫ్లవర్స్ వంటి వాటితో.. మీకు చాలా లగ్జరీ లైఫ్ అందిస్తారు. అయితే వీళ్లతో రొమాన్స్ కాస్త ట్రబుల్ గా ఉంటుంది.

రిలేషన్

రిలేషన్

సింహరాశి వాళ్లు తాము ప్రేమించేవాళ్ల పట్ల చాలా కమాండింగ్ గా, పాలించే విధంగా బిహేవ్ చేస్తారు. ఏం చేయాలి, ఏం వేసుకోవాలి అనేది చెబుతారు. రిలేషన్ లో స్వార్థం ఫీలవయ్యే అవకాశం ఉంటుంది.

కన్యారాశి

కన్యారాశి

కన్యారాశి వాళ్లు రొమాన్స్ లో క్వాలిటీ కంటే.. క్వాంటిటీనే ఎక్కువ ఆశిస్తారు. మరీ ఎక్కువ ఎమోషన్స్, సెంటిమెంట్, ప్రామిసెస్, అఫెక్షన్ వంటివి కాస్త కష్టం. చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. చాలా ప్రాక్టికల్ గా, వాళ్లు బాధ్యతను వాళ్లు నిర్వర్తిస్తారు. ఫ్యామిలీపై తమకు చాలా అభిమానం ఉంటుంది.

రిలేషన్

రిలేషన్

కర్కాటక రాశి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ వీళ్లు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా.. పట్టించుకోకూడదు.

తులారాశి

తులారాశి

తులారాశి అంటే ప్రేమ. వీళ్లకు ప్రేమ అనే పదం పర్వాయపదంగా చెప్పవచ్చు. తమ భాగస్వాములు లేకుండా.. అస్సలు ఉండలేరు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. చాలా పర్ఫెక్ట్ అందం, తెలివి ఉంటుంది. ప్రశాంతత, ప్రేమను రిలేషన్ లో పొందుతారు. అన్నీ తమ భాగస్వాముల కోసం చేస్తారు.

రిలేషన్

రిలేషన్

ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు గొడవలకు కారణమయ్యే సంభాషణను వీళ్లే ముగిస్తారు. అరవడం, వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నమ్ముతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్లు.. తమ భాగస్వాముల పట్ల చాలా రొమాంటిక్ గా ఉంటారు. చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. మీ అర్ధంలేని విషయాలను.. ఏమాత్రం సహించరు.

రిలేషన్

రిలేషన్

వృశ్చిక రాశి వాళ్లు అంత ఆత్రుత కలిగి ఉండరు. కానీ వీళ్ల మాటలు.. ఇతరులపై దుష్ర్పభావం చూపుతాయి. కానీ వీళ్లకు మాత్రం వాస్తవం వాస్తవమే అని నమ్ముతారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

ధనస్సు రాశి వాళ్లు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ల రొమాంటిక్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. క్యాజువల్ రిలేషన్స్ కోసం చూస్తారు. చాలా ఉదారంగా, ఫన్నీగా ఉంటారు. మీకు ఎలాంటి లెక్చర్స్ ఇవ్వరు.

రిలేషన్

రిలేషన్

ఇతరుల జోక్యాన్ని తట్టుకోలేరు. ఫ్రీడం అనేది చాలా విలువైనది. కోపంగా ఉన్నప్పుడు.. హ్యాండిల్ చేయడం చాలా కష్టం.

మకర రాశి

మకర రాశి

మకరరాశి వాళ్లు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వాళ్ల ఎమోషన్స్ ని తేలికగా తీసుకోరు. ముందుగా భవిష్యత్ ని చాలా ప్లాన్ చేస్తారు. మీకున్న అన్ని భయాల నుంచి.. మీకు మంచి రక్షణగా ఉంటారు.

రిలేషన్

రిలేషన్

మకరరాశి వాళ్లు.. వీళ్లు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు. కొన్ని సార్లు ఎదుటివాళ్లు చెప్పినదే కరెక్ట్ అని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి వాళ్లు ప్రేమ కంటే.. ఫ్రెండ్ షిప్ కే విలువ ఇస్తారు. ముందుగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎంచుకుని.. తర్వాత ప్రేమిస్తారు. ప్రేమ అనేది నిస్వార్థమైన ఎమోషన్ అని నమ్ముతారు. చాలా ఎంజాయ్ చేస్తారు. వీళ్లు ఇతరులతో క్లోజ్ అవడానికి టైం పడుతుంది.

రిలేషన్

రిలేషన్

తాము ప్రేమించిన వాళ్లు చేయాలి అనుకున్న తర్వాత.. అది చేసి తీరుతారు. కొన్నిసార్లు సాక్రిఫైజ్ కూడా చేస్తారు. మీ స్వతంత్రతకు విలువ ఇస్తారు.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వాళ్లతో.. అవధులులేకుండా.. రొమాన్స్ ఎంజాయ్ చేయవచ్చు. చిన్న విషయమైనా..చాలా ఆగ్రహానికి కారణమవుతాయి.

రిలేషన్

రిలేషన్

వాళ్లు ఇష్టపడే జీవితాన్ని, వాళ్ల కలలను, ఫ్రీడమ్ ని కోల్పోవాల్సి వస్తే.. ఏమాత్రం తట్టుకోలేరు. వీళ్లకు కోపం వచ్చిన తర్వాత.. కూల్ అవడానికి సమయం పడుతుంది.

Desktop Bottom Promotion