Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ప్రపంచంలోనే ఇండియాని మొదటిస్థానానికి తీసుకెళ్లిని విషయాలు !!
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడో కవి. అదే తరహాలో మన దేశం మనం గర్వించేలా మారుతోంది. అనేక విషయాల్లో మనల్ని సంతోషపెడుతోంది మన భారతదేశం. చాలా అంశాల్లో ఇండియా ప్రపంచంతో పోటీపడుతూ.. మనల్ని గర్వపడేలా చేస్తోంది.
ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు
ఇండియాలో ఎలాంటి విషయాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందో తెలుసుకోవాలనుందా ? అవును ఇండియా ఆసక్తికర రంగాలు, కేటగిరీల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. అలాగే కొన్ని రంగాల్లో ప్రపంచంలోనే మొదటి ప్రయత్నం, మొదటి విజయం దక్కించుకున్న ఘనత కూడా భారతావనిదే. మరి అలాంటి ఆసక్తికర విషయాలేంటో తెలుసుకోవాలనుందా.. ?

మంగళ్యాణ్
మంగళ్యాణ్ గురించి ప్రతి ఇండియన్ గర్వంగా ఫీలవ్వాల్సిందే. ఎందుకంటే.. మొదటిసారి మార్స్ ఆర్బిటర్ మిషన్.. మంగళ్యాణ్ ను లాంచ్ చేసినది మన ఇండియానే. అది కూడా మార్స్ ఆర్బిటర్ కి పంపిన ఈ మంగళ్యాణ్ సక్సెస్ అవడం విశేషం.

పొగాకు వార్నింగ్
స్మోకింగ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను సిగరెట్ ప్యాక్ లపై వార్నింగ్ ఇస్తున్న మొదటి దేశం ఇండియానే. స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలను దాదాపు ముందుభాగంలో ఇమేజ్ ద్వారా వివరిస్తూ.. వెనకవైపు వార్నింగ్ ఎఫెక్ట్ లను హెచ్చరిస్తుంది.

రీడింగ్ హ్యాబిట్స్
మీకు తెలుసా ? రీడింగ్ లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఇండియా ఉంది. ఇండియన్స్ బుక్ రీడింగ్ ని ఎక్కువగా ఇష్టపడతారు.

వ్యవసాయ ఉత్పత్తులు
గింజలు, ధాన్యాలు, పత్తి, రకరకాల పండ్లు, బీన్స్, అల్లం, జీలకర్ర, మిర్చి, పసుపు పండించడంలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. వీటన్నింటినీ.. భారీ మొత్తంలో ఇండియా ఉత్పత్తి చేస్తుంది.

పోస్ట్ ఆఫీస్
ప్రస్తుతమున్న టెక్నికల్ యుగంలో కూడా.. పోస్ట్ ఆఫీస్ లు ఉన్నాయంటే నమ్ముతారా ? నిజమే.. ఈమెయిల్స్, ఎస్ఎమ్ఎస్ లు అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ.. ఇండియాలో పోస్టల్ డిపార్ట్ మెంట్ చాలా యాక్టివ్ సాగుతోంది.

స్టాక్ ఎక్సేంజ్
ముంబైలో ఉన్న స్టాక్ ఎక్సేంజ్.. ఏసియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్సేంజ్. ఇక్కడ ప్రతి 6 మైక్రో సెకన్లకు ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ 137 ఏళ్ల క్రితం నిర్మించినది. ఇందులో 5 వేలకు పైనే కంపెనీలు ఉన్నాయి. ఇంకేం ఇంతకంటే.. గర్వకారణం ఇంకేమైనా ఉంటుందా ఇండియన్స్ కి!

బాలీవుడ్
బాలీవుడ్ !! ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఒకటి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బాలీవుడ్ లో ఏడాదికి కనీసం 16వందల సినిమాలు రిలీజ్ అవుతాయి.



Click it and Unblock the Notifications
