Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఇండియాను భయపెట్టిన అత్యంత భయంకరమైన సంఘటనలు
యాక్ట్ ఆఫ్ గాడ్..!! ఈ పదం గుర్తుందా ? వెంకటేష్, పవన్ కణ్యాన్ సినిమా గోపాలా గోపాలా సినిమాలో ఎక్కువగా వినిపించిన పదం. అంటే ప్రకృతివైపర్యాలను యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రకృతిలో జరిగే మార్పులు, వైపరిత్యాలు అనేక ప్రమాదాలు, నష్టాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి కొన్ని వస్తువులు, సంపద నాశనం అయితే.. కొంతమంది జీవితాలు కోల్పోతారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం పడుతుంది.
ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు
అయితే ఇండియాలో చోటుచేసుకున్న కొన్ని ప్రకృతి వైపరిత్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా టెర్రిబుల్ గా, మరిచిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అలాంటి భయంకరమైన విపత్తులు ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

బెంగాల్
1770లో బెంగాల్ లో వచ్చిన కరువు చాలా భయంకరమైనది. ఆ సమయంలో వచ్చిన కరువు చాలామందినే బలి తీసుకుంది. దీనికారణంగా దాదాపు కోటి మంది చనిపోయారు. అంటే ఆ రాష్ర్టంలోని జనాభాలో మూడో వంతు మంది కరువుకి బలయ్యారు.
మళ్లీ 1943లో బెంగాల్ లో వచ్చిన కరువు కూడా జనాభాకు తీరని నష్టం తీసుకొచ్చింది. అప్పుడు 40 లక్షణ మంది చనిపోయి ఉంటారు.
హావభావాల సమ్మేళనం భారతీయ నృత్యకళారీతులు

ఆంధ్రప్రదేశ్
1835లో యాక్ట్ ఆఫ్ గాడ్ ప్రభావం ఆంధ్రాపై కూడా ప్రభావం చూపింది. తూర్పు గోదావరి జిల్లాలో ఉండే కోరంగిలో సంభవించిన సైక్లోన్ ఆ గ్రామాన్ని తుడిచిపెట్టుకుని పోయేలా చేసింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 3.2 లక్షల మంది చనిపోగా, 25 వేల షిప్ లు కొట్టుకుపోయాయి.

గుజరాత్
ఇండియాలో వచ్చిన అతి భయంకరమైన భూకంపం గుజరాత్ లో సంభవించింది. 2001లో వచ్చిన ఈ భూకంపం రిక్కర్ స్కేల్ పై 7.9 గా నమోదైంది. 2001 జనవరి 26న సంభవించిన ఈ భూకంపంలో 30 వేల మంది చనిపోయారు. అంతేకాదు చాలా గ్రామాలు నాశనమయ్యాయి.
విశ్వంలోనే నెం.1 శ్రీమంత దేవాలయం మన ఇండియాలో ఉంది!

ఇండియన్ ఓసియన్
ఇండియన్ ఓషియన్ లో సంభవించిన సునామీ మరింత భీకరమైనది. 2004లో సముద్రంలో వచ్చిన ఈ సునామీ రిక్టర్ స్కేల్ పై 9 గా చూపించింది. ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ లో కనీసం 10 వేల మంది చనిపోయి ఉంటారని, లక్షా 50 వేల మంది ఈ సునామీ బాధితులను భారతీయ రికార్డ్స్ చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్
2013లో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఈ వరదలు చాలా భయంకరమైనవి. అనేక పంటపొలాలు నాశనమయ్యాయి. అలాగే.. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిస్సయ్యారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల ఇండియాలో సంభవించిన భయంకరమైన ప్రకృతి విపత్తులు.



Click it and Unblock the Notifications
